భద్రతా బలగాలు వైమానిక బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?
ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు










