అనగనగనగా… ఒక మంచం!
‘నానమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పందిరి మంచం తీస్కెళ్ళిపోతాను నువ్విక ఆపలేవు నన్ను. పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడిస్తావు నానమ్మా... నువ్వూ పడుకోవు, అమ్మనీ పడుకోనీవు. నాకూ ఇవ్వవు. స్టోర్ రూమ్‌లో ఆ నల్ల దుప్పటితో కప్పెట్టేస్తావు అదేదో పురావస్తు గ్నాపకంలా... షాజహాన్ ముంతాజ్ కోసం కట్టిన తాజ్‌మహల్లా... ఏంటది నానమ్మా అర్థం ఉండాలి. వస్తువులు, మనుషులు అందరికీ ఉపయోగపడాలి అంటావుగా నువ్వు. అంత పెద్ద అందమైన పందిరి మంచం, చూస్తేనే నిద్రొచ్చేలా ఉండే పందిరి మంచం, జోలపాడుతూ అమ్మ ఒడిలా కమ్మగా జోల పాడుతూ నిద్రపుచ్చే పందిరి మంచం... కమ్మటి కలల్నిచ్చే పందిరి మంచం










