లేనిది మరణమే!
నిజమే! అప్పుడప్పుడుమరణాలు గురించి మాటాడుకుంటాం, జీవితం నిండా విజయదరహాసాలనువెదజల్లుకుంటూ నడిచిన ప్రయాణాల గురించి చర్చించుకుంటాంమరణం దాకా ప్రవహించిన ఎగుడుదిగుళ్ళ ప్రవాహాల గురించీమాట్లాడుకుంటాం..దారులలో ముళ్ళను ఏరుకుంటూ గాయాల మూటల్లోకిబతికుని సర్దుకుంటూఅనుకున్న పనులు నిర్వహించుకుంటూ శ్వాస ఆగేదాకా సాగిన ప్రవాహాల గురించి చర్చించుకుంటాం అతడు మిగిల్చిపోయిన పనులని స్నేహితుల మధ్యలో పంచుకుంటాం దేహంలో అరణ్యం లా అతడి భావాల్ని పెంచుకుంటాం అంతరంగం నిండా అతడిక్కడ వొదిలి వెళ్ళిన ఉద్యమ పవనాల్ని పీల్చి ఆ గాలిలో అతడి ప్రాణాన్ని వెదుక్కుంటాంఅతడెప్పటికీ మనల్ని వీడిపోలేదనే ఆలోచన మన నడకలో వేగాన్ని పెంచుతుందిమరణాలతో మనం దేహాల్ని కోల్పోవచ్చు కానీ చాలా మరణాలు జీవించడాన్ని కోల్పోవు అవి










