సాహిత్యం కవిత్వం

జర్నీ

అతడు మన రక్త బంధువు కాకపోతేనేం నలభై ఏళ్లుగా రక్తం ఎవరికి  ధారపోశాడో తెలుసుకో అతను మన కులంవాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా ఏ కులాల వైపు నిలబడ్డాడో చూడు అతను  మనకు అక్షరాలు నేర్పకపోతేనం నలభై ఏళ్లుగా నేర్చుకున్న ప్రతి అక్షరం ఏ వాడల్లోని సూర్యోదయానికి పొదిగాడో  చూడు అతను  మన మతం వాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా  మత రహిత నూతన మానవ ఆవిష్కరణకు చేసిన ప్రయోగాలు ఎన్నో కనుక్కో అతను మన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతేనేం నలభై ఏళ్లుగా మనందరం కలిసి నిర్మించాల్సిన జగత్తు కోసం   ఏ ఏ దారుల్లో పాదయాత్ర చేశాడో చూడు అతను
కవిత్వం

రూప కవితలు మూడు

1 ప్రేమతో.. రేష్మాకు!రేష్మా.. నీ పెరట్లోని మొక్కలునీలాగే అందంగా ఉన్నాయితెలుసా..!ఆ రోజుఉదయంనేను పెరట్లోకివెళ్తేఅవేవో నా కోసమేపెంచినట్టుగాఅనిపించిందిఅలా మొక్కలన్నీ ఒక్కసారి నా వైపుచూస్తేసిగ్గుతో తల దించుకున్నాను తెలుసా..!మందారం చెట్టు నీడలోమల్లెపూల పరిమళంతోస్నానం చేయడం అంటే మామూలు విషయం కాదు కదానా జీవితంలోఊహించనిఅదొక అందమైన స్వప్నంతెలుసా..!మల్లెలన్నా .. మందారం అన్నా నాకు ప్రాణంరేష్మా..వాటిలో నా ప్రాణంఉందే.. కాసిన్నీనీళ్లుపోయడంమరిచిపోకురేష్మా!(రేష్మాతో నేను)2.నా మదిని దోచిన చెలినీల్సో..ఆ రాత్రి నీతో గడిపినమధుర క్షణాలను ఎలా మరిచిపోగలను?ఆ మిణిగురుల వెలుతురులోనీతో ఏకాంతాన్ని ఎలా మరిచిపోగలను!ఇది గమ్మత్తయిన ప్రపంచం దాంట్లో నువ్వూ నేనూఓ మట్టి ముద్దలంనిజాయితీకి, నీతికి స్థలం లేదిక్కడా?నిఖార్సైన నీ ప్రేమ ముందు కాలం చిన్నబోయిందినీ ప్రేమకు
సాహిత్యం కవిత్వం

మనుగడ కోసం – జీవిక కోసం

వారాంతపు సంతలలో మండుతున్న ధరలు అడవులలో, వూళ్లల్లో పెరుగుతున్న ఖాకీల దాడులు. బతుకు గ్యారంటీ లేని జీవితాలలో బతుకు పోరులో ముందున్నది మా తరతరాల ఆత్మరక్షణాయుధం. ఇక వెనుకున్నది జీవిక కోసం పెనుగులాటలో సగటు ఆదివాసీ సంఘర్శన ఫలం. సమాధాన్, ప్రహార్ లు రాజ్య బీభత్సానికి పేర్లేవైతేనేం! మనుగడ కోసం మా పోరాటం. జీలుగు వద్ద తేఢాలేదు. మండుతున్న ఎండల్లో రాలిపడే  పూవుల కోసం పిల్లా-జెల్లా; ఆడ-మగా అడవంతా మా గాలింపే ఆకలి తీర్చుకోవడానికి అంబలి, సేద తీర్చుకోవడానికి నీరుతో పాటు ఉత్సాహాన్ని, శక్తినిచ్చే సంప్రదాయ సేవనం – జీలుగు కల్లు జెండర్ తేడాలేమీ లేకుండా సమష్టిగా డొప్పల్లో
కవిత్వం

అరుణ్ కాలా కవితలు రెండు

ఆయుధం అనివార్యం….చట్టం ఒకరికి చుట్టం అయినప్పుడుఉన్మాదం నడి వీధిలో కవాతు చేస్తుందిబతుకే భారంగా సాగుతున్న అమాయకపు జనాల మీదఉక్రోశాన్ని చూపిస్తూ శివతాండవం చేస్తుందిఇది తప్పు అని ప్రశ్నిస్తే శూలం గుండెలను చీల్చుకుంటూ నెత్తుటి మరకలను సృష్టిస్తుందిరామ బాణం అంత వేగంగా బుల్లెట్ వర్షం ఇంటి గుమ్మం ముందు కురుస్తుందిపొత్తి కడుపులో పిండాన్ని తీసి మతం రంగు పులిమి దేశభక్తి గా మన మెదళ్లను చెదలు పట్టిస్తుంది….చట్టం చుట్టం అయితే నీవు నేను కాశయపు కత్తులకు ,ఖాకీ కర్రలకు బలికాక తప్పదుఅంతమంగా ఆయుధాన్ని పట్టక తప్పదు……. ఈ వెన్నెల రాత్రి కన్నీటిని మిగిల్చింది…..పచ్చని ఆకులతో అడవి చిగురిస్తున్న రోజుచీకటిని చీల్చుకుంటూ
కవిత్వం

మన ప్రేమ అజరామరం

నీవు నాకునేను నీకుఎన్నటికీ దూరం కాదు నీ ప్రతిఉచ్ఛ్వాస నిశ్వాస‌లోమాత్రమే కాదు నీ కన్నీటిచుక్కల్లోనే కాదు నీ ఆనందక్షణాల్లోనే కాదు నీ అంతర్మథ‌నంలోనే కాదు నీవు నేనుగానేను నీవుగాతొలి చూపులోనేతొలి స్పర్శలోనేఏకమై ఉన్నాము ఏ నిర్భంధ‌మూమనలను విడదీయలేదు మనంమృత్యుంజయులంమన ప్రేమాఅజరామరం.
సాహిత్యం కవిత్వం

భానుడి చూపు

ఎవరు రాసారీ పద్యాన్ని,ఉద్యమంలాంటి ఉదయాన్ని?!వెలుతురు లాంటి నినాదాన్ని?!చీకటికి తెర దించి కాంతికి పట్టం కట్టినపదాల కెరటాల కవన సముద్రాన్ని!? ఎవరు రాసారీ పద్యాన్నిదువాల ఒడిలోంచి నిదుర లేచినజాబిల్లి తోబుట్టువుని!?తిమిరం కుబుసాన్ని విడిచితళతళాడుతూ తెల్లారిన కాలాన్ని!? ఎవరు రాస్తారు వెన్నెల సిరా నిండినగాలి కలంతోకొండలపై నుంచి జారే నిశ్శబ్దపు జలపాతాలని?! అరణ్యంలో తాండాలోతంగెడు పూల పురుడు వాసననిపీల్చుకుని మత్తగిల్లే మధువుకు ప్రియమైన భ్రమరాలనీ!? ఎవరు రాస్తారు పద్యాలనీప్రాణ త్యాగానికి సిధ్ధపడితుపాకీ భుజాన వేలాడదీసుకొనిఅరణ్యం మీంచి లోకం మీదికివిప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపుని!?
కవిత్వం

దేశం శవయాత్ర చేస్తోంది

పొద్దున్నే.నా కళ్ళల్లో విరబూసిన నవ్వుసాయంత్రానికి రాలికరోనా పొట్లమైపోయింది వెన్నెలంతా పారబోసుకొనిచీకటి పడ్డచందమామ! ఎవడూచెట్టుకాలేకపోయాడు గాలి కొదిలేసినకొన ఊపిరిజాగరణ చుట్టూకోరలుచాచిన కాసుపత్రులు! భూమి వల్లకాని చితులన్నీమూటలు మూటలు గార్యాలీతీస్తూపవిత్ర గంగా నది చరిత్రైదిక్కులు కోల్పోయి ఒడ్డు పట్టుకుంటున్నకాగితప్పడవలు! చెమట వాసన కోల్పోయి నఅభివృద్ధి ప్రణాళికొకటిసిగ్గు విడ్చిన రాజముద్రిక పట్టుకొని సంచరిస్తుంటేఆక్సీజన్ అందకప్రపంచ ఔషధాలయంశవయాత్ర చేస్తోంది
కవిత్వం

నా క్యాలెండర్

ఇంట్లో క్యాలెండర్ లేదు పొడిచే పొద్దు నడి నెత్తిన పొద్దు కుంగిన పొద్దు ఇదే నా లెక్క ఇదే నా రోజు కూసే కోడి నా అలారం మొరిగే కుక్క నా అప్రమత్తత కి ఆధారం నిప్పు ఇచ్చే పొరుగు లేదు సూరీడు తొలి కిరణం గుడిసె తాటాకు లోనుండి నా ముఖం పై నా మేలు కొలుపు భుజాన కాడి ముందు నడిచే ఎద్దులు నేల దున్న నడక కాళ్లకు చెప్పులు లేవు పల్లేర్లు పక్కకి నా పై దయతో సాగే అరక నేల నాది తరాలుగా అడవి నాది దుంప నాది పండు నాది తేనె
సాహిత్యం కవిత్వం

చెరగని నేను

అవును నేనెవరిని అందరి లాగే నేను ఐనా నేనంటే గిట్టదు  నా ముస్తాబు నా ఇష్టం రకరకాల రంగుల్లో నాకు నచ్చిన రంగు తొడుక్కుంటా నాలోని భావాలు నలుగురిలో పంచాలనుకుని రూపు దిద్దుకుని జనంలోకి వస్తా నా ఆశయాలు వేరు నా ఆదర్శాలు వేరు అందరూ పాటించాలనే నియమం లేదు కొరడా పట్టుకుని ఝుళిపించనూ లేదు నా మానాన నేను కమ్మలతో కూర్పు నన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటే తప్పా?! నా లోని ఒక్కో తెర ఒక్కో కఠోర వాస్తవ దర్పణం చరిత్ర నేటి తరానికవసరం నన్ను స్వీకరిస్తారో త్యజిస్తారో జనం ఇష్టం నన్ను బైటికి రాకుండా చేసే
కవిత్వం

ఉత్తేజమై  వికసించు

నువ్వు అలవోకగా నడుస్తున్నప్పుడో బండి నడుపుతున్నప్పుడో నీ వెనకాలో నీ పక్కనుండో ఒక బుల్డోజర్ వచ్చి గుద్దితే నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు నువ్వు కుర్చీ వేసుకొని ప్రశాంతంగా చదువుతున్నప్పుడో పరధ్యానంగా పడుకున్నప్పుడో నీపై ఎం ఐ ఏ దాడులు జరిగితే నీవు బెదిరిపోనక్కర్లేదు వాడు నిన్ను జైలుకు ఇడ్చికెళ్ళినప్పుడో నాలుగు గోడల మధ్య నిన్ను బందీ చేసినప్పుడో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి తావివ్వనప్పుడో నీవు అలసిపొనక్కర్లేదు కొన్ని పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం తిసేసినప్పుడో మత గ్రంథాలను ప్రబోధించినప్పుడో రాయిని సైతం దేవుణ్ణి చేసి నిన్ను మైలపరిచినప్పుడో నువ్వు కృంగిపోనక్కర్లేదు సలసలా కాగే నెత్తురు నీ గుండెల్లో ఇంకా పచ్చిగానే పారుతుంది నిజాల