శరవేగంగా పెరుగుతున్న అసమానతలు
బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని










