కవిత్వం

అర్బన్ నక్సల్

మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ మిగిలి ఉండకూడదన్నదే ఈ మాట వెనక సూత్రం కానీ ఇది ఇప్పుడు ఒక అవార్డులా తయారయింది ఇలా నువ్వు ఎవరి గురించైనా చెప్పావంటే వాళ్ళు నిన్నంతగా భయపెట్టారని ప్రజలు గుర్తిస్తున్నారు స్వేచ్ఛను ఇంతలాహరించిన ప్రతిసారీ అది చీకట్లను తెంచుకుని మరలా రివ్వున పైకి లేస్తుందిగొంతులపై మోపిన ఉక్కు పాదాన్ని పెకలించే నాగలిగా రూపాంతరం చెందుతుంది సరిహద్దులలోనిసైన్యాన్ని ప్రజలపై మోహరిస్తున్న ఈ కాలంలో రైతులు నీ సరిహద్దులను చుట్టుముట్టి వున్నారు ఓట్ల
కవిత్వం

లేనిది మరణమే!

నిజమే! అప్పుడప్పుడుమరణాలు గురించి మాటాడుకుంటాం, జీవితం నిండా విజయదరహాసాలనువెదజల్లుకుంటూ నడిచిన ప్రయాణాల గురించి చర్చించుకుంటాంమరణం దాకా ప్రవహించిన ఎగుడుదిగుళ్ళ ప్రవాహాల గురించీమాట్లాడుకుంటాం..దారులలో ముళ్ళను ఏరుకుంటూ గాయాల మూటల్లోకిబతికుని సర్దుకుంటూఅనుకున్న పనులు నిర్వహించుకుంటూ శ్వాస ఆగేదాకా సాగిన ప్రవాహాల గురించి చర్చించుకుంటాం అతడు మిగిల్చిపోయిన పనులని స్నేహితుల మధ్యలో పంచుకుంటాం దేహంలో అరణ్యం లా అతడి భావాల్ని పెంచుకుంటాం అంతరంగం నిండా అతడిక్కడ వొదిలి వెళ్ళిన ఉద్యమ పవనాల్ని పీల్చి ఆ గాలిలో అతడి ప్రాణాన్ని వెదుక్కుంటాంఅతడెప్పటికీ మనల్ని వీడిపోలేదనే ఆలోచన మన నడకలో వేగాన్ని పెంచుతుందిమరణాలతో మనం దేహాల్ని కోల్పోవచ్చు కానీ చాలా మరణాలు జీవించడాన్ని కోల్పోవు అవి
కవిత్వం

ఆకుతేలు

నువ్వు పట్టాభూమిని దున్నుతవుపరంపోగును దున్నుతవునీ కర్రు గట్టితనం గొప్పదిబయటి బాపతులుఇంటిదాక వచ్చిపొయిల ఉప్పు పోసినాచిటపొట చిచ్చు రేగినాఇంటా, బయటా తెల్వకుండాబహురూపుల విన్యాసాలు ఎన్నోఇది తెలిసిన వారికి తెల్క పిండితెలువని వారికి గానుగ పిండిరెండూ ఒకటేననిబైరాగి చేతిలోని తంత్రి తల నిమురుతుంది.ఇసుకలో నూనె పుట్టించడంఇరుసుకు కందెన రాయకుండానేనడిపించే ఉపాయం నేర్పడంనీకు తెలుసుపత్రికల్లో వచ్చినపతాక శీర్షికలనుపేర్చి కూర్చితే అది కవిత్వం కాదుసంపుటాల కుంపట్లు ఎన్ని వెలిగించినా అగ్గి లేకుంటేఅది కుమ్మై కూలుతుందిగూడ పోయి యాతం వచ్చిందియాతం పోయి మోట వచ్చిందిమోట పోయి రాటు వచ్చిందిరాటు పోయి ఆయిల్ ఇంజన్ వచ్చిందిఆయిల్ ఇంజన్ పోయి అంటుకుంటేనేమాడి మసై పోయేకరంటు మోటర వచ్చింది.గూడ కాడ
కవిత్వం

కొత్త సంవత్సరమయినా మాట్లాడుదాం..!

ఎప్పడు మాట్లాడేదే అయినా ఇంకా ఇంకా మాట్లాడాలి కొత్త నినాదాలతో మాట్లాడాలి కొత్త రూపాలను సంతరించుకొని అన్ని తలాలకు విస్తరించే విధంగా నువ్వు- నేను కలిసి కట్టుగా మాట్లాడాలి కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి నిజాన్ని నిగ్గు తేల్చేలా మాట్లాడాలి..!ప్రపంచ నలుమూలను దిగ్బంధనంగా మార్చినా అమెరికా సామ్రాజ్యవాదం ఆయుధ భాండాగారంతో ఆధిపత్యానికి అర్రులు చాస్తూ దేశ దేశాల మీద గుత్తాధిపత్యానికి తెర లేపే యుద్దాలకు బలైపోతున్న దేశ ప్రజలు ఎందరో ఈ గాయాలకు మందు రాయడానికైనా మాట్లాడాలి ఇప్పుడు ఎప్పడు మాట్లాడాలి నువ్వు- నేను కలిసి కట్టుగానే మాట్లాడాలి కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి కాశ్మీర్ జాతి కోసం
కవిత్వం

అరుణ్ కాలా కవితలు రెండు

ఆయుధం అనివార్యం….చట్టం ఒకరికి చుట్టం అయినప్పుడుఉన్మాదం నడి వీధిలో కవాతు చేస్తుందిబతుకే భారంగా సాగుతున్న అమాయకపు జనాల మీదఉక్రోశాన్ని చూపిస్తూ శివతాండవం చేస్తుందిఇది తప్పు అని ప్రశ్నిస్తే శూలం గుండెలను చీల్చుకుంటూ నెత్తుటి మరకలను సృష్టిస్తుందిరామ బాణం అంత వేగంగా బుల్లెట్ వర్షం ఇంటి గుమ్మం ముందు కురుస్తుందిపొత్తి కడుపులో పిండాన్ని తీసి మతం రంగు పులిమి దేశభక్తి గా మన మెదళ్లను చెదలు పట్టిస్తుంది….చట్టం చుట్టం అయితే నీవు నేను కాశయపు కత్తులకు ,ఖాకీ కర్రలకు బలికాక తప్పదుఅంతమంగా ఆయుధాన్ని పట్టక తప్పదు……. ఈ వెన్నెల రాత్రి కన్నీటిని మిగిల్చింది…..పచ్చని ఆకులతో అడవి చిగురిస్తున్న రోజుచీకటిని చీల్చుకుంటూ
కవిత్వం

ఆదిమ పూల వాసన

నేల ఒరిగిన ఓ శిరస్సు దాని పెదవులపై కత్తిరించబడ్డ చిరునవ్వు కనులలో ఒలికి గడ్డకట్టిన రక్త చారిక గాయపడ్డ గొంతులోంచి ఓ పాట ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ నీలోంచి ఉబికి వస్తూంది నువ్విదిల్చినా వదలని ఆ చిరునవ్వు నీలోకి ఇంకుతూ ఇగురుతూ నిన్ను అనామధేయుణ్ణి చేస్తూంది తొలి దారుల ఆదిమ పూల బాలింతరపు వాసనతో చుట్టూ పరివ్యాప్తమవుతూ మరల కార్యోన్ముఖుణ్ణి చేస్తూంది!!
కవిత్వం

విగ్రహం

నేలన మనుషులున్నంత కాలం విగ్రహాలెందుకు మనిషి మనిషి తో మాట్లాడనప్పుడే శిల్పాల సృష్ఠి మొదలు మట్టితో మమేకమైన జనంకు బొమ్మల లొల్లి పట్టదు రుధిరం చెమట చుక్కై నుదుటి నుండి రాలుతుంటే చెక్కబడిన రాయి ధ్యాస వుండదు నాలుగు వేళ్ళు లోనికి వెళ్లటమే గగనమై పోతున్న చేతులకు శిల్పానికి దండం పెట్టే తీరిక ఉండదు వంగి వంగి నాట్లు వేస్తుంటే వంగిపోతున్న నడుములు నిటారుగా ఉన్న విగ్రహం చేతిలోని వరి వెన్ను ను కాంచ లేవవు ఎవరు వచ్చి పొడిసేదేమీ లేదనే ఇంగిత జ్ఞానం సాయం కోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూడదు తన చుట్టూ ప్రకృతి ని
కవిత్వం

చివరి పిచ్చుక

చివరిపిచ్చుక కొమ్మపై వాలింది బతుకునిచ్చిన లోకంలో తనకిదే ఆఖరి అరుపనిచుట్టూరా ధూళిమేఘంకమ్ముకుంది కూలుతున్న ఎత్తైన ఆశలగూళ్ళ కింద నవజాతాలుపిండాలు రూపం కోల్పోనాయి పిచ్చుక ఉహాగానంలో ఉంది నేను దేహాన్ని నిర్మిస్తే మీరా దేహంలో ఎముకలగూళ్ళు సృష్టించారు నేనొక ప్రకృతి రమణీయమిస్తే మీరందులో మృదంగాల్తో మృత్యుఘోషనుకానుకిచ్చారురెండహాల మధ్య రణమైతేరెండు తరాలకు సరిపడా గుండె సప్పుళ్ళు ఈ దినమే అంకితమివ్వడమేననియోచిస్తోంది కాలమై నిలిచి...!పిచ్చుక మళ్ళీ ఊహాగానం చేస్తుంది మనిషి యంత్రాలలోకం నుంచి ఆదిమలోకంలోకి పయనించాలని..!ఆయుధాలొదిలేసీప్రాణుల్తో మమేకమై ప్రకృతితో కంఠం కదిలించాలని ఊహాగానం చేస్తోందింకా.
కవిత్వం

త్యాగాల కల్పవల్లి

నువ్వు పుట్టి పురుడోసుకున్నవో లేదో కానీ ఏ అవ్వ బొడ్డు పేగు కోసి పేరు పెట్టిందో నీవు నిజంగానే పేదల ఇంటి గుమ్మాల రంగవల్లి వయ్యి నిలిచావు..!ఏ అసుర సంధ్యా తీరానా నువ్వు అడుగులు నేర్చావో కానీ అవి ఆకలి కడుపుల అన్నార్థుల జాడలు వెతక పయనమయ్యాయిఏ ఇంటి కడుపు పంటవయి పండావో కానీ కడుకు జనలను సోపతయ్యావు పల్లెలో అక్షరాలు దిద్దిన నీ చేతి మునివేళ్ళు పట్టణం బాటలో పయనించి విశ్వవిద్యాలయాలో మొగ్గతొడిగిన పొలిటికల్ కమీసార్ వయ్యావు బిగి పిడికిలి జెండా పిలుపులో నువ్వు సాగిన ఆ కల్లోల ప్రాంతపు అరాచకాలను చూసి చలించిన నీ మనస్సు
కవిత్వం

ఎలా నమ్మాలి నిన్ను?

బిర్సా ను గౌరవించడమంటే అతని ఆశయాల్ని కొనసాగించడమే. *అతడు మతాన్ని వదులుకున్నాడు. నువు మతం ముసుగేసి అతడికి దండేస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను? *మా దిగంతం మాకుందిమమ్మల్ని మేముగా బతకనివ్వన్నాడతడునువ్వేమో మా నేలను మోసుకుపోతున్నావ్ఎలా నమ్మాలి నిన్ను? *చెట్టు మా దేవత అన్నాడతడునగర నవ నిర్మాణమని అడవిని ధ్వంసం చేస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను?*నను మనిషిగా మారమన్నదతడుమరి నువ్వు? నా గురించి మాట్లాడిన ప్రతివాడికీ ఒక అండాసెల్ సిద్ధం చేస్తున్నావ్ ఎలా నమ్మాలి నిన్ను?*ఆ రోజు అతడి గురి ఆంగ్లేయుడిపైనేఅది స్వాతంత్రపోరాటమన్నావ్ఈ రోజు?నాదీ స్వతంత్రపోరాటమంటే భయపడుతూ తూటాల వర్షం కురిపిస్తున్నావ్ఎలా నమ్మాలి నిన్ను?*అతణ్ణి గౌరవించాలంటే నన్నూ గౌరవించాలినన్ను గౌరవించాలంటే నా నేలను