కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం
''వట్టిమాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్'' అన్నారు మహాకవి గురజాడ. కానీ, దీనికి విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా వ్యవహారిస్తోంది. మోడీ అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించానని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నానని, బయో-ఎకానమీ 8 రెట్లు వృద్ధి చెందినట్లు మోడీ స్వయంగా ప్రకటించాడు. మరోవైపు పర్యావరణ నిబంధనలు 'అభివృద్ధికి ఆటంకం' అని మోడీ చెబుతున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఇది డొంక తిరుగుడుగా మద్దతు పలుకడమే అవుతుంది. నిజానికి బయో-ఎకానమీ అంటే పర్యావరణానికి హానిచేసే శిలాజ ఇంధనాల వాడకం నుండి