నేల ఒరిగిన ఓ శిరస్సు 
దాని పెదవులపై కత్తిరించబడ్డ చిరునవ్వు
కనులలో ఒలికి గడ్డకట్టిన రక్త చారిక

గాయపడ్డ గొంతులోంచి ఓ పాట
ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ
నీలోంచి ఉబికి వస్తూంది

నువ్విదిల్చినా వదలని ఆ
చిరునవ్వు నీలోకి ఇంకుతూ ఇగురుతూ
నిన్ను అనామధేయుణ్ణి చేస్తూంది

తొలి దారుల ఆదిమ పూల
బాలింతరపు వాసనతో
చుట్టూ పరివ్యాప్తమవుతూ
మరల కార్యోన్ముఖుణ్ణి చేస్తూంది!!

One thought on “ఆదిమ పూల వాసన

Leave a Reply