పదునెక్కిన వేళ యిది
చిలకమ్మా! చిలకమ్మా!చైత్ర మాసపు వెన్నెలపండునుదోచుకుపోదామని వచ్చిందెవరేఉలుకమ్మా! పలుకమ్మా! బుడి వడి నడకలబుడతన్నా ఉడతన్నారాసుకొని దాచుకున్నజనరూపకాలను దండుకుపోయినదెవరే కూతలమ్మా క్రో యిలమ్మాతెలవారు చల్లని సంధ్యలోనీరెండతొడిగిన లేమావి చిగుళ్లనుపచ్చటి చెట్టుమీదేచిదిమేసే ఆ మృగమెవరే జాజిమల్లీ ప్రేమవల్లీనిండారా దాచుకున్నపూలసుగంధాన్నిమురికి కాలువలోకివొలిపిన మూర్ధుడెవరే పట్నంపాలబడ్డ పాలపిట్టాపసుల పిలగాని వకాల్తాఅడవిలిక్కుజిట్టల కేసు కట్టలుమాయం చేసిందెవరేఎవరమ్మా? ఆ బూచొోళ్ళు డమ డమా టమ టమాటముకేసే నామాల పిట్టానీతప్పేటమూగదయ్యిందిచిర్రా, చిటికెనపుల్లాఇరిచేసిందెవరే పద్మమ్మా పద్దమ్మాజిట్రేగి చెట్లపై నువు గీసినఅమరుల చిత్రాలుదొంగిలించినదెవరే!ఎవరమ్మా ఆ బూచోళ్ళు నెత్తిన తురాయినెత్తినతురక పికిలి పిట్టానీ కలలను, కాంక్షలనుకొల్లగొట్ట వచ్చిందెవరేపూలపట్టురెక్కలనువిరివజూసిందెవరే మందార ఎరుపెరుపువెదురు జీనువాయీకాలం ముంచుకొస్తోందిఆడివంచుల నుంచిఆకురాయి తేగలవా కంసాలి పిట్టనూవడ్రంగి పిట్టనూ పిలవండేకాలం ఎట్టేడుస్తుందో యేమోఇంకమనమూ