వ్యక్తిగత గోప్యతకు తూట్లు
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగియక ముందే మరో వివాదస్పద అంశం కొత్తగా ముందుకొస్తున్నది. ఇప్పుడు “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు(పిడిపిబి) 2021” పేరుతో మరో వివాదం ముంచుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారత్ సంతకం చేసింది. ఏడు దశాబ్ధాలు గడిచినా ఆమేరకు పటిష్ట చట్టాన్ని రూపొందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి 128 దేశాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే










