సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
కాలమ్స్ సమకాలీనం

ఆన్ లైన్ విద్య బోధనలో అసమానత్వం

కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో
కాలమ్స్ లోచూపు

రాజ్యాంగం – ప్రొ. శేషయ్యగారి విమర్శనాత్మక హక్కుల దృక్పథం

గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది.
కాలమ్స్ కథావరణం

బతక నేర్చిన ప్రపంచాన్ని చూపించిన జూకంటి జగన్నాథం కథ – ఎరుక

లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని,
కాలమ్స్ ఆర్ధికం

విస్ఫోటనంలా నిరుద్యోగం, పేదరికం

నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌
కాలమ్స్ లోచూపు

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు
సాహిత్యం కాలమ్స్ అలనాటి రచన

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
కాలమ్స్ ఆర్ధికం

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
వ్యాసాలు ఓపెన్ పేజీ

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
కాలమ్స్ అలనాటి రచన

రాజూ-పేదా

మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని