ఆకలికి పుట్టిన మొదటి 
బిడ్డ తాను

వెన్నెల వాకిట్లో పెరిగిన
తులసి మొక్క తాను

చెదిరిపోయే అడుగులకు
గమ్యాన్ని చూపించే
అరుణతార తాను

తూటాలను తాకిన
దేహాన్ని కౌగిలించుకున్న
అందమైన ప్రకృతి తాను

ఎర్రమందరాలను కొప్పున చుట్టుకుని
ఎడమ చేతితో కొడవలి సరిపించుకుని
రాజ్యంలోని కలుపు మొక్కలను పికేయ్యడానికై బయలుదేరిన
వ్యవసాయ కూలీ తాను

తానే పుట్టింది
తానే పెరిగింది
తానే యుద్ధం చేసింది
తానే గెలిచింది
తానే మరణించింది
మళ్ళీ
తానే పొద్దై పొడిచింది.

Leave a Reply