అవును! లెనిన్ ప్రపంచమంతా పర్యటిస్తాడు!                    
దేశాల మధ్యన సరిహద్దు రేఖలు ఏవీ అతన్ని ఆపలేవు!
సైనిక స్థావరాలు అడ్డుగోడలు కాదు కదా!
ఏవీ, ఏవి కూడా లోకమంతా తిరిగాడే లెనిన్ ని ఆపలేవు!
కనీసం ఇనుప కంచల ముళ్ళు కూడా అతన్ని గాయపరచ లేవు!
~~
అవును! లెనిన్ లోకమంతా సంచారిలా తిరుగుతాడు!
నలుపు, గోధుమ, తెలుపు రంగుల మనుషులు అతనికి స్వాగతం పలుకుతారు!
ఇక భాష అంటారా? లెనిన్ కి ఒక అడ్డంకి కానే కాదు!
వింతైన భాషలో మాట్లాడే నాలుకలు కూడా అతన్ని నమ్మేస్తాయి !
అవును! లెనిన్ నిత్యం లోకమంతా తిరుగుతూనే ఉంటాడు!
ఆకాశంలో అస్తమించే సూర్యుడు కూడా లెనిన్ ముందు ఒక మచ్చలా మిగిలిపోతాడు తెలుసా?
ఇక అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది.
అంధకారానికి, ఉషోదయానికి నడుము కోటి కాంతులతో మెరిసిపోయే ఒక అరుణతార ఉదయిస్తుంది!
అవును లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు అప్పుడు ఇప్పుడు, ఎప్పుడూ


అనువాదం : గీతాంజలి

కవి పరిచయం: లాంగ్స్టన్ హ్యూస్ (1901- 1967)
ప్రముఖ అమెరికన్ ఆఫ్రికన్ కవి. నవలా రచయిత, నాటక కర్త. హార్లెం పునర్జీవన ఉద్యమ నాయకుడు. ఆఫ్రో అమెరికన్ల జీవితాలను వారి కష్టాలను జాజ్ సంగీత శైలిలో తన కవిత్వంలో ప్రతిబింబించిన మొదటి జాజ్ కవిగా ఆయన ప్రసిద్ధులు. ది నీగ్రో స్పీక్స్ ఆఫ్ రివర్స్","ది వెరీ బ్లూ స్", "లెట్ అమెరికా బి అమెరికా అగైన్"! హ్యూజ్ ప్రసిద్ధ రచనలు. ఫిబ్రవరి 1 1901 మిస్సోరీ లోని జోప్లిన్ లో జన్మించారు.

కొలంబియా యూనివర్సిటీ లో బీయే (BA) చేశారు. 1920 నుండి 1960 వరకు కవిత్వం, నాటకాలు, నవలలు వ్యాసాలు, రాశారు. హార్లెం పునరుజ్జీవన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి నల్లజాతీయుల సంస్కృతిని హక్కులను తన రచనల ద్వారా బలంగా వినిపించారు. సామాజిక అసమానతలను జాత్యహంకారాన్ని తన రచనలలో ప్రశ్నించారు. సాధారణ ప్రజల భాషలో వారి అనుభవాలను జాజ్ బ్లూ స్కీమ్స్ తో కవిత్వంగా రాశారు . జాజ్ సంగీత కవిత్వాన్ని రాసిన మొదటి కవి.

మే 22 1967న న్యూయార్క్ లో క్యాన్సర్ తో మరణించారు. ఫ్యూజ్ నల్లజాతీయుల అనుభవాలను బాధలను కళారూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచయితగా ఉద్యమకారుడుగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు.

Leave a Reply