సాహిత్య విమర్శలో చారిత్రక పాత్ర
మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రత్యేకత దాని సిద్ధాంతంలో ఉంది. సాహిత్యంలో ఉండే భావాలకు చరిత్ర ఉంటుంది. దాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. అప్పుడే అ రచన ఏ కాలంలో ఏ అర్ధం పలికిందీ వివరించడానికి వీలవుతుంది. సాహిత్యానికి ఉండే అర్థాలు చెప్పడం సాహిత్య విమర్శ కర్తవ్యాల్లో ప్రధానమైనది. ఒక రచనకు అ అర్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఎలా మారుతూ వచ్చాయి? అనే ప్రశ్నలకు జవాబు నేపథ్యంలోని సామాజిక చారిత్రక స్థితిగతుల మార్పుల్లో వెతకాలి. ఇది మార్క్సిస్టు సాహిత్య విమర్శలో కీలకం. _ చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహిత్య రచనకు సక్రమంగా అన్నయిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది. ఈ










