ఖైదులో సురేంద్ర గాడ్లింగ్: అనేక క్రూరత్వాలు, వైచిత్రాలు, అన్యాయాలు
2024 జూన్ 6 నాటికి సురేంద్రను అరెస్టు చేసి ఆరేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ ఆరేళ్లు! ఈ కాలాన్ని కొన్ని పదాల్లో వివరించడం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వుండిన స్థిరత్వం, భద్రత, స్నేహితులు, బంధువులు, సంతోషాలతో ఉన్న జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయింది. నా ఘోరమైన పీడకలల్లో కూడా ఊహించలేనంత వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఇంటిపై దాడి జరిగిన 2018 ఏప్రిల్ 17నాటి భయంకరమైన తెల్లవారుజామును నేను గుర్తుచేసుకున్నాను; సురేంద్రను తీసుకెళ్ళిన 2018 జూన్ 6 నాటి ఆ దుర్మార్గపు ఉదయం. ఇది నిజంగా జరిగిందని నమ్మడానికి నాకు చాలా సమయం










