రామానుజుడు-ఆయన సమత
క్రీశ 1017-1137 మధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయన తాత్వికంగా, ఆచరణాత్మకంగా వ్యవస్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వచ్చేనాటికి ఉన్న చారిత్రక , తాత్విక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన *సమతా వాదాన్ని* కీర్తించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంకరుడి అద్వైతం బలంగా ఉండింది. *బ్రహ్మ సత్యం- జగం మిధ్య* అనేది ఆయన ప్రధాన సిద్ధాంతం. దీన్నుంచే తత్వమసి అనే భావనను తీసుకొచ్చాడు. పరబ్రహ్మవు నీవే. ఈశ్వరుడు, మానవుడు(ఆత్మ) వేరే కాదు. రెండూ ఒకటే అనేది అద్వైతం. జగం మిధ్య అనడంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీకరించలేదు.










