పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!
సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి కథలు. అచ్చవున్న కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత










