అదే వర్షం
వేకువల్లేవేయి కలలు వెలిగించుకునితూరుపు కాంతులు పూసుకునిచూపులులు మార్చుకున్న రోజులుకళ్లపై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటేకళ్ళలో వెలిగే దీపాలుదారిచూపటం .మనసున ఊగే భావాలుఊరించటంఅలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లోఅలా ఊగిపోవటంబంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలావెన్నెల ఆకాశాన్ని వొంచితల నిమురుతూంటేనూ… లోలోపలజ్ఞాపకాలు తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలివొలికి చిలికినీ ప్రపంచాన్నితెరలు తీసి ప్రదర్శిస్తుంటేనూ అదే వర్షం …. నాపై వాలే చినుకుల్లోనీ జ్ఞాపకాలు తడుపుతున్నాయి . వాస్తవానికి జ్ఞాపకానికిఒక తీయని ఊహా లోకం లోకొత్త ప్రపంచాన్నికళ్ళలో నిర్మిస్తాను అర్ధమౌతోందాజీవితమంటే కన్నీళ్లే కాదుకొన్ని కౌగిలించే జ్ఞాపకాలు కూడా .










