కవాతు..
ఇప్పుడు ఒక నిశ్శబ్దంకమ్ముకున్నది దుఃఖమొక్కటేభాషగా మారింది ఎవరికి వారుమౌనంగాసంభాషిస్తున్న సమయం చిరునవ్వుల సితారాపల్లవించనివిషాద సందర్భం మీరలా చేరగిలబడినఆ మద్ది వృక్షంవిషాద సంకేతంగారాల్చిన ఆకులనుమీ దేహం పై వేస్తూ మీరు దాహంతీర్చుకున్న ఈ సెలయేరుదుఃఖిస్తూ ఉప్పగా మారింది మీతో కలిసి పాడినపక్షుల గుంపులుమౌనంగా రోదిస్తున్నాయి యుద్ధానికి సంకేతంగామారిన సాకేత్ దాదాఎక్కడని కుందేళ్ళగుంపు అడవినంతాగాలిస్తున్నాయి శతృవు గుండెల్లోపేలిన ప్రతి తూటానెత్తురంటినకంటితో వినమ్రంగావిప్లవ జోహార్లర్పిస్తున్నాయి మీరు నేర్పిన నడకతోవిస్తరించి సరిహద్దులనుచెరిపేసిన ప్రజా పంథాకన్నీటిని ఒత్తుకుంటూఎర్రజెండాను ఎత్తిపట్టింది వీరునికితంగేడు పూల మాలలతోవీడ్కోలు పలుకుతూకదులుతోందిప్రజా యుద్ధ కవాతు.. (కామ్రేడ్ ఆర్కే స్మృతిలో)