కొత్తగా నిర్మించుకున్న నేను
రాతన్నాక అప్పుడప్పుడులోకాన్ని నగ్నపరచి రాయాలనగ్నంగా విన్న దాన్ని వాస్తవీకరించాల్ననలిగిన దేహాల్నిమాటల్ని గాకసరికొత్త వాక్యం పుట్టించాల్నకోపమొస్తే కొవ్వొత్తిలా కరిగిఅగ్నిలా వెలుగొందాల్న నిప్పులు చిమ్మాల్న చపాతిముద్దలా పిసకబడ్డ కోమల జీవితాలను వర్ణించాల్న నీవొకకొత్త వాక్యాన్ని నిర్మించావంటేనువ్వొక నూతన రూపం ధరించాల్సిందే మట్టి పిసికినప్పుడల్లా నూతన రూపంధరించలేదా..?మనిషి మనిషి కానప్పుడు మట్టే కదా.!నీచేతిలో ఎదిగినాక్షరాలుకూసింతమందికైనా గొడుగుపట్టాలసెగలుగక్కే డ్రైనోసర్ల నుంచి పీడుతుల్ని రాసిన పదాల ధైర్యంతో వారిచుట్టూరాఒక్కొక్క ముళ్ళకంచయి వలయాన్ని చుట్టాల్నఅధికార మొత్తు మేఘాల్నిపదాల ఉరుముల్తో కిందాకి దించాల్నా.ఒక్కొక్క పాదంలో నువ్వొక కొత్తప్రాణిలాజన్మించాలా.పదాల్లో జీవించాలాపదాల్ని జీవింపచేయాలతొలకరి జల్లుల తాకిడికి విత్తు వికసించినట్లుపాఠకునిలోభిన్నత్వాన్ని విసర్జించి ఏకత్వాన్ని బోధించాల్నా.కవిత్వమంటే అంతరాల్లో మధించి మధనపర్వతం నుండొప్పోంగే లావానే కదాకవి










