కవిత్వం

నా తుపాకీకి మనసుంది

ఏమిటో..అంతా విచిత్రంగా ఉంది కదూ ఎక్కడో నిశీధి చీకట్లను అలుముకొనికూర్చున్న నేనుఈ వసంతానికో వాన చినుకు నయ్యానంటేనీకు నమ్మాలని లేదు కదూ అయినా నాకు తెలుసు..నీకు ప్రశ్నంటే నచ్చదని అసత్యాన్ని ఆలింగనం చేసుకున్నఅన్యాయానికి అత్మీయుడవు నీవుఅహంకారపు అధిపతివి నీవు మరి నీకు నిజాలు చెప్పేవారంటేనిజాన్నిపాడేవారంటేనిజం కోసం పోరేవారంటేనీకు ఎలా గిట్టుతుంది మది నిండా మతాన్నిమతి నిండా పెట్టుబడిని పెట్టుకున్నప్రేతాత్మవి నీవు నీకు స్వేచ్ఛ కోసం వేసే అడుగులంటే భయంనీ భయమే నా ఆయుధంఅదే నా తుపాకీనా తుపాకీకి మనసుందిప్రపంచ ప్రేమకు నా తుపాకే చిహ్నం.
సాహిత్యం కవిత్వం ఆడియో

నాకు హెల్త్ కార్డు అవసరంలేదు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
కవిత్వం ఆడియో సాహిత్యం

పిలుపు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
కవిత్వం

ఎన్నెల కల

నడుస్తూ మాటాడుకుందాం నడకాగితే మాటాడలేను ఈ రాతి పలకల మీద  చెంగున దూకి జారే ఆ పిల్లల లేత పాదాలను తాకి మాటాడుకుందాం ఎన్నెన్ని ఎన్నెల రాత్రులలో వెలిగిన ఈ నెగడు చుట్టూ కలబోసుకున్న కథలలో ఎంత దుఃఖం దాగి వుందో మరొకసారి మాటాడుకుందాం ఎత్తైన ఈ పచ్చని కొండలపై పహరా కాస్తున్న మేఘాల నడుమ సెంట్రీ కాస్తున్న ఈ పిలగాళ్ళ చూపులను దొంగిలించే  ఆ తోడేళ్ళ ద్రోన్లను కూల్చే  వడిసెల కథ చెప్పుకుందాం  ఒకసారి సూరీడా సూరీడా  త్వరగా రారమ్మని  పిలిచే ఆ తల్లి  ప్రసవ వేదన  అరణ్యమంతా వినిపించే  గాధ కదా  రా అలా లేలేత
సాహిత్యం కవిత్వం

అంతే బాధలోంచి

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను గాయపడిన అనుభవాలలోంచికొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను కొంత ప్రయాణంలోనిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి కాలాన్ని ఎదురీదడమంటేమార్పులను అవగతం చేసుకోవటమే దారులు ఇరుకవుతున్నప్పుడుఆలోచనలు పదునెక్కాలి ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసిఅనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసిఅనేకానేకాలుగా దర్శించాలి చీమ బలం చూసికన్నులెగరేసిఆకాశాన్ని ఎత్తగలంఆకాశం పైకి ఎక్కగలం లక్ష్యం కుదుపుతున్నపుడురహ దారులు ఇట్టే చిగురిస్తాయి ఊహకు రూపం ఇవ్వడమంటేకొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే . ఇప్పుడు అంతే బాధలోంచి లేచితీరాలకి చేరిఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచిచినుకుల్లా కురిసిన ఒక నేను .
సాహిత్యం కవిత్వం

ఉదయం

అర్ధరాత్రి అమాసచీకట్లో ఓ జెండా దిగిందిఓ జెండా ఎగిరింది అలసిన మేనులుఆదమరచి గాఢ నిద్ర లోఅధికార మార్పిడి చిమ్మ చీకట్లో ఏళ్ళు గడుస్తున్నాఆ అధికారం కిందికి దిగలేదుకిందోడు పైకెక్క లేదు ఊరిస్తూ ఉడికిస్తూఫలాలు అందీ అందిస్తున్నట్లునటిస్తూ అధికారం అక్కడే బహు చక్కగా రాచరికం పోలేదురాజ్యాంగం పుటల్లోనేదోబూచులాడుతుందివర్గ వైషమ్యాల సృష్ఠి లో ఆరితేరిగద్దె పై రాబందుల వికట్టహాసం సమానత్వం ఓ పగటి కలఅది తీరని దాహంపదిహేను వస్తుందివీధి వీధి న ఓ జెండారెప రెప లాడుతుందిసాయంకాలం దించబడుతుంది సూరీడు మౌనంగా కొండల మాటున దిగుతుండుఇంకెన్ని ఉదయాలు ఉదయిస్తేనిజమైన స్వరాజ్యం ఉదయిస్తుందని మథన పడుతూచాల్లే పో పో అంటూచందమామ కసిరిందివెన్నెల కురిపిస్తుందేమో
సాహిత్యం కవిత్వం

దండాలు స్వామి

దక్షిణాన పుట్టినవివిక్త కొండల్లో ఏపుగా పెరిగినరాక్ ఫోర్ట్ ఒరిగిపోయిన చెట్టంత మనిషికన్నీళ్ళతో కావేరి నిండిపోయింది చదివిన వేదాంత శాస్త్రంగొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితేఝార్ఖండ్ క్షేత్రమయ్యింది వనాంచల్ ప్రతి మొక్కవంగి సలాం చేస్తుంది గజరాజులు గజగజ వణుకుతున్నాయిఅండగా నిలిచిన స్వామి లేడని తాను ముందుండి వేసిన ప్రతి అడుగుఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం హక్కులకై సంధించిన ప్రశ్నలేతన చావుకి కారణమౌతుంటేపుటల్లోని రాజ్యాంగ ప్రతులుపటపట రాల్చాయి చుక్కలు వణుకుతున్న చేతులుతాగలేని నీరు ఒలుకుతుంటేఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం పండు ముదుసలిపార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..అయినా ఆఖరి శ్వాస దాకాచెద‌ర‌ని ఆదివాసీ స్వ‌ప్నంఅమరుడా! దండం!!
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
కవిత్వం

నువ్వే కావాలి

ఎందుకో నువ్వంటేతెగ పిచ్చితీగలా అల్లుకు పోయిలోలోన ప్రకంపనలు సృష్టిస్తావు నిన్నునాలో సాన బట్టుకుంటూపదిలంగా దాచుకుంటా నువ్వే నా చుట్టూపెట్టని కోటవైనా రక్షణ గా ఎల్లవేళలా నువ్వే లేకపోతేనేను అజ్ఞాని గాఎక్కడ బడితే అక్కడ తిరిగే వాడ్నినన్నో మనిషి గా నిలబెట్టినది నీవే నాకు నేనుగాఊహ తెలిసిన దగ్గరి నుండినీ చుట్టే నా పరిభ్రమణంఅదే నా ఉజ్జ్వల భవిష్యత్తు కిరాచ బాట పరిచింది ఏదైనా తెలుసుకోవాలంటేనీవే నా ఆధారంతరాలుగా నీవూ నేనూకలిసి సాగామనే ఆలోచనలునన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటేఇలాగే భవిష్యత్తు లో కూడాసాగాలనే తాపత్రయంలో స్వార్థమున్నాతప్పట్లేదు నీ రూపం అపురూపంనాలో చెరగని రూపంచెక్కుకుంటూ పోలేనుఎప్పటికప్పుడు చెక్కక తప్పదుచెక్కితేనే నీ విలువ
కవిత్వం

వర్షం లో రైతు

వాలే చినుకు లోఆశగా తడిశాను .బురద సాలుల్లో నారుగా మురిసాను .ఎండిన కలలని తడుపుతూవడివడిగా దున్నుకుంటున్నాను .ఎండలు శపిస్తాయోవానలు ముంచేస్తాయోకళ్ళనిండా  మేఘాలునిండి ఉన్నాయి .గుండెనిండా ధైర్యంపిండుకున్నాను .కాసింత ఉరుములు  భయపెడతాయికాసిన్ని పిడుగులు కూల్చేస్తాయికాళ్ళు మట్టి పెళ్ళల్లోఉదయించందేమనసు కుదుటపడదు .రెప్పల వాకిట్లోతెప్పలుగా కదిలే దృశ్యాల వెంటఆకు పచ్చని కలలుఊరటనిస్తాయి.ఊపిరి పోసినాఊపిరి తీసినామట్టిని నమ్ముకునేరైతు  జీవితం ముగుస్తుంది .