పత్రికా ప్రకటనలు

కవి, కార్యకర్త, విప్లవాభిమాని నల్లెల రాజయ్యకు నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు. కొన్నిటికి
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం
కవిత్వం

నేనొక ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడా మనిషి మరో మనిషిని హీనపరచలేని ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో దాని దారులను శాంతితో అలంకరిస్తుందో ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను ఎక్కడ నలుపో తెలుపో మీది ఏ జాతైనా అవ్వొచ్చు భూమి వరాలు అందరికీ పంచబడాల ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ దౌర్భాగ్యం తల వేలాడేయగలదో సంతోషం ముత్యంలా మెరవగలదో అందరి అవసరాలూ చూసే మానవత్వం
సమీక్షలు

భీమా నది ఘోష 

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది. ‘‘చరిత్ర కన్నులోంచి దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను మూగబోయిన అలల తీగలపై పురిటి బిడ్డల తొలి ఏడుపునై పెల్లుబుకుతున్నాను..’’ అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.             ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి
కాలమ్స్ లోచూపు

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా
సాహిత్యం

మూసీ నది మాట్లాడితే ….    నా అనుభవాలు 

కవిని ఆలూరి .  నేను గత 22 సంవత్సరాలు గా  లెక్చరర్ గా పనిచేస్తున్నాను . పది సంవత్సరాల క్రితం మా కుటుంబం హైదరాబాద్ లోని శివం రోడ్ లో ఉన్న బాగ్ అంబర్ పేట్ లో ఉండేది . కాలేజీకి వెళ్ళటానికి  బతకమ్మ కుంట దగ్గర ఉన్న బస్ స్టాప్ లో బస్ ఎక్కేదాన్ని . బాగ్ అంబర్ పేట్ నుంచి బతుకమ్మ కుంట మీదుగా నడుచుకుంటూ బస్టాప్ కు వెళ్ళే దాన్ని . కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బతుకమ్మ కుంట గుడిసెవాసులను చూస్తుండేదాన్ని . ఆడవాళ్ళు ఎక్కువ శాతం చిత్తుకాగితాలు ఏరేవాళ్ళు  ,మొగవాళ్ళు చెత్త బండీని నడపటం లాంటివి చేస్తుండే వాళ్ళు . ఒక గుడిసె ముందు అయిదు
ఇంటర్వ్యూ సంభాషణ

రాజ్యాంగాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూడాలి

(భార‌త రాజ్యాంగానికి ఈ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌ధంగా ప‌ట్టి ఉంచే స్వ‌భావం ఉంద‌ని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్ర‌జానుకూల ఆద‌ర్శాలు అమ‌లు కాగ‌లిగే స్థితిలో మ‌న రాజ‌కీయార్థిక, సాంఘిక వ్య‌వ‌స్థ లేద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మోగాక విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండాల‌ని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వ‌సంత మేఘం టీం) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య