కవిత్వం

శబ్దం పురివిప్పితే

ప్రతి అడుగులో మట్టిని ముద్దాడినఆమె పాదాలనునీ ఇనుప గొలుసులేం చేస్తాయ్ప్రతి అక్షరానికి కశ్మీర్ గాయాన్ని పూసిన ఆమె సత్తువనునీ సంకెల్లేం చేస్తాయ్ప్రతి పదంలో ఆకుపచ్చరంగు పోసిఅడవిని కట్టిన ఆమె హృదయాన్ని నీ ఖాకీ కుక్కలేం చేస్తాయ్ ప్రతి వాక్యంలో ఎరుపురంగును వొంపిఅమరులకు స్థూపాన్ని కట్టిన కలం మేస్త్రీలనునీ పోలీసు గూండాలేం చేస్తారుఆమె గొంతులోంచి ఆజాదీ శబ్దం పురివిప్పితేనియంతలు నెత్తురు కక్కి చస్తారుఇప్పుడు దేశమంతా ఆజాదీనేకశ్మీర్ టు కన్యాకుమారివయా అరుంధతీ రాయ్.
కవిత్వం

మీతో నేనున్నాను అరుంధతీరాయ్, షౌకత్ భాయ్

ఎంత సరిపోయిందిపార్లమెంటు ఉన్న రాజధాని ఢిల్లీలోనే భూమి చలన సూత్రాన్ని కనుగొన్న కోపర్నికస్ మార్గం ఉందిజగన్నాటకమో, గ్రీక్ ట్రాజెడీ యోషేక్స్పియర్ చెప్పినట్లు శబ్దము, ఆగ్రహం తప్ప ఏమీలేని ప్రపంచ నాటక రంగమోఆధునిక అబ్సర్డ్ డ్రామాయోఅన్నీ కలిసిన రాజకీయ నాటక రంగమోఉన్న ఆ వీధిలోనేఒక లిటిల్ థియేటర్ ఆడిటోరియం ఉన్నదిఆ రోజక్కడ‘ఆజాదీ ఓన్లీ వే’ బ్యానర్ వెలిసిందిదేశంలోనే కాదుదేశం నుంచీ ఆజాదీ కోరేఆ హక్కు ప్రజలకే ఉంటుందిఆరోజు, ఏ రోజైనాఆజాదీ ప్రకటనలో నేనున్నానుదండకారణ్యంలో ఆమె కామ్రేడ్స్ తో నడచిన రోజుగ్రీన్ హంట్ కమిటీ అగెయినిస్టు వార్ ఆన్ పీపుల్ తో యాన్మిర్డాల్ సాయిబాబాతో పాటు ప్రతిఘటించిన రోజు మనసారా నేనక్కడున్నానుది
కవిత్వం

చెప్పు

రోజూ వేసుకునేవేకానీ ఈరోజు ఎందుకోచెప్పులు ముద్దొస్తున్నాయిఒకటికి రెండు మార్లుతుడిచి చిన్నగా మరకాలుంటే తడి గుడ్డతోమరీ తుడిచి రోజూ విసురుగా వేసుకునేవాటిని నెమ్మదిగా నేలపై వుంచి వేసుకుని మెత్తగా మెల్లగా నడిచానువిసిరినదినా చెప్పు కాకపోవచ్చుకానీ అప్పుడువాడి మొఖంలోవచ్చిన కంగారు చూసిఏ చెప్పును చూసిన ఆ చెప్పులాగే కనిపిస్తోందిఆ విసిరిన గుండెకుఆలయి బలాయ్చెప్పాలనుందిఆ చేతిని తాకి ముద్దాడాలని వుంది. ( 19.6.2024 వారణాసి  సంఘటన ప్రేరణగా)
కవిత్వం

కె కె కవితలు మూడు

1 సంధ్యా కిరణం జీవితం స్తంభించినపుడు జీవితాలను ప్రతిబింబింపచేసే అమరుల ఆశయాలతో ఈ అడుగులు వేస్తున్నాను భూ మొనలపై బాంబు పేలుళ్లతో బీళ్ళు పడిన నేలపై పడుకొని స్వేచ్చా చిత్రాన్ని నా కనులలో చిత్రిస్తున్నాను డ్రోను, హెలి కాప్టర్ల రెక్కీల నడుమ కోట్ల తారల నీడలో పండు వెన్నెల్లో కొద్ది కాలపు గురుతులను కురిసే మంచుతోపాటే నా తనువు అణువణువులో దాచుకుంటున్నాను వడగాలుల వేడికి హడలి పోతున్న ఈ హృదయానికి విష్లవమే మందుగా నూరిపోశాను ఎన్నో నిశీధి చీకట్లను తొలిగించుకుంటూ తొలి సంధ్యా కిరణానై నిల్చున్నాను నిలబడిన ప్రతిసారీ నిట్టూర్చిన క్షణాలే తలచుకున్నాను తుపాకుల తూటాల నడుమ మృత్యువును
కవిత్వం

అనిత కవితలు రెండు

1 కామ్రేడ్ శంకర్ ఓరుగల్లు పోరుబిడ్డ కామ్రేడ్ శంకర్వీరయోధుడా కామ్రేడ్ శంకర్ నీకు అరుణారుణ జోహార్లుచల్లగరిగ గ్రామంలో పురుడుపోసుకున్నవు నువ్వుప్రపంచాన్ని మార్చడానికి పోరుబాటపట్టినవుసమసమాజ స్థాపనకు సాయుధుడివైనవుకన్నతల్లి ఒడి నుండి అడవి తల్లి ఒడికి చేరావుపీడిత ప్రజలకు పోరు బిడ్డవైనావుఉత్తర తెలంగాణ ఉరుము నీవుఉత్తర తెలంగాణ సరిహద్దులు దాటుకొనిదండకారణ్యంలో అడుగు పెట్టిన వాడాశంకర్ పేరుతో జనంతో చెలిమి చేసినవాఉత్తర బస్తర్ ఆదివాసీల గుండెల్లో గూడుకట్టుకున్నవాప్రజలను పోరుబాటలో నడిపించినావాఆపటోల-కల్పర్ అడవుల్లో శత్రువు తూటకు నేలకొరిగినావామెరిసేటి మెరుపై, మేఘ గర్హనవై తిరిగి వస్తావా,ఆకాశంలో అరుణతారవై ప్రకాశిస్తాపొడిచేటి పొద్దులో, విరిసేటి ఎర్రమందారంలోనీ రూపాన్ని చూద్దుమాప్రజా యుద్ధ కెరటమై వస్తవాప్రజల గుండెల్లో విప్లవ జ్యోతివై వెలుగుతవానాగేటి
కవిత్వం

తెలుగు వెంకటేష్ కవితలు రెండు

1యుద్ధంలో మరణాలెప్పుడూ దొంగలెక్క ఆయుధాలు గింజల్ని పండించలేవు మరణాల్ని భిక్ష వేస్తాయి పిల్లలు లేక బొమ్మలు దిగాలు పడ్డాయి వాటికి తెలియదు యుధ్ధం చంపిందని రాజ్యహింసలో ప్రజల దుఃఖం మైళ్ళు మైళ్ళు మేఘావృతం యుధ్ధం ఉన్మాదం అది సృజనాత్మకతను చంపుతుంది యుధ్ధం కామా అది మరణాల్ని కప్పుకునే రాక్షసి యుధ్ధం శరీరాల్ని మాయం చేశాక తిరిగి మనుషుల్ని ప్రవేశపెట్టలేనిది 2ప్రతి నేల రక్తంతో తడిసినదే యుధ్ధం కాలుమోపని స్థలమేది చరిత్ర అంటేనే నెత్తురుతో రాయబడ్డ పుస్తకం ఆధిపత్యాల అహంకారాలకు ఎంత కన్నీరు పారిందో బంధాల్ని పోగొట్టుకున్న ప్రజలు సాక్ష్యం యుధ్ధాలకు లాక్కోవడమే తెలుసు నాశనం చేయడమే తెలుసు ప్రాణాలు
కవిత్వం

గాజా – బస్తర్‌

మనం ఒకరికొకరంనూతన సంవత్సర శుభాకాంక్షలుచెప్పుకుంటున్న రోజుబస్తర్లో మంగ్లీ హత్య జరిగిందిఆ రోజు మంగ్లీ తల్లిఅడవిని కాపాడడానికి అడవి ఒళ్లోనేహఠం వేసిందిఆరు నెలల మంగ్లీతల్లి గుండెల్లో దూరి పాలు తాగుతున్నదిఒళ్లోనే చదువుతూ చదువుతూ‘రాజ్యానికి వ్యతిరేకంగాయుద్ధానికి కుట్ర రచిస్తున్నది’ఒక తూటాతల్లి వేళ్లను చీరుకుంటూమంగ్లీకి తాకింది‘ఎదురు కాల్పులక్రాస్ ఫైరింగ్లో మంగ్లీ చనిపోయింది’గాజా ఆఫ్తాబ్పుడుతూనే వాయు విమానబాంబుదాడిలో చనిపోయాడుఅతడు తన మొదటి స్తన్యంకూడ తాగలేదుఆల్ పిఫా ఆసుపత్రిలోహత్యకు గురయ్యాడుగాజాలో పుట్టడమేఇజ్రాయిల్ రాజ్యానికివ్యతిరేకంగా కుట్రచేయడంరెండు వేరు వేరు దేశాల్లోఇద్దరు వేరు వేరు పద్ధ్దతుల్లోహత్యకు గురయ్యారుబస్తర్ మంగ్లీగాజా ఆఫ్తాబ్`కాని ఇద్దరి హంతకులు ఒక్కరేహత్యలు చేసే ఆయుధాల కర్మాగారం ఒక్కటేహత్యకు కారణం ఒక్కటేభావజాలం ఒక్కటేఅందువల్లనేగాజా బస్తర్ కూడఒక్కటేగాజా ప్రజల
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1 ఏనాడైనా చూసావాఎర్రగా మారుతున్న అడవిని ఏనాడైనా చూసావా !ఏరులై పారుతున్న నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా!గుండెల్లోకి దూసుకు వచ్చిన తుపాకీ గుండును ఏనాడైనా తాకావా!నిన్ను నీవు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగాఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా!ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా!మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళగుండెదడను ఎక్కడైనా ఆలకించావా!స్వదేశంలో యుద్దానికై వెనుకాడనివిప్లవ వీరుల్ని ఏనాడైనా కలిశావా!అయితే నడువు...నేలకు ఒరిగిననెత్తుటి ముద్దలను ముద్దాడడానికి!అమరత్వం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి!వాళ్లు నడిచిన బాటలలోధైర్యాన్ని వెలిగిస్తూ నడువు మరో ఉదయాన్ని వెతుక్కుంటూ. 2 అమరత్వందేశం నీదైతేనేం నాదైతేనేం అది గాజాయితేనేంభారతదేశమైతేనేంఫాసిజం ఎంత క్రూరమైందో చెప్పటానికి నువ్వైతేనేం నేనైతేనేం ఏ రాజకీయమైతేనేం ఏ ఇల్లయితేనేం ఏ
కవిత్వం

అన్యాయం

బంగారు డేగ వర్ణంలోనే బంగారంవనరులున్నా ఉన్మాదం కోరల్లో విలవిలతన భూభాగం కోసమే తాను శ్రమిస్తూ ఆశ్రయం కోసం ఎంతో దూరం వెళ్తుంటేఊసురోమని నీరసిస్తుంటేకాసింత ఊరట కోసం జానెడు చోటు కోసంవెంపర్లాడుతుంటే ఉసూరమనిపిస్తుంది జామ్ మీనార్ సాక్షి గాచుకర్ పార్ట్రిడ్జ్ హిమాలయాల్లోనేబతకగలదుఅది ఆ సరిహద్దు నుండి రాలేదువచ్చిందంటే బతుకు మృగ్యమైతేనేఅక్కున చేర్చుకునే నేల కోసంనెలవంక ను వేడుకుంటుంది షాలిమార్ ఉద్యాన వనంలోఅడవి కోడి సెంబగం పోరులో సెంబగం అలసిపోయి అడుగులు నెమలివైపు యల్పనం మీదుగాసేదతీర దారులు మూసుకుపోయాయిప్రజాస్వామ్యం అంపశయ్య పై నుండగాబూడిద నెమళ్ళు పడవల్లో సకల కష్టాలతోఘోష వినలేక ఇర్రవాడ జీవం కోల్పోగానెమలి పంచన ఒదిగితేతరిమే నయా మత స్వామ్యం
కవిత్వం

29 మంది

ఎన్నికల రుతువు మొదలైన వేళ నుండీ అరుస్తూనే వున్నారు ఈ నేలని ప్రశ్నలకు తావు లేకుండా చేస్తామనినీకూ నాకూ అక్కరలేకుండా పోయిన సహజ సంపదకువాళ్ళు భరోసాగా నిలబడిపోరాడుతున్నారుయుద్ధానికి రంగూ రుచీ వాసనా ఏమీ వుండవు కానీ తుపాకి వున్న చేయి ఎవరిదన్నదే ప్రశ్న కదాఅబుజ్ మడ్ నెత్తుటి వసంతంతో ఈ నేలకు హామీగా మిగిలి వున్నదివాడు నవ్వుతూ ఉన్నాడంటేనీ కడుపులో చిచ్చు పెడుతున్నాడనే కానీ నీ నా చూపు ఇప్పుడుబ్యాలెట్ కాగితం పైనే వేలాడుతోంది జీవితం యుధ్ధమయిన వాళ్ళకిసత్యమేదో నిత్యమూ కనుల ముందు బుల్లెట్ లా దూసుకు వస్తూనే వుందినేలను ముద్దాడిన వారి పెదవి చివరి నెత్తుటి బొట్టు