సంక్షేమ హౕస్టళ్ళు, గురుకులాల భవితవ్యం?
కోవిడ్ సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రత్యక్ష విద్యబోధన ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలత చెందిన కొంత మంది తల్లిదండ్రులు, వ్యక్తులు సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నిలిపివేయాలని పిల్ వేశారు. ఆగస్టు 31 నాడు అత్యవసరంగా హైకోర్టు బెంచ్ పాఠశాలల ప్రారంభంపై విచారణ జరిపి గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళను మినహాయించి మిగిలిన విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతినిచ్చింది.అదే సమయంలో గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళలో కోవిడ్ నిబంధనలు అమలుపై, అక్కడి వసతుల కల్పన, కనీస సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురుకులాలో, సంక్షేమ హౕస్టళ్ళలోని విద్యార్థులు నివసించే గదులలో కోవిడ్ నిబంధనలు అమలుకు ఏమాత్రం అవకాశం










