మూసీ నది మాట్లాడితే …. నా అనుభవాలు
కవిని ఆలూరి . నేను గత 22 సంవత్సరాలు గా లెక్చరర్ గా పనిచేస్తున్నాను . పది సంవత్సరాల క్రితం మా కుటుంబం హైదరాబాద్ లోని శివం రోడ్ లో ఉన్న బాగ్ అంబర్ పేట్ లో ఉండేది . కాలేజీకి వెళ్ళటానికి బతకమ్మ కుంట దగ్గర ఉన్న బస్ స్టాప్ లో బస్ ఎక్కేదాన్ని . బాగ్ అంబర్ పేట్ నుంచి బతుకమ్మ కుంట మీదుగా నడుచుకుంటూ బస్టాప్ కు వెళ్ళే దాన్ని . కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బతుకమ్మ కుంట గుడిసెవాసులను చూస్తుండేదాన్ని . ఆడవాళ్ళు ఎక్కువ శాతం చిత్తుకాగితాలు ఏరేవాళ్ళు ,మొగవాళ్ళు చెత్త బండీని నడపటం లాంటివి చేస్తుండే వాళ్ళు . ఒక గుడిసె ముందు అయిదు










