కవిత్వం

చావు ఇపుడు ఎవర్నీ ఎత్తుకుపోలేదు

వాళ్ళు చావును జయించిన వాళ్ళుజైలు గోడలకు పాటలు నేర్పిన వాళ్ళుఇనుప ఊచలకు జానపద సంగీతం నేర్పిన వాళ్ళుజైలుపై నక్షత్రల దుప్పటి కప్పిగోడల మధ్య రహస్య సంభాషణ చేసినవాళ్లువాళ్ళేక్కడ వున్నానీ నా విమిక్తినే కోరుకున్న వాళ్ళురెడ్ కారిడార్ ఇండియా అంతారూపొందించిన వాళ్ళువాళ్లకు చావేంటిప్రెమొక్కటే గానం చేసినమన కాలం కబీర్లు వాళ్ళుఎర్ర జెండా ఎత్తి ఉంచండిమలయ సమీరమ్లా వచ్చి తాకుతారుపిడికిలి ఎత్తి పట్టి ఉంచండినరనరానా ఉక్కు సంకల్పంతోఎత్తి పడతారుసాయి నిబ్బరంగానే వున్నాడుచావును నిరాకరించిన వాడు కదాచూడు చిరు నవ్వుతో తిరిగి వస్తాడు. 10.18పీఎం
కవిత్వం

చావును నిరాకరించిన జీవితం

ప్రియమైన వైద్యులారా, సాయిబాబా కళ్ళను తీసేప్పుడుకొంచెం మృదుత్వాన్ని జోడించండివాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమోఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండిమనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో"చావును నిరాకరించిన" ఆ ఉక్కునరాల గుండెలోతుల్లో,ఆదివాసుల పట్లా, పీడిత, తాడిత ప్రజానీకం పట్లాఅలవిమాలిన సున్నితత్వానికి మూలాలేమైనా దొరకవచ్చునిత్య నిర్బంధంలో, నొటొక్క జబ్బులతో పెనుగులాడుతూవిశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకుపూటకో సిద్దాంతం ప్రవచించేఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపైఆ పోలియోకాళ్ళతో జాడించేందుకేమైనా అవకాశముందేమో చూడండిమరొక్క, చివరి విన్నపం...ఆ మెదడును మాత్రంరేపటి తరాలకోసం, మరింత జాగ్రత్తగా భద్రపరచండితొంభై శాతం పైగా వికలాంగుడైనా, అతని "ఆలోచించే మెదడు" ప్రమాదానికి వణికినఈ దోపిడీవ్యవస్థబలహీన లంకె (వీక్
కవిత్వం

ఆక్రమణ యుద్ధంలో జనన మరణాల సరిహద్దు ఎక్కడ?

నాలుగు రోజుల కవలలు.అవును గాజాలో పిల్లలు పుడుతూనే ఉన్నారు నష్టాన్ని పూడ్చే కసితో కవలలు గానూ దువాతో తండ్రిబర్త్ సర్టిఫికెట్ తేవడానికి పోయాడు ఆకాశ విమాన దాడిలో ఆ పిల్లలిద్దరూ చనిపోయారు గాజా ప్రభుత్వ ఆరోగ్యశాఖ పసి పిల్లల మరణాల జాబితా ప్రకటన ఒక్కటేవిశ్వసనీయమైందని ఆమోదిస్తుంది ఐక్యరాజ్యసమితి.అంతకన్నా అది చేయగలిగింది ఏముంది!శరణార్థి శిబిరంలో చేరడానికిపుడుతండ్రి కవలల మృతదేహాలు తీసుకొని డెత్ సర్టిఫికెట్ల కోసం పోవాలి పసి పిల్లల జనన మరణాల మధ్య ఇజ్రాయిల్ అక్రమణ యుద్ధ సరిహద్దు ఎక్కడ?(పి. వరలక్ష్మి, ఎఫ్. బి. కి కృతజ్ఞతలతో) 17 ఆగస్టు 2024
కవిత్వం

నల్లని కత్తి

ఎందుకో?కార్పోరేట్లకుబహుళ జాతులకుశూలల సూపులకునల్ల కలువలే నచ్చుతయి వాళ్ళు ఏం మేలు చేయాలనుకొన్నా ?తోలునే తొలకరిని చేస్తరునల్లని ముఖం మీదతెల్లని మల్లెలు ఆరబోసినట్టునింగి మంగుళం మీదమక్క పాలాలు ఏంచినట్టువాళ్ళ నవ్వుల పువ్వుల కోసమేపూనికతోని దీక్ష పట్టినట్టుఇది ప్రపంచ పెద్దలుపేదరికం మీద విసిరినపరిహాసపుటస్త్రం అనిపరిపరి విధాల పరితపించినాకాలే కడుపు సాలు దున్నదనీమాడే ఎండ నీడ కోరుతదనీమర్మం తెలిసిన వారికిమనసున పట్టింది.నూకలు పెడతా మేకలు కాస్తావా?అన్నడొకడువివక్షల విలువల ధర్మానికివిలుకాన్నై కావలుంటానన్నడింకొకడు.నోరును అదుపులో వెట్టుకొనిపోరును పొరక పొరక చేసివిలాసాల వినువీధుల్లోకులాసాల కుటిల నీతుల్లోకుర్చీలు ఎక్కినంకకుత్తుకలను కోసేకత్తులైతరుకోరుకున్న కుదురుకుంగుతుందంటేనోటికి పడ్డ తాళాలు ఊడితైతక్కలాడుతయిఏరి ఏరి కొన్ని అన్యాయాల మీదనేకోరి కోరి ఆయుధాలు ఎక్కుపెడుతరుఅవసరం తీరినంక ఆయుధాలు
కవిత్వం

ఎటు చెందిన వాడిని

ఊరుకి చెందిన వాడినాతల్లివేర్లు తెంపుకు వచ్చిన వాడినాఊరు వదిలి వేరైపోయిన వాడినానిలువునా నీరైపోయిన వాడినాఅయినోళ్ళకి చెందిన వాడినాపలునోళ్ళకు జంకిన వాడినాఎవరిని ?నేను ఎవరికి చెందిన వాడిని ?చేతులు రెండూచాచిన వాడిని కదా..చూపంతా వచ్చిన దారిన పరచిన వాడిని కదా..నివశించే నేలకితలని తాటించేవాడిని కదా..ఎక్కడైనా ఒక బొట్టు ప్రేమ కోసంభిక్ష పట్టినవాడిని కదా..భుజాన బరువుతోబతుకు భ్రమణ గీతం పాడేవాడిని కదా..మరి, నేను ఎవరిని ?సూరీడికి చెందిన వాడినాచుర్రుమనే ఎండకు చెందిన వాడినాచంద్రునికి చెందిన వాడినాచల్లని వెన్నెలకు చెందిన వాడినాకడలికి చెందిన వాడినావిరిగి లేచే కెరటానికి చెందిన వాడినాఅడివికి చెందిన వాడినాగాయానికి పూసే ఆకు పసరుకి చెందిన వాడినానగరానికి చెందిన వాడినానగుబాటుకు
కవిత్వం

కులం కండువా…

జేబులో ఉన్న పది రూపాయలతోఇద్దరం అయిదు రూపాయల బువ్వ లొట్టలేసుకు తిన్నోళ్ళంసాయంత్రం అయితే ఛాయి నీళ్లు తాగుతూసమాజాన్ని విశ్లేషించినోళ్లం ధర్నాల దగ్గర ఒక్కటిగా హక్కులను నినదించినోళ్ళంనాలుగు గోడల మధ్య విప్లవ నిర్మాణాన్ని చర్చినోళ్ళం సభలలో సమావేశాల్లో ఒక్కటే విషయాన్ని మాట్లాడినోళ్ళంఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే తిరిగినోళ్ళం కానీ మా ఊరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆటో దిగి గానేవాడు ఒక వాడ కి నేను ఒక వాడకి పోవాలిబోనాల పండుగోస్తే వాళ్ల బోనాలు ముందు రోజు మావి ఆ తెల్లారిబతుకమ్మ దగ్గరైతే మా బతుకమ్మ వాళ్ల వాటికి ఆమడ దూరంలోనే ఉండాలిఒక్కటేమిటి ఊరికి వెళితే అడుగు అడుగునా కులం కండువా
కవిత్వం

‘మన కాలం పిల్లలు’

మేము మన కాలపు పిల్లలం.ఇది రాజకీయ కాలం.దినమంతా, రాత్రంతాఅన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -అన్నీ రాజకీయ వ్యవహారాలేమీకిష్టమైనా, కాకపోయినా.నీ జన్యులకి రాజకీయ గతం వుందినీ చర్మం ఒక రాజకీయ కులంనీ కళ్ళు ఒక రాజకీయ దృష్టినువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుందినువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడనువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమేమామీద ప్రకాశిస్తున్న చంద్రుడుఇంకెంత మాత్రమూశుక్ల వర్ణము కాదుఅస్తిత్వంలో ఉన్నామా లేమాఅదీ అసలు ప్రశ్న.అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చుకాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.రాజకీయ అర్థాన్ని
కవిత్వం

మొక్కలను నాటుదాం

నీళ్లతో కాదు ఇప్పుడు ఆ నేలంతా నెత్తురుతో సాగు చేయబడుతుంది రండి మనమంతా కలిసి మొక్కలు నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాంఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కలను చూడడానికి ఒక ఉదయాన తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను
కవిత్వం

వంగల సంతోష్ కవితలు ఐదు

1.పిల్లలుపసిపిల్లలఊయ్యాలలోపాలస్తీనానీవొకప్రతిఘటనలరంగుల రాట్నవిని..!2. ఉదయాలు..!ప్రపంచమంతాఉదయించినసూర్యుడుఎందుకోపాలస్తీనాలోకనబడలేదు..?3.నెలవంకనెలవంకనుచూసిఒక్కపొద్దులు ఉండేరంజాన్ మాసం ఇలానెత్తుటితో తడవడం ఏలా..?4.గర్భం..ఏ శిశువుకైనారక్షణ స్థలంఅమ్మ గర్భంకానీఇప్పుడుపాలస్తీనలోఅమ్మ గర్భాన్నిచీల్చిననరమేధపు ఇజ్రాయిల్..!5.ప్రేమ…!సుర్మా పెట్టే నీ కండ్లల్లోఈ నల్లటి ధూళి ఏలానిన్ను ముద్దాడేఆ పెదాల మీదఈ వెచ్చటి నెత్తురు ఎలాఓ ప్రియా..!!(పాలస్తీనాకు బాసటగా…)