స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి
(ఇటీవల విడుదలైన పాణి నవల ‘అనేకవైపుల’కు రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు) అనేక ఉద్వేగాలతో పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల చదవడమంటే నేర్చుకోవడమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తీవ్రమవుతున్న వాతావరణం ఇది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల మీద క్రూరమైన అణచివేత ప్రయోగిస్తున్నది. ప్రజా ప్రతిఘటన కూడా వీరోచితంగా సాగుతున్నది. మన దేశంలో యాభై సంవత్సరాలుగా ప్రజలు అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధరంగంలో ఉన్నారు. అనేక రకాల అణచివేతలకు దాటుకొని ముందుకు పోతున్నారు. ఇటువంటి ఉద్రిక్త ఉద్విగ్న హింసాత్మక వాతావరణంలో ఈ నవల రూపొందింది. ‘చదవడం అంటే నేర్చుకోవడమే. అమలు










