పిచుకలకు రెక్కలొచ్చే వేళ
సాయీనీతో పాటుగా ఇంతమందిమాటాడుతుంటే వాడికేదో భయం కదా చావు నీ ముందు కరాళనృత్యం చేసినానీ గుండె చెదరలేదునీ నిబ్బరం వెనక వున్ననమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా? నీ మాటా నీ నవ్వే వాడినిబెదరకొడుతూ వున్నాయా? ఎందుకో మాటాడే వారంటేచెదరని నవ్వుగలవారంటేరాజుకెప్పుడూ భయమనుకుంటా ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా నువ్వెప్పుడూ అంటావు కబీరునిఆలపించమనిమనుషుల్ని ప్రేమించమని కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూదేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు న్యాయానికి గంతలు కట్టిన్యాయమూర్తుల గుండెలపైఉక్కుపాదం మోపితీర్పులను తిరగరాయిస్తున్నాడు చీకటిని తెరచే ఉషోదయమొకటివేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది పిచుకలకు రెక్కలొచ్చినిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతోదూరంలో లేదు బాబా !! (సాయిబాబా విడుదల కోరుతూ)