వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు
1 ఆధునిక రామాయణం విద్వేషం తెంపిన తల వెదురు మనిషైంది నెత్తురొడుతున్న ప్రశ్నలా కళ్ళుమూసుకొని ఈ దేశం కళ్ళల్లోకి చూసింది మనిషిని పశువుకన్న హీనం చేసిన విలువల్ని గర్భీకరించుకున్న శవపేటిక మీది కౄరజంతువుల్ని దేశం నిండా విస్తరించిన అన్ని దిక్కుల్ని ధిక్కరిస్తూ మూసిన పెదాల్తో నవ్వింది 'అబ్దుల్ కలామ్ ప్రథమ పౌరుడైయ్యాడు గుజరాత్ ముస్లిం నెత్తుట్లో దాండియా ఆడాక దళిత రుధిరవర్షం ఉత్తర భారతాన్ని ముంచి వేస్తున్నప్పడే దళిత కోవిందు కొత్త ప్రథమ పౌరుడైయ్యాడు ఆదివాసీ ముర్ము ప్రథమ పౌరురాలైయ్యాక మరణ మృదంగ విన్యాసాలు ఆదివాసి కొండలు లోయలు అడవుల్లోకి విస్తరించాయి' హహహ అని అరిచింది కవులకు కళాకారులకు










