దండకారణ్య సమయం

ఆదివాసీ యువ  నేత అరెస్టు  

ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది. గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్‌పూర్ జైలుకు పంపారు. రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది. తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ,
పత్రికా ప్రకటనలు

పదమూడు నెలల ఆపరేషన్ కగార్

ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం. ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా  2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.