డ్యామ్ ఒద్దంటున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు
సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్. ఈ సమావేశం 10,000 మెగావాట్ల










