బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి పని విధానం గత దశాబ్ధ కాలంలో బాగా బలపడ్డాయి. ఫాసిస్టు స్వభావం గల బిజెపి రాజకీయ పార్టీగా ఆధిపత్యం సాధించింది. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో మనువాద ఫాసిస్టు స్వభావం గల మితవాద, మతోన్మాద, నిరంకుశ శక్తులు బలపడ్డాయి. హిందూత్వ బడా బూర్జువా-భూస్వామ్య వర్గాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది. ఆ వర్గాల మద్ధతును తన వెనుక బలంగా సమీకరించుకుంది. హిందూత్వ సిద్ధాంత ప్రభావాన్ని విస్తరించి, బడా పెట్టుబడిదారులతో కూటమి గట్టి, ముందెన్నడూ లేనంతగా ధన బలాన్ని, మీడియా బలాన్ని ఉపయోగించి మితవాద శక్తులు బలపడేలా చేయగలిగింది. దాని పాలనలో అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా విస్తరించాయి. పార్టీని యావత్తూ తమ చేతుల్లో కేంద్రీకరించుకున్న మోడీ-షాల ద్వయం ఆధిపత్యం కొనసాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌తో మొదలుపెట్టిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన ‘(ఎన్‌ఎంపి) పథకం ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు, ఆశ్రితులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం నాలుగు సంవత్సరాల కాలంలో (2022-2025) దాదాపు 6లక్షల కోట్ల ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా ప్రకటించుకుంది. అందువల్ల సఅభివృద్ధి చెందిన భూములను, జాతీయ రహదారులను, రైల్వేలు, విమానాశ్రయాలు, పైప్‌లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు వంటి సకల ప్రజా ఆస్తులపై గుత్తాధిపత్యాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు, ఆర్థిక సంస్థలకు దీర్ఘకాలిక ‘లీజు’ పేరిట కట్టబెడుతుంది. ‘నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’ పేరిట ప్రభుత్వం మౌలిక నిర్మాణాల ప్రాజెక్టులలో భారీ పెట్టుబడులను పెడుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కేవలం ఐదు బడా కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున సంపదను పోగేసుకుంటున్నాయి. స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారులకు దోచి పెట్టే మార్గాలు రూపొందించడం మరొక లక్షణం.
కార్పొరేట్ల కోసం ఆదివాసీల హక్కులకు తూట్లు:
దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు, ఆశ్రిత పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలతో సహా పెద్ద పెద్ద కార్పొరేషన్లు గనుల తవ్వకం, ఖనిజాల అన్వేషణ, వెలికి తీయడం వంటి కార్యకలాపాలను చేపట్టే పరిశ్రమలను, నిర్మాణాలను, వాణిజ్యపరమైన కార్యకలాపాలను జీవ వైవిధ్యపరంగా సున్నితమైన ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నారు. అడవులు లోపలికి, అభయారణ్యాలలోకి సైతం చొరబడుతూ అక్కడి జీవ వైవిద్యానికి హాని కలిగిస్తున్నారు. అడవులలోని సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనుల, ఇతర అటవీవాసుల, ఇతర ప్రజల జీవితాలను, ఆవాసాలను, వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నారు. మరోవైపు ఆదివాసీలకు చట్టాలు కల్పిస్తున్న రక్షణ అంతంత మాత్రమే. ఆ రక్షణను, ముఖ్యంగా స్వయంపాలనా హక్కును తీవ్రంగా దెబ్బతీసేలా బిజెపి ప్రభుత్వం అనేక చట్టాలకు నిబంధనలకు సవరణలు తెచ్చి తనకున్న మెజారిటీతో పార్లమెంటులో వాటిని ఆమోదింపజేసుకుంది.
ఆదివాసీలకు చట్టాలు కల్పిస్తున్న రక్షణ అంతంత మాత్రమే. ఆ రక్షణను, ముఖ్యంగా స్వయంపాలనా హక్కును తీవ్రంగా దెబ్బతీసేలా బిజెపి ప్రభుత్వం చట్టాలకు, నిబంధనలకు అనేక సవరణలు తెచ్చి తనకున్న మెజారిటీతో పార్లమెంటులో వాటిని ఆమోదింపజేసుకుంది. అటవీ సంరక్షణ చట్టానికి, దాని నిబంధనలకు తెచ్చిన సవరణలు ‘గ్రామసభ’ అన్న పదాన్నే తొలగించాయి. అటవీ హక్కుల చట్టానికి, గనుల, ఖనిజాల అభివృద్ధి చట్టాలకు తెచ్చిన సవరణలు ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులపై వారికి పూర్తి సమాచారాన్ని అందించి వారు ఇష్టపూర్వకంగా ఆ ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపినప్పుడే వాటికి అనుమతులివ్వాలన్న నిబంధనలను తొలగించాయి. గ్రామసభ అనుమతులు లేకుండానే మైనింగ్ కంపెనీలకు ఖనిజ నిక్షేపాల అన్వేషణ పేరుతో అనుమతులు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ సవరణలు తెచ్చారు. ఆదివాసీల అనుభవంలో ఉన్న భూములను సేకరించే సందర్భాలలో భూమికి బదులు భూమిని ఇవ్వాలనే విధానాన్ని నీరుగార్చి ఉల్లంఘిస్తున్నారు.
అటవీ హక్కుల చట్టానికి, గనుల, ఖనిజాల అభివృద్ధి చట్టాలకు తెచ్చిన సవరణలు ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులపై వారికి పూర్తి సమాచారాన్ని అందించి వారు ఇష్టపూర్వకంగా ఆ ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపినప్పుడే వాటికి అనుమతులివ్వాలన్న నిబంధనలను తొలగించాయి. గ్రామసభ అనుమతులు లేకుండానే మైనింగ్ కంపెనీలకు ఖనిజ నిక్షేపాల అన్వేషణ పేరుతో అనుమతులు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ సవరణలు తెచ్చారు. ఆదివాసీల అనుభవంలో ఉన్న భూములను సేకరించే సందర్భాలలో భూమికి బదులు భూమిని ఇవ్వాలనే విధానాన్ని నీరుగార్చి ఉల్లంఘిస్తున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంతేకాకుండా ఉనికిలో ఉన్న చట్టాలను, రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళలో, పీసా చట్టంలో ఆదివాసీల భూములకు రక్షణగా ఉన్న నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారు. ఆ విధంగా ఆదివాసీలకు మౌలికంగా నీటిపై, అడవిపై, భూమిపై ఉన్న హక్కులు (జల్, జంగల్, జమీన్) తీవ్ర దాడికి గురౌతున్నాయి.
ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నిర్వాసితులౌతున్నారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో దేశపు సహజ సంపద ఎక్కువగా ఉంది. అందుచేత ఆదివాసీలకు ఈ ప్రాంతాలపై హక్కులను కల్పించే చట్టాలన్నీ కార్పొరేట్ల ప్రయోజనాలకు ప్రతికూలంగానే ఉంటాయి. ఈ అర్థంలో చూసినప్పుడు కార్పొరేట్లకు, ఆదివాసీలకు నడుమ జరుగుతున్న సంఘర్షణలో ప్రభుత్వం స్పష్టంగా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నది. ప్రైవేటు కంపెనీలు విచక్షణారహితతంగా, ఎటువంటి నియంత్రణా లేకుండా ఆదివాసీ ప్రాంతాల్లోకి వివిధ ప్రాజెక్టుల ద్వారా చొరబడుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రైవేటు ప్రమోటర్లు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వాలు పర్యాటక వసతిగృహ సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. ‘ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ’ అన్న విధానం కాస్తా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ‘కార్పొరేట్ ప్రయోజనాల కోసం భూసేకరణ’గా మారిపోయింది. ప్రైవేటీకరణ విధానంతో బాటు నియంత్రణలను తొలగించడం కూడా జరుగుతోంది.
చత్తీస్‌గఢ్ సహజ వనరులకు నిలయం :
చత్తీస్‌గఢ్‌లోని అనేక సహజ వనరులు ఇంకా పూర్తిగా అన్వేషించబడనప్పటికీ, రాష్ట్రంలో వజ్రం, బగ్గు, ఇనుప ఖనిజం, సున్నపురాయి, డోలమైట్, బాక్సైట్, టిన్ ఖనిజం చత్తీస్‌గఢ్ యొక్క ముఖ్యమైన సహజ వనరులు. చత్తీస్‌గఢ్ మాత్రమే టిన్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం. రాష్ట్రంలో అణు ఖనిజాలు, విలువైన మెటల్ బంగారం కూడా ఉన్నాయి. రాష్ట్రానికి మైనింగ్ రంగం కీలకమైన ఆదాయ వనరు. చత్తీస్‌గఢ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి, దీని చుట్టూ ఆరు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో జనాభా సాంధ్రత తక్కువగా ఉంది. ఉక్కు, అల్యూమినియం, సిమెంట్ రాష్ట్రంలోని ప్రధాన ఖనిజ ఆధారిత వ్యాపారాలలో ఉన్నాయి. దాని పిట్ హెడ్ పవర్ యూనిట్ల కారణంగా, రాష్ట్రం చౌకైన విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను కలిగి ఉంది. దాని కేంద్ర స్థానం విద్యుత్ ప్రసారాన్ని సులభతరం చేస్తుంది. ఘన కార్మిక సంబంధాలు, కార్మిక సామర్థ్యం పరంగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 44 శాతం భూమి, భారతదేశంలోని 12 శాతం అడవులకు నిలయంగా ఉంది, చత్తీస్‌గఢ్ సహజ వనరులలో ఒకటి. పారిశ్రామిక అభివృద్ధికి జీవనాడి 2225 కిలోమీటర్లు, బాగా అభివృద్ధి చెందిన అంతర్గత రహదారి నెట్‌వర్క్‌తో కూడిన 11 జాతీయ రహదారులు. ఖనిజ వనరులు చత్తీస్‌గఢ్ ఆర్థికంగా లాభదాయకమైన ఖనిజ వనరులకు మద్దతు ఇవ్వడానికి అనువైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంది.
రాష్ట్రంలోని గణనీయమైన భాగం క్రేటాన్లు, మొబైల్ బెల్టులు, సుప్రాక్రస్టల్ బెల్టులతో కప్పబడి ఉంది, ఇవి విస్తృత శ్రేణి ఖనిజ నిక్షేపాలకు అనువైన ఆవాసాన్ని అందిస్తాయి. వజ్రం, బగ్గు, ఇనుప ఖనిజం, సున్నపురాయి, డోలమైట్, బాక్సైట్, టిన్ ధాతువు ఖనిజాలు. చత్తీస్‌గఢ్ మాత్రమే భారతదేశంలో తగర ఖనిజాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం. బంగారం, ఇతర విలువైన లోహాలు, అణు ఖనిజాలు రాష్ట్రం అంతటా కనిపిస్తాయి, దీని ఫలితంగా చత్తీస్‌గఢ్ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. కొరండం, క్లే, క్వార్ట్జెట్, బేస్ లోహాలు, ఫ్లోరైట్, బెరిల్, అండలూసైట్, క్రయానైట్, సిల్లిమనైట్, టాల్క్, సోప్‌స్టోన్, గార్నెట్, ఇతర ఖనిజాలలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్ సహజ వనరు ప్రపంచ స్థాయి ఇనుప ఖనిజ వనరులకు నిలయం (68 శాతం). రాష్ట్రంలో దాదాపు 4031 మిలియన్ టన్నుల అధిక-నాణ్యత గల హెమటిటిక్ ఇనుప ఖనిజం ఉంది, ఇది మొత్తం భారతీయ ఇనుప ఖనిజంలో ఐదవ వంతు. చత్తీస్‌గఢ్ సహజ వనరులు 8959 మిలియన్ టన్నులకు పైగా సున్నపురాయితో జాతీయ వనరులకు 5 శాతం దోహదం చేస్తాయి. రాష్ట్రంలో 10 ప్రధాన సిమెంట్ యూనిట్లు పనిచేస్తున్నాయి. భారతీయ డోలమైట్ నిక్షేపాలలో 11.37 శాతం కలిగి ఉంది, మొత్తం బగ్గు నిక్షేపాలలో చత్తీస్‌గఢ్ సహజ వనరు 18 శాతం కలిగి ఉంది. భారతదేశంలోని టిన్ ఖనిజంలో 35.83 శాతం.
దండకారణ్యంలో మావోయిస్టులపై కార్పొరేట్ యుద్ధం! :
మార్చి 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి అమిత్ షా రూపొందించిన రోడ్ మ్యాప్‌లో ఆపరేషన్ కగార్ కేంద్రంగా పనిచేస్తుంది. జనవరి 2025లో, షా ‘‘డిసిసివ్ డికేడ్: ఎండిరగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం’’ అనే వ్యూహ పత్రాన్ని ప్రభావిత రాష్ట్రాలకు పంపిణీ చేశారు, ఇది మూడు-కోణాల విధానాన్ని వివరిస్తుంది. తీవ్రతరం చేసిన భద్రతా కార్యకలాపాలు, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు, వ్యూహాత్మక లంగుబాటు-పునరావాస కార్యక్రమాలు. ఈ ఆపరేషన్ దాదాపు 800 చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్), దాని ఎలైట్ కోబ్రా బెటాలియన్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) మరియు చత్తీస్‌గఢ్, తెలంగాణ నుండి రాష్ట్ర పోలీసు దళాలతో సహా వివిధ యూనిట్ల నుండి సుమారు 24,000 మంది సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో ఆదివాసులు పక్షుల్లాగా కాల్చి చంపబడుతున్నప్పటికీ, కార్పొరేట్ మైనింగ్ ప్రయోజనాలను కాపాడటానికి ఈ ప్రాంతం అంతటా భద్రతా శిబిరాలు వేగంగా నిర్మించబడుతున్నాయి. భారతదేశ సరిహద్దులను కాపాడటానికి ఉద్దేశించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్‌ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) వంటి దళాలు ఇప్పుడు మధ్య భారతదేశంలోని అంతర్భాగంలో మోహరించబడ్డాయి.
‘మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టింది. అడవంతా పోలీసు క్యాంపులతో నింపేసింది. వేలాది పారామిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్ దళాలతో దండకారణ్యాన్ని కొన్ని రోజులుగా జల్లెడ పడుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలతో అడవి అణువణువునూ శోధిస్తున్నది. ఆదివాసీ గూడేలను తగలబెడుతున్నది. నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ పేరిట పచ్చని అడవిలో నెత్తురుటేర్లను పారిస్తున్నది. మావోయిస్టులను, అమాయక ఆదివాసీ తెగలను ఊచకోత కోస్తున్నది. మారణహోమాన్ని సృష్టిస్తున్నది. మానవ హక్కుల హసనానికి పాల్పడుతున్నది. హింసతో, అణచివేతతో అడవిలో కలోల్లం రేపుతున్నది. గతేడాది జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్‌లో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 500 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారంటే ఎంతటి బీతావహ పరిస్థితి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘన ఏ తీరుగా సాగుతున్నదో ఒక అంచనాకు రావచ్చు.
దళాల కదలికకు, వెలికితీసిన ఖనిజాల రవాణాకు మద్దతుగా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్‌ఓ) పర్యవేక్షణలో నాలుగు లేన్లు, ఆరు లేన్ల రోడ్లను అధిక వేగంతో నిర్మిస్తున్నారు. ఈ ‘‘పరిణామాన్ని’’ వ్యతిరేకిస్తున్నారని అనుమానించబడిన వారిని డ్రోన్ నిఘా, వైమానిక బాంబు దాడులు, భారీ శోధన కార్యకలాపాలు, నకిలీ ‘‘ఎన్‌కౌంటర్’’ చేస్తున్నారు. ఆదివాసీ విద్యార్థులు, తెందు ఆకులు లేదా ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించడానికి అడవుల్లోకి ప్రవేశించే ఆదివాసీలు, వారి గుడిసెలలో విశ్రాంతి తీసుకుంటున్న లేదా వారి పొలాల్లో పనిచేసుకుంటున్నా వారిని కూడా భద్రతా దళాలు చంపుతున్నాయి. వారి శరీరాలకు ఆలివ్ ఆకుపచ్చ యూనిఫాంలు ధరిస్తారు, వాటి పక్కన రైఫిళ్లను ఉంచుతారు, వారి తలలపై భారీ రివార్డులతో ‘‘ప్రమాదకరమైన తీవ్రవాదులు’’గా ముద్ర వేస్తారు. విమర్శకులు చెబుతున్నట్లుగా, ఈ మొత్తం ఆపరేషన్ ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు క్రమబద్ధంగా అప్పగించడానికి సమాంతరంగా నడుస్తోంది.
మరింతకీ ఈ మావోయిస్టులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అడవుల్లో ఎందుకు మగ్గుతున్నారు? ఆయుధాలు ఎందుకు చేపట్టారు? ఆదివాసులతో వారికి అనుబంధమెక్కడిది? వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న వైరమేమిటి? స్వజాతి జనులపై ఎందుకోసం.. ఎవరికోసం ఈ హింస? ఎవరి వికాసానికి రక్తపాతం? ఆపరేషన్ కగార్ ఆంతర్యమేమిటి? ఎవరికి లాభం? మరెవరికి నష్టం? అనే మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి జవాబులు కూడా సుస్పష్టం. మావోయిస్టులు దిగంతాల నుంచి ఊడిపడలేదు. శత్రుదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులు కాదు. ఈ భారతావని బిడ్డలే. మన సోదరీ సోదరులే. ప్రభుత్వాలకు, వాళ్లకు, మనకు మధ్య ఉన్నది కేవలం సిద్ధాంత వైరుధ్యమే. అది శాంతిభద్రతల సమస్య కాదు. ఒక రాజకీయ ఉద్యమం. దశాబ్ధాలుగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షే దానికి కారణం. సూటిగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలు కోసం ఒక వర్గం తరాలుగా సాగిస్తున్న సాయుధ పోరాటం. బిర్సా ముండా, కుమ్రంభీమ్‌ల ఆశయాల ప్రతిరూపమే నూతన ప్రజాస్వామిక విప్లవం. మరెందుకు మావోయిస్టులపై ఈ ప్రభుత్వాల యుద్ధం అంటారా? దండకారణ్యం గర్భంలో దాగిన లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కార్పొరేషన్లకు దోచిపెట్టడానికే నన్నది స్పష్టం.
దశాబ్ధాల కిందటనే మైనింగ్ మొదలైనా అదింకా దండకారణ్యమంతటికీ విస్తరించలేదు. అందుకు ప్రధాన కారణం దండకారణ్యాన్ని పొదివి పట్టుకున్న ఆదివాసీలు. ఆ ఆడబిడ్డలకు ఆలంబనగా నిలుస్తున్న మావోయిస్టులు. అందుకే ఖనిజ సంపద దోపిడీకి ఏ అడ్డు లేకుండా చేసుకునేందుకు కార్పొరేట్ శక్తులు, వాటి అడుగులకు మడుగులత్తుతున్న కేంద్ర ప్రభుత్వం పాలకులు ఆ ఆదివాసీలు, మావోయిస్టుల ఏరివేతకు కుట్రపూరిత ప్రణాళికలకు సైతం దశాబ్ధాల కిందటే తెరలేపాయి. ప్రపంచంలోనే అపారమైన, అత్యంత అరుదైన ఖనిజ నిల్వలకు చిరునామా మన భారతదేశం. అందులోనూ ప్రధానంగా దండకారణ్య ప్రాంతం. మనదేశంలో అటవీ విస్తీర్ణం 2.29 మిలియన్ చ.కి.మీ. ఆ మొత్తం విస్తీర్ణంలో మధ్య భారతంలోని దండకారణ్యం 9.60 శాతం. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రaార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర అతిపెద్ద రాష్ట్రాల్లో లక్షలాది చదరపు కిలోమీటర్ల పరిధిలో దండకారణ్యం విస్తరించి ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపిలో తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ పరిధిలోకి వస్తాయి. ఈ అటవీక్షేత్రం లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాల నిలయం. ఈ దేశ జాతి సంపద. దాని విలువ దశాబ్దకాలం కిందటనే రూ.9వేల లక్షల కోట్లని ఒక ప్రాథమిక అంచనా. ఇప్పుడది అంతకు రెట్టింపు. ఆ ఖనిజ సంపదపై దశాబ్ధాల కిందటనే సామ్రాజ్యవాదుల కన్ను పడిరది.
ముగింపు :
దండకారణ్యంలో ఆదివాసులు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అడవిని వదిలిపెట్టరు. ఇది మావోయిస్టులకు కూడా ఆసరాగా మారింది. ముందు మావోయిస్టులను నిర్మూలిస్తే, ఆదివాసులు వారంతా వారే వెళ్లిపోతారని పాలకుల భావన! నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, కర్రెగుట్టల ప్రాంతాల్లో జరిగిన, జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ ఆ కోవకు చెందినవే. ఈ ఎన్‌కౌంటర్లకు అత్యాధునిక నిఘా యంత్రాలతో సిఆర్‌పిఎఫ్, కోబ్రా బెటాలియన్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) సహా ఇరవై నాలుగు వేలమంది జవాన్లు మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఇక మావోయిస్టులకు ఆఖరి మజిలీ అంటూ మీడియాలో, మాధ్యమాల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్’ నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటల వెనుక దాగున్న ‘ఆంతర్యం’ కూడా ఇదే.
భారతదేశ ప్రజల హక్కుగా, వారి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన సహజ వనరులను(ఖనిజాలను) బహుళ జాతి సంస్థలకు అప్పగించే ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకించడంతో పాటు అడ్డుకోవడం ముఖ్యం. చత్తీస్‌గఢ్ ఒక్కటే కాదు, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లతో మొత్తం పది రాష్ట్రాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది. ఆదివాసుల సహకారం లేకుండా చేయడం, మావోయిస్టుల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడం లాంటి రెండంచెల పోరుతో కేంద్ర హోం శాఖ వ్యూహం రచించింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంకల్ప్‌తో అడవుల్ని జల్లెడ పడుతూ ఎన్‌కౌంటర్లకు తెగబడుతోంది. ఆపరేషన్ కగార్ ఆదివాసీలు లేదా మావోయిస్టులకు సంబంధించిన సమస్యగా చూడకూడదు. ఇది ప్రాథమిక మానవతా, ప్రజా సమస్య. ఇది పర్యావరణ న్యాయానికి, దేశ సంపదకు ముడిపడిన దేశ ప్రజలందరి సమస్య. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం కండ్లముందే సజీవ సమాధి అవుతుంటే దాన్ని ప్రశ్నించకూడదనడం ప్రజాస్వామికం ఎలా అవుతుంది? దేశ ప్రజలందరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులకు భంగం కలిగించే సామ్రాజ్యవాద తొత్తుల కుట్రగా ఆపరేషన్ కగార్‌ను గుర్తించాలి.