ఓపెన్ పేజీ

ఆఫ్గ‌నిస్తాన్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఆఫ్ఘనిస్తాన్  రాజకీయ వ్యవస్థను,  సామాజిక సంబంధాలను అమెరికన్ సామ్రాజ్యవాదపు కనుసన్నలలో న‌డిపేందుకు అక్క‌డ ఒక బ్యూరాక్రటిక్ బూర్జువా నమూనా ప్రభుత్వాన్ని  ఏర్పరిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.   నిజానికి బ్రిటన్ సామ్రాజ్యవాదం సైతం ఎన్నో సార్లు అఫ్ఘనిస్తాన్ ని దాని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. బ్రిట‌న్‌ను    అనుసరించే రాజుని లేదా పరిపాలనను స్థాపించాలనే  ప్రయత్నం జ‌రిగింది. అయితే అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయ‌యి.  చరిత్ర దీన్ని రుజువు చేస్తుంది.  అయితే  ఈ రోజు మత ప్రాతిపదిక‌గా ఆఫ్ఘనిస్తాన్ ని సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుండి *విముక్తం* చేయడం అనే ప్రక్రియను విమర్శనాత్మకంగా ప‌రిశీలించాలి.  ఈ పరిశీలన ఆఫ్ఘనిస్తాన్ సామాజిక సంబంధాల నుంచి,  ఉత్పత్తి సంబంధాల నేపథ్యం నుండి
కాలమ్స్ ఆర్ధికం

శ‌ర‌వేగంగా పెరుగుతున్న అస‌మాన‌త‌లు

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని
కాలమ్స్ ఆర్ధికం

ఇండో- పసిఫిక్ లో ఆకస్ చిచ్చు

ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న అగ్రరాజ్యాలు భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో తమకనుకూలమైన రీతిలో కూటములు ఏర్పరచుకుంటున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించిన అగ్రరాజ్యం అమెరికా పోయిన పరువును నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతుంది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములు కడుతున్నది. పులి మాంసం తినడం మానేసిందన్నట్లు ఇక యుద్ధం ముగిసింది అంటూనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త పన్నాగంతో సెప్టెంబర్ 15న బ్రిటీష్, ఆస్ట్రేలియాతో కలిసి చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి ఆ మూడు దేశాల పేర్లు గుది గుచ్చి 'ఆకస్'గా వ్యవహరించబోతున్నారు. దీంతో అమెరికాకు యూరోపియన్ యూనియన్ తో ఇంతకాలం ఉన్న సత్సంబంధాలు బెడిసి కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు
కాలమ్స్ కొత్త కవిత్వం

తూర్పు ముఖం

తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం,   ఎన్.కె.లాల్ బనో గులామి  చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని  ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. క‌ళ్యాణ‌రావు #, కాలం*, కాశీం మానాల‌, గుత్తికొండ వంటి దీర్ఘ‌క‌విత‌లు చ‌రిత్ర‌ను, విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌ను న‌మోదు చేశాయి.    వీరంద‌రూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు  వేశారు.  ఛాయారాజ్  వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు
కాలమ్స్ కవిత్వంలోకి

నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి

కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది.  వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు  ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై
కాలమ్స్ లోచూపు

ఆధునిక తెలుగు సాహిత్య చ‌రిత్రలో విర‌సం

చ‌రిత్ర  వికాసక్రమంలోని ప్రజల అనంతమైన ధిక్కారాలను, సాహసోపేతమైన పోరాట ఆచరణల  సారాన్ని  విప్లవ రచయితల సంఘం తనలో అంతరంగీకరించుకున్న‌ది.  చారిత్రక చోదకశీలమైన మానవ కర్తృత్వమనే సారభూతశక్తిని అపూర్వరీతిలో ప్రేరేపించింది. దీని వల్ల ఆధునిక కాల్పనికత విప్లవ కాల్పనికతగా రూపాంతరం చెందింది. ఈ కోణంలో చూస్తే మిత్రుడు పాణి రాసిన 'సృజనాత్మక ధిక్కారం' అనే పుస్తకానికి నిస్సందేహంగా అత్యంత చారిత్రక ప్రాసంగికత ఉన్నదని చెప్పవచ్చు.  విర‌సం యాభై ఏళ్ల సంద‌ర్భంలో త‌ను ఈ పుస్త‌కం రాశాడు.   మామూలుగా కల్పన అనగానే అది వాస్తవంతో ప్రమేయం లేని ఊహాజనితమని చాలా మంది  అనుకుంటారు. కాని కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో
కాలమ్స్ కవి నడిచిన దారి

నిర్వాసిత వాక్యం

"కొన్నిదారులకు అడుగుల గుర్తులని దాచే అలవాటుండదు, కొన్ని అడుగులకు దారులతో అవసరం ఉండదు."  ఈ మాటని ఎప్పుడు, ఎక్కడ విన్నానో, చదివానో కూడా గుర్తు లేదు, మర్చి పోయాను. ఇప్పుడు నేను నడిచి వచ్చిన బాట కూడా అలాంటిదే. నా పుట్టుక జరిగింది అన్నదానికి, ఒక నేను మిగిలి ఉండటం తప్ప, నేను నడిచిన భూమి, పెరిగిన ఇల్లు, చదువుకున్న బడి... ఏదీ లేదు. మా ఊరు ఇప్పుడు లేదు. ఓపెన్ కాస్ట్ మింగేసింది. ఊరు ఉండాల్సిన ప్రదేశం ఓ పెద్ద మానవ నిర్మిత లోయగా మారిపోయింది.. అభివృద్ధి  అనేది ఎంత గొప్ప పదమో అంత విషాదకరమైన మాట
కథ..కథయ్యిందా! కాలమ్స్

అధివాస్తవికతను ఎంచుకొని వాస్తవికతను చెప్పిన కథ

కార్పొరేటమ్మా - రాజకుమారుడు. భరించలేని వాస్తవాలు , ఒక్కోసారి తిరగేసి చెప్తూనే తప్ప సంతృప్తినివ్వనంత , వొత్తడికి గురిచేస్తాయి. నడుస్తున్న చరిత్ర  తలకిందులతనాన్ని  భరించడమెలాగో  తెలియనప్పుడు  మనం తలకిందులుగా  నడవడమే  ఏకైక మార్గంగా అనిపిస్తుంది. అప్పుడు కార్పొరేటమ్మా - రాజకూమారుడు లాంటి  అధివాస్తవిక కథలే  వస్తాయి. అధివాస్తవికత , వ్యంగం , వాస్తవికత మూడూ ఒకే కథలో  కథనమై కన్పిస్తాయి. ఆ  కలగాపులగపు  కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని  పాఠకులకు  సవాళ్ విసురుతుంది. ఒక కథ   మొత్తం కథనం  ఒక రకమైన  ధోరిణిలో నడవడానికి , చదవడానికీ అలవాటు పడ్డాం కదా  ,
కాలమ్స్ కవి నడిచిన దారి

ఒక్కడుగు

అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే' దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే
ఓపెన్ పేజీ

వాళ్లు తాలిబాన్ల‌కంటే భిన్నంగా ఉన్నారా?

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు  పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్‌లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం