తల్లుల బిడ్డల వీరగాథ
ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన










