సంపాదకీయం

అకాడమీ  ఎందుకు  అవార్డులిస్తుందో  రచయితలకు తెలియదా?

మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్‌ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి  మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.
సంపాదకీయం

భారత విప్లవోద్యమ దశలన్నీ ఆయన జీవితంలో…

మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లలో కొందరిని మర్చిపోవచ్చు.   ఇతరులను ప్రభావితం చేయగల వాళ్లను అంత సులభంగా మర్చిపోలేం. మన ఆలోచనలనో, లోకాన్ని పరిశీలించే చూపునో, జీవించే పద్ధతినో  వాళ్లు ముట్టుకొని ఉంటారు. ఈ అంశకు కాలంతోపాటు ఎదిగే స్వభావం ఉంటే.. వాళ్లు మన జ్ఞాపకాలను, ఉద్వేగాలను, అనుబంధాలను దాటి చరిత్ర పరిధిలోకి వెళతారు. అంటే ఆలోచనలను ప్రభావితం చేసే దశ నుంచి భౌతిక పరిస్థితులను మార్చే  క్రమంలో కూడా  వాళ్లు భాగం అవుతారు. చరిత్రను నిర్మించే పని మొదలు పెడతారు. ఈ సమాజం అందించే ఏ ప్రత్యేకతలు లేని మామూలు మనుషులు ఈ పనిలో భాగమైతే ఎంత
సంపాదకీయం

రాజ్యాంగమూ రాజదండమూ

మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో,  భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది.  కళ్ల ముందు కనిపించే  వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది.  అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం  ఘర్షణ పడినప్పుడు అది  పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్‌ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న
సంపాదకీయం

మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం
సంపాదకీయం

స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి
సంపాదకీయం

వాకపల్లి అత్యాచారం నుంచి వైమానిక దాడుల దాకా

వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద   కేసును  ఏప్రిల్‌ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్‌ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది.  ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి  కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి మహిళల
సంపాదకీయం

‘రాహుల్‌ వాదం’ వినిపించాల్సిందేనా?

రాహుల్‌ గాంధీ ఉదంతాన్ని సాధారణ అధికార రాజకీయాల్లో భాగంగా చూడ్డానికి లేదు. పాలకవర్గంలోని ముఠా తగాదాగానే చూడ్డానికి లేదు.  దేశ రాజకీయాలు వేగంగా కొత్త దశలోకి చేరుకుంటున్నాయనడానికి ఇది గుర్తు. ఫాసిస్టు పాలనలో దేశమంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయి, అనేక మంది జైళ్లపాలై, అనేక మంది అనర్హతలను, నిషేధాలను, అణచివేతలను ఎదుర్కొంటున్న సందర్భంలో పాలక పార్టీ నాయకుడైన రాహుల్‌గాంధీకి కూడా అలాంటి అనుభవమే కలిగింది.  ఫాసిజానికి వ్యతిరేకంగా దేశమంతా  నిరసనలు, ఉద్యమాలు పదునెక్కుతున్న తరుణంలో రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అనేవి ప్రజా క్షేత్రంలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫాసిజం పాలకశక్తులను కూడా
సంపాదకీయం

మావోయిస్టురహిత భారత్‌‍లో 2024 ఎన్నికలు

త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.
సంపాదకీయం

ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని

స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని
సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.