సందింట్లో సాయంకాల వేల
అలసిన ఆలికి నాలుగు ముచ్చట్లు
చెప్పే పెనిమిటి తిరిగి వచ్చే రోజు కోసం
ఎగసేపి బిడ్డ కోసం దారిపట్టే
తల్లి ఆవు కోసం
ఊపిరి బిగబట్టి గాలిని
ఎగదని గూడు చేరే
పక్షుల కోసం
నిలువనీడనిస్తూ చిగురించె
ఆ చెట్ల కోసం
స్పందించి స్వరాన్ని వినిపించే
సాయి ఆఖరి శ్వాస విడిచిన వేళ
దిక్కులు దినబోయి
దిశ తిరిగె కొండ గాలి
అలిగిన అమలాపురానికి
మిగిలిన వసంతం
నేల విడువని పాదాలు
మట్టి వదలని చేతుల
మార్పు కోసం
వైకల్యం ఆదమరిచి
ప్రశ్నించే ప్రతి చోట
బలమైన మస్తిష్కం
బంధించిన చెరసాల
యమున గంగను కలసి
ఎదపై గోదారి
కృష్ణమ్మ వెనుతిరిగి
మూసికి ముచ్చట్లు
మంజీరా మా కోసం
రేపటి యుద్ధం కోసం.
