సంస్కృతి – మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం
(విరసం 28వ మహాసభల కీనోట్ పేపర్‌లోని కొన్ని భాగాలు పాఠకుల కోసం- వసంతమేఘం టీం) సంస్కృతి ఉత్పత్తి : సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి. సంస్కృతిలో నుంచే కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది. అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా సంస్కృతి మనిషిని పెనవేసుకొని ఉంటుంది. సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది. సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో కూడా










