నేను
నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.










