వ్యాసాలు కారా స్మృతిలో

కథతో ప్రయాణం

కారా మాస్టారు జనాపకాల్లోకి పోయేముందు మనం కథా ప్రక్రియ ఎందుకు ఎన్నుకున్నామో, ప్రేరేపించిన కారణాలు ఏమిటో ఆలోచిస్తేనే ఓ అనుభూతి! నాకు కలిసొచ్చిన అవకాశం ఏమిటంటే 8 వ తరగతి నాటికే మా ఇంట్ల అన్ని రకాల పుస్తకాయాలుండటం. మా పెద్దన్నయ్య వరంగల్ గాబ్రియల్ స్కూల్ విద్యార్థి. క్యాథలిక్ క్రిస్టియన్ ఫాదర్ గా శిక్షణ పొంది, చివరి దశలో ఎన్నో కారణాలతో బయటకు రావడం. అతనికి లిబరేషన్ థియాలజీ మీదున్న విశ్వాసం, మాటలు నన్ను ఆకర్షించేవి. హైదరాబాద్, విజయవాడ నుండి ఎన్నో పుస్తకాలు వచ్చేవి. అలా నాకు నవలలు, కథలతో పరిచయం ప్రారంభమైంది. ఎమిలీ జోలా నవల ‘భూమి’