ఈ ఎన్కౌంటర్లు మనకు పట్టవా?
మే 10వ తేదీన బీజాపూర్ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్కౌంటర్ను బీజాపూర్, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్రాజ్ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్కౌంటర్లో 10వ తేదీ ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్కౌంటర్ స్థలంలో ఉన్న సచిన్ అనే










