అవతలి వాళ్ల అంచనాలూ తెలుసుకోవాలి
ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా? నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం గురించి ప్రజలకు ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం










