సాహిత్య విమర్శకుడు పోతులూరి వీరబ్రహ్మం
పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా