మన కళలు సాహిత్యం కలలకు దూరం కాకూడదు
(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం) మిత్రులారా, కామ్రేడ్స్! మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్ జంగల్-జమీన్ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు. పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు. మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి










