సాహిత్య విమర్శలో జేసీ
*క్లాసికల్* సంవిధానంలోని వెలుగు నీడలు విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని 1980ల తరంలో జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ దశాబ్దంలోనే ఆయన ప్రధాన రచనలు వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది. విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు. వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు. ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా