ఎట్టకేలకు కప్పన్‌కు బెయిల్
40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా,










