కాలమ్స్ లోచూపు

త‌త్వ‌శాస్త్ర ప్ర‌థ‌మ వాచ‌కం

తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని  నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని  సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని 'పరలోకపు' విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది 'సృష్టించబడిందన్నది వాస్తవం'
కాలమ్స్ కవి నడిచిన దారి

స్వగతం

జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో
కాలమ్స్ ఆర్ధికం

ఎవ‌రి ఉద్దీపన?

కరోనా వ్యాధి మానవ జీవితాల్ని చిదిమి వేస్తున్నది. భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న భయం ఆందోళన కలిగిస్తున్నది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సాయం చేయడం, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా  పాలకుల ప్రాథమిక కర్తవ్యం. అందువల్ల కరోనా కష్టకాలం నుంచి ప్రజలను ఆదుకోవడం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలువడం అత్యంతావశ్యకం. యూరప్‌, అమెరికా వంటి దేశాల్లో ఆచరిస్తున్న విధానాన్ని సైతం పక్కన పడేసి నాటు వైద్య పద్ధతుల నాశ్రయించడం మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది.  కొవిడ్‌ వ్యాధిని నియంత్రించడంలో గానీ, బాధితులను
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పీడిత ప్రాంతాల కథ

పి.చిన్నయ్య రాసిన 'మెట్ట భూమోడు' , పీడిత ప్రాంతాల కథ.పీడిత ప్రజలవైపు నిలబడటం మనందరికీ తెలిసిన ఆదర్శభావం.ఈ కథ ఆ విలువ ను విస్తృతం చేస్తూ పీడిత ప్రాంతాల వైపు నిలబడమంటుంది.ఈ కథలో పీడిత ప్రాంతాన్ని ప్రేమించే ప్రొటాగనిస్టుది ఆ పీడిత ప్రాంతమే అయ్యుండవచ్చు.దాంతో తన ప్రాంతాన్ని తాను ప్రేమించక యేంచేస్తాడు అనుకోవచ్చు.అయితే యీ ప్రొటాగనిస్టుకు సుభిక్షమైన పచ్చని పంటలతో తులతూగే కాలువల ప్రాంతంలో స్థిరపడే, ఆస్తులు చేసుకొనే అవకాశం వచ్చినా వద్దనుకొని మెట్టభూముల్లోకి వెళ్తాడు.ఎందువల్ల?ఈ కథలోని ప్రొటాగనిస్టు టీచర్.కోదాడలో కాపురముంటూ, నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద వున్న రామచంద్రాపురం హైస్కూలు లో వుద్యోగం.ప్రజాసంఘాల వెనుక తిరిగే,
కాలమ్స్ లోచూపు

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
బహుజనం కాలమ్స్

‘బ్లాక్‌ ఇంక్‌’లో పిల్లల కన్నీరు

ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని. ‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు. క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను 'అంటరాని'గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని
కాలమ్స్ ఆర్ధికం

ఆధిపత్య లక్ష్యంతో బైడెన్‌ విదేశాంగ విధానం

అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..
కాలమ్స్ కథావరణం

*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి
కథ..కథయ్యిందా!

రాబందు – గాలివాన

ఇది, 'ఒక పక్షి కత'. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది. ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.'ఔచ్..'మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు  నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ
కాలమ్స్ కొత్త కవిత్వం

మానవుడే కవితా వస్తువు

ఆధునిక కవిత్వ  రచన దానియొక్క  రూప పరమైన  శిల్ప పరమైన చర్చ  చేసే టప్పుడు రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి.కవి  హఠాత్తుగా ఊడిపడిన సృజన కారుడు కాదు .తన అస్థిత్వం ,భౌగోళిక  స్థితి గతులు  తన అనుభవ౦ . రెండవది తన భావ జాలం. వీటిపై ఆధార పడిన ప్రాపంచిక  దృక్పధ ౦. కవిత్వ౦ మానవుని అంతర్ బహిర్ యుద్ధారావం  అనుకుంటే ,అంతిమంగా మానవుడు ,  మానవుని  అస్థిత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. రాజకీయ భావజాలం వుండట మనేది కవి యొక్క చైతన్యం పై ఆధార పడి వుంటుంది . రాజకీయ పరమైన అంశాలు  కవిత్వంగా  ఎలా మలచ