“రవీందర్ ఎక్కాల్సిన మెట్లు ఎక్కనూ లేక, ఎక్కిన మెట్లు దిగనూ లేక సందిగ్ధంలో నిలబడిపోయాడు”

ఎవరీ రవీందర్?

ఎందుకీ సందిగ్ధత?

తెలంగాణ విప్లవోద్యమ ఉద్యమ ప్రతిభావిత గ్రామం నుండి అజ్ఞాతంలోకి వెళ్లి పదిహేనేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. సత్తువ లేకనో చైతన్యమే కొరవడిందో తిరిగొచ్చి సాధారణ జీవితం గడపాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కూడా వద్దనుకొని సాదాసీదాగా ఉండాలనుకున్నాడు. ఐనా ఏదో సందిగ్ధత.

యాదమ్మకు తన ముఖం చూపించలేకపోతున్నాడు.

ఎవరీ యాదమ్మ? ఐలయ్య తల్లి. తన ప్రభావంతో ఎదిగి ఉద్యమంలో చేరి అమరుడయ్యాడు. ఇప్పుడా తల్లికి ఏం సమాధానం చెప్పాలి. ఎట్లా తన ముఖం చూపించాలి .

సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదు అనుకున్న శంకరయ్య సారూ ఇవ్వాళ  విప్లవాచరణలో భాగమైన ఇంటిపనిలో భాగమై రవీందర్ ను తలెత్తుకోకుండా చేశాడు.

తను ఉద్యమంలోకి వెళ్లాలనుకున్న సమయంలో వారించిన తల్లి, పాలేరు ఆశాలు  ఇవ్వాళ ఉద్యమానికి దగ్గరయ్యారు. చెల్లెలు లలిత ఉద్యమంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది.

తన అక్క కూతురు సౌజన్య డిగ్రీ చదివింది. పార్టీ పరిచయంలో ఉంది. మేనమామ లొంగుబాటు ఇష్టంలేక అతనితో మాట్లాడలేకపోతుంది.

పైగా, మామయ్యతో ఎందుకు మాట్లాడటం లేదు అని తన తల్లి అడిగితే….

మామయ్యను ఎంతో గొప్పగా ఊహించుకున్నా …మన వాళ్లంతా మామయ్య గురించి గొప్పగా చెపుతుంటే మురిసిపోయిన…ఒక్కసారైనా చూడాలనీ ఎన్నో మాట్లాడాలని కలలు కనేదాన్ని. …మామయ్యను నేనిట్లా చూడాలనుకోలేదు- అంది. అంతే కాదు ద్రోహుల్లో  కాలుస్తడో ఎవరికెరుక..అని కూడా అంది.

రవీందర్ మనసు చివుక్కుమంది.

పదిహేనేళ్లకు క్రితం తన గ్రామంలో పోరు మొలకలు చల్లి జిల్లాతో పాటుగా రాష్ట్ర ఉద్యమంలో తన వంతు పాత్ర అందించి ఎందరో ఐలయ్యలనూ సురేష్ లనూ తీర్చిదిద్దినవాడు.  ఇవ్వాళ తను ఒక్కో మెట్టు దిగుతుంటే తన తల్లీ చెల్లీ కోడలూ ఆశాలూ శంకరయ్య సారూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు.

అందుకే రవీందర్ లో సందిగ్ధత ….తప్పు చేసిన అపరాధ భావన . ఐలయ్య తల్లి యాదమ్మ ముఖమే కాదు తన మేన కోడలు సౌజీ ముఖమూ సూటిగా చూడలేకపోతున్నాడు.

ఇది కేవలం ఒక్క రవీందర్ జీవితమే కాదు. క్షణికాలోచనో …చైతన్యలోపమో ఉద్యమం నుండి బయటికొచ్చి ….మళ్లీ ఉద్యమంలోకి వెళ్లలేక  ద్రోహిగా మారలేక మెట్ల మీద నిలపడి ముందుకూ వెనకకూ ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో తండ్లాడే అనేక మంది రవీందర్ ల కథ.

 2001 అరుణతార అక్టోబర్ సంచికలో  “మెట్లమీద”అనే పేరుతో అచ్చయిన ఈ కథ ఇటీవలే అమరురాలైన కామ్రేడ్ మిడ్కోరాసింది. కనుక, మిడ్కోను స్మరించుకుంటూ మళ్లీ ఒకసారి ఈ కథను మననం చేసుకుందాం. అటు ఇటుగా పాతిక సంవత్సరాల  కిందటి కథ . ఇప్పుడు చదవండి . రేపటికి కూడా అవసరమైన కథ అనిపిస్తుంది .

మెట్లమీద

మిడ్కో

‘ఇంకెంత దూరం నానమ్మా’ చైతన్య అడగడం ఏ పదోసారో.

‘దగ్గరకొచ్చేసినంరా. ఇగో జీపిక్కడ మలుపు తిరుగుతది గదా. ఇగ ఇక్కన్నుంచి రెండు మైళ్లుబోతే ఊరొస్తది’ చైతన్య భుజంమీద చేం­వేస్తూ చెప్పింది సరోజమ్మ.

‘రెండు మైళ్లా? అంటే ఎన్ని కిలోమీటర్స్‌?’

‘వూడు కిలోమీటర్లు రా’ నవ్వుతూ చెప్పింది.

‘ఈ రోడ్డెమ్మెటే పోతే ఊరొచ్చేస్తదా? మళ్ళా జీప్‌ టర్న్‌ అం­తదా?’ చైతన్య నోరు వూతపడ్డంలేదు.

‘ఇగ సక్కగనే పోతది జీబు’ రెండు గంటల నుంచి మనవడు ప్రశ్నలతో సతాం­స్తున్నా ఓపిగ్గా సమాధానాలు చెప్పసాగింది సరోజమ్మ.

‘ఒరేయ్‌! నానమ్మని సతాం­స్తున్నవ్‌ గదరా’ సరోజమ్మకు మరోవైపు కూర్చున్న చైతన్య తల్లి పుష్ప చిన్నగా నవ్వుతూ అంది.

‘ఊళ్లెకు బస్సు ఎన్ని సార్లొస్తోంది?’ ప్రయాణం వె­దలు పెట్టినప్పటి నుండి రవీందర్‌ మాట్లాడిన వె­దటిమాటది. అతని గొంతు మావూలుగా లేదు.

‘రెండు సార్లొస్తది. పొద్దున, పొద్దుగూకి’ చెప్పాడు రవీందర్‌ తండ్రి నారాయణరెడ్డి.

వ­ందుసీట్లో కూర్చున్న కొడుకు ఏం మాట్లాడాడో వినబడలేదు సరోజమ్మకి. వ­ందుకి వంగి ‘ఏంటిది?’ అనడిగింది భర్తను.

‘బస్సు రోజుకెన్ని సార్లొస్తదని అడుగుతుండు రవి. పొద్దున, పొద్దుగూకి ఒస్తదని జెప్తున్న’ వివరించాడు నారాయణరెడ్డి.

‘అదీ వానగీనబడి వాగు బారిందంటే మళ్లీ రెండు వూడ్రోజులు రాదు’ చెప్పింది సరోజమ్మ. కొడుక్కు వినబడేలా గట్టిగా చెప్పిందామె. నిజానికి ఈ మధ్య వాగొచ్చి బస్‌ ఆగిపోవడం చాలా అరుదే. కానీ కొడుకుతో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడిరదామె. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎన్‌కౌంటర్లు జరిగినా రెండు వూడు రోజులు బస్‌ ఆగిపోతుంది. ఆ విషయం కొడుకుతో చెప్పాలనిపించలేదామెకు.

ప్రయాణం వె­దలుపెట్టినప్పటి నుంచీ కొడుకుని వెనుకనుంచి చూడసాగింది సరోజమ్మ. వ­ందు సీట్లో చివరని కూర్చొని తల పక్కకు తిప్పి బయటకు చూస్తూ

ఉండిపోయాడతను. కొడుక్కి డ్రం­వర్‌కి మధ్యన కూర్చున్న నారాయణరెడ్డి అప్పుడప్పుడు మాట్లాడిన ఒకటో ఆరా మాటలు రవిని మాటల్లోకి దింపలేకపోయాం­.

‘ఏం ఆలోచన జేస్తుండో’ బాధతో వూలుగుతాంది సరోజమ్మ మనసు. మనవడితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది కానీ కళ్లూ, మనసూ అన్నీ కొడుకుమీదే ఉన్నాయామెకు.

కొడుకును గుండెలకు హత్తుకొని భోరున ఏడ్వాలనుందామెకు. కొడుకు భుజం తడుతూ ‘బాధ పడకయ్యా’ అని చెప్పాలనుంది. కనీసం వెనుకనుండి కొడుకు తల నిమరాలనుంది. కానీ ఏదీ చేయలేదామె.

జీపులోనుంచి పరిసరాలను నిరాసక్తిగా చూడసాగాడు రవీందర్‌. వెన్నెలా, చేన్లూ, చెట్లూ… ఊహు, ఏవీ అతని మనసుకు తాకటం లేదు. పదిహేను సంవత్సరాల తర్వాత అతనా దార్లో ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఆ దారినీ, ఆ పరిసరాలను తన చూపులతో ఆప్యాయంగా తడుమలేక పోతున్నాడు.

ఊరు దగ్గర పడుతున్న జాడ పసిగట్టేసాడతడు. ఊరు! అతనికెంతో ఇష్టమైన ఊరు. ఈ పదిహేనేళ్లలో అతనెక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో వున్నా ఆ వూరి పేరు వింటే గర్వంగా ఉండేదతడికి. ఆ వూరిని తలుచుకుంటే ఉత్తేజంగా ఉండేది. ఎందుకంటే అది అతడు పుట్టిన వూరు. అతను పెరిగిన వూరు. అతన్ని పెనవేసుకున్న వూరు. అతడికి పోరాటాన్ని నేర్పిన వూరు. అతని చేతిలో మరింత పదునెక్కిన వూరు.

జీప్‌ వూరి మధ్యగా వెళ్లసాగింది. గతంలో అతనా దారిగుండా వెళ్తుంటే ఊరు ఊరంతా సగర్వంగా తలెత్తుకొని చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లుండేది. కానీ ఇప్పుడతను తలదించుకుని వెళ్తున్నాడు. నిజానికి తలెత్తుకొని వూర్లోకి అడుగు పెట్టే ధైర్యం చాలకనే పదిగంటల రాత్రి వూరికి వస్తున్నాడు.

పుష్ప పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. మనసులో మెదులుతున్న గత జ్ఞాపకాలను తుడిచేసుకునే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో ఆలోచించసాగింది.

నారాయణరెడ్డి మాత్రం నిశ్చింతగా వున్నాడు.

ఇల్లు రానే వచ్చింది జీప్‌ ఆగింది. అందరూ నెమ్మదిగా జీప్‌ దిగారు. డ్రైవర్‌ దిగి రెండు బ్యాగులు, ఓ సూట్‌కేస్‌ గుమ్మం వ­ందు పెట్టి ‘ఇగ పోతనమ్మ నేను’ అన్నాడు.

‘మంచిది యాదగిరీ, రేపోసారి వచ్చిపో ఇంటికి’ చెప్పింది సరోజమ్మ.

యాదగిరిది ఆ వూరే. జీపూ అతనిదే. జీప్‌ రిపేర్‌కోసం హైద్రాబాద్‌పోం­ రిపేర్‌ చేం­ంచుకొని ఆ కుటుంబాన్ని తీసుకొని వస్తున్నాడు.

జీప్‌ గబ గబా దిగి ఎత్తు అరుగుల పాత ం­ంటివైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఇదేనా నాన్నమ్మా మీ ం­ల్లు’ అన్నాడు చైతన్య.

‘ం­దేరా’ అంది సరోజమ్మ. ‘మీ ం­ల్లు కాదురా మనిల్లు అను’ అని చెప్పాలనుకుందామె. గొంతుకేదో అడ్డం పడినట్టం­ంది.

నారాయణరెడ్డి వ­ందు మెట్లెక్కి తలుపు తట్టబోయేంతలో తలుపు తెరుచుకుంది.

గుమ్మంలో లలిత ‘ఇప్పటిదాకా చూసి ఇప్పుడే తలుపు బెట్టుకున్న’ చెప్పుతూ కొంచెం పక్కకు జరిగిందామె, అందరూ లోపలికి రావడానికి వీలుగా.

వె­దట నారాయణరెడ్డి వెనుక నాయనమ్మ చేం­ బట్టుకొని చైతన్య, ఆ తర్వాత పుష్ప, అందరికంటె వెనగ్గా భారంగా రవీందర్‌ ఇంట్లోకి అడుగుబెట్టారు. లలిత గుమ్మంపక్కనే కదల్లేనట్లు నిలబడిరది. నేల చూపులు చూస్తోంది.

లోపలకొచ్చిన రవీందర్‌ అతని చెల్లెలు లలితకెదురుగా ఆగిపోం­ కొన్ని క్షణాలు ఆమె వ­ఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. అతనివైపు చూడలేదామె. కన్నీళ్లను దాచుకోవడానికి కళ్లు దించుకుందని అర్థమం­ందతనికి. అతనికీ ఆమె రూపం మసకబారింది. చెల్లెలు భుజంమీద చేం­వేస్తూ ‘బాగున్నవార’ జీరబోం­న గొంతుతో అడిగాడు.

ఒకచేం­ని అతని నడుమ్మీదవేసి మరో చేత్తో అతని చేం­ని గట్టిగా పట్టుకొని బాగున్నానన్నట్లుగా తలవూపింది. కన్నీటి ధారలు నిశ్శబ్దంగా చెంపలమీదకు జారాం­. చెల్లెలును సవ­దాం­ంచడానికి రవీందర్‌కు గొంతు సహకరించలేదు.

వాతావరణం మరింత గంభీరంగా తయారైంది. సరోజమ్మకూ కళ్లు చెమ్మగిల్లాం­. బ్యాగులు సర్దే నెపంతో బ్యాగు తీసుకుని లోపలికెళ్లింది. పుష్పకేం చేయాలో తోచక వె­గురానికి ఆనుకొని నిలబడిరది. చైతన్య అందరివైపూ అయోమయంగా చూస్తున్నాడు. నారాయణరెడ్డే తేరుకొని ‘లల్లమ్మా వూకో! ఏందది?’ అన్నాడు.

రవీందర్‌ వూరుకోమన్నట్లుగా చెల్లెలి భుజం తట్టాడు. లలిత తనని తాను కంట్రోల్‌ చేసుకునే ప్రయత్నం చేస్తూ కళ్లు తుడుచుకుంది. రవీందర్‌ కూడా మనసును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ‘పిల్లలేర్రా’ అన్నాడు.

కొంగుతో వ­క్కు తుడుచుకుంటూ ‘నిద్రపోతున్రన్నయ్యా’ అని చెప్పి, అన్నయ్యను వదిలి రెండడుగులు వేసి చైతన్య తలమీద చేం­వేస్తూ దగ్గరకు లాక్కొని వీపుమీద చిన్నగా తట్టింది. వాడు సిగ్గుపడి తల్లి కుచ్చిల్లలో దూరిపోయాడు. నారాయణరెడ్డి వాడ్ని చేం­పట్టి లాగుతూ ‘అరే మీ అత్తమ్మరా, చిన్నత్తమ్మ!’ అని చెప్పాడు. లలిత పుష్పవైపు చూసి చిరునవ్వు నవ్వి ‘బాగున్రా’ అంది.

పుష్ప బదులుగా నవ్వుతూ ‘మీరు బాగున్రా. పిల్లలు బాగున్రా’ అంది.

‘అందరూ కాళ్లు గడుక్కుందాం పాండ్రి. లల్లమ్మా వొదినెను తీస్కపార ఇంటెనుకకు’ అన్నాడు నారాయణరెడ్డి.

‘రాండ్రి’ అంటూ ఇంటివెనుకనున్న చేద బావివైపు దారితీసింది లలిత.

చిన్ననాటి జ్ఞాపకాలు ఎగిసిపడుతుంటే ఇంటి అణువణువునూ తడువ­తూ నెమ్మదిగా కదిలాడు రవీందర్‌.

అందరూ కాళ్లూ, చేతులూ, వె­హాలు కడుక్కున్నాక ‘రాండ్రి అన్నం తిందురు, ఎప్పుడు తిన్నరో ఏమో’ అంది పళ్లాలు కడుగుతూ లలిత.

‘వంట చేసినవారా’ అడిగింది సరోజమ్మ. ఇంట్లోకొచ్చాక అది ఆమె వె­దటి మాట.

‘ఆ చేసిన. మీరొస్తరని తెల్సుగద’ వంటింట్లోకి వెళ్తూ చెప్పింది.

వంటింట్లో అందరూ వరసగా వేసిన పీటల మీద కూర్చున్నారు. తల్లి వడ్డించబోతుంటే ‘అమ్మా! నువ్వు గూడ కూసో నేను పెడుతగనీ’ అని వారించి అందరికీ వడ్డించసాగింది.

కంచంలో కూరవేస్తున్న కూతురితో ‘ఏం కూరొండినవుర’ అడిగింది సరోజమ్మ.

‘టమాట కోడిగుడ్లు’

‘అన్నయ్యకిష్టమని వండినవా’

కొంచెం సిగ్గుపడుతూ లలిత ‘అవునమ్మా. కానీ నా వంట అన్నయ్యకు నచ్చుతదో లేదో’ అంది.

‘నీ వంటకేందిర బ్రహ్మాండంగా జేస్తవ్‌’ కూతురికి తండ్రి ప్రశంస.

రవీందర్‌కు వాళ్ల మాటలు, అదే వంటింట్లో తమ చిన్నప్పటి భోజన సన్నివేశాలను గుర్తుకు తెచ్చాం­. నిజమే! టమాట కోడిగుడ్డు కూరంటే తనకిష్టం. చెల్లెలు గుర్తుపెట్టుకొని చేయడం సంతోషాన్నిచ్చింది. చెల్లెలుకు వంటరాని వయసులోనే ఇంటినుండి వెళ్లిపోయాడు. పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ ం­ంట్లో తింటున్న విషయం ఉక్కిరిబిక్కిరి చేస్తోందతన్ని. చిన్నప్పటి రోజులు ఎంతో బాగుండేవి. అమ్మా, బాపూ, అక్కా, చెల్లీ అందరితో కల్సి తినడం ` అదొద్దనీ, ఇది కావాలనీ బెట్టు చేయడం ` అమ్మ బతిమాలి తినిపించడం, అప్పుడప్పుడూ చిన్న చిన్న కొట్లాటలూ, నవ్వులూ అన్నీ గుర్తొచ్చినాయతనికి. ఏమం­పోం­నయ్‌ ఆ రోజులు? ఏమం­నయ్‌? తనే చిందరవందర జేసిండా రోజుల్ని! పదిహేనేండ్లు ఎక్కడ తిన్నడో… ఏం తిన్నడో… ఎట్ల తిన్నడో… ఇప్పటికైనా మళ్లీ ‘ఆ రోజుల్లోకి’ వచ్చేసిండు. ఇప్పుడదే వంటిల్లూ, అమ్మా, బాపూ, చెల్లీ, అక్కా, ఇంకా ఇప్పుడందరికీ అదనంగా పిల్లలు కూడా. ఆ రోజుల్ని చిందరవందర చేసిన తనే మళ్లీ ఆ రోజులను తిరిగి తీసుకురావాలి. ఆలోచిస్తూ భోజనం చేయసాగాడు.

‘కూరెట్లుందన్నయ్యా?’ అనే చెల్లెలి ప్రశ్నతో ఆలోచనల నుండి బయటపడి ‘బాగుందిరా’ అన్నాడు మనస్ఫూర్తిగా.

అందరూ అన్నాలు తిని పడుకున్నారు. రవీందర్‌ మాత్రం లలిత పిల్లలు పడుకున్న మంచంమీద కూర్చొని నిద్రపోతున్న వె­హాలు పరీక్షగా చూడసాగాడు. లలిత వంటిల్లు సర్ది వచ్చి ‘నిద్రొస్తలేదాన్నయ్యా, పండుకోరాదూ’ అంది పక్కనే కూర్చుంటూ.

‘పండుకుంటాలేరా. పిల్లల ఆర్యోగం బాగలేదని అమ్మ చెప్పింది. ఇప్పుడెట్లుందిరా’ అడిగాడు.

‘బాగుందన్నయ్యా. వర్సగ జెరాలు. వె­న్ననే తగ్గినయ్‌.’

‘ఏం చదువుతున్నర్రా?’ చిన్నపిల్లాడి తల నివ­రుతూ అడిగాడు.

‘వీడు రెండు, వాడు నాలుగు’ చూపిస్తూ చెప్పింది.

‘వీడి చిన్నప్పుడు కదూ మనం కల్సింది.’

‘ఆఁ! అవును వాడప్పుడు సంవత్సరవ­న్నడు.’

‘ఎట్లున్నవుర నువ్వు’ చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు.

‘నాకేమం­ందన్నయ్యా బాగున్నా’ నవ్వుతూ లలిత.

ఆమె వె­హంలోకి పరిశీలనగా చూసాడు. ఆరు సంవత్సరాల క్రితం చూసినపుడు కుప్ప పోసిన విషాదంలా ఉండిరది. కానీ ఇప్పుడలా లేదు. కళ్లలో వెలుగుంది.

‘ఫర్లేదు. ధైర్యం తెచ్చుకున్నట్లుంది’ అనుకున్నాడు.

‘టైలరింగ్‌ చేస్తున్నవట గదరా. బాగ నడుస్తుందా?’

‘ఆఁ పర్వాలేదన్నయ్యా నడుస్తుంది!’

చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండిపోయారిద్దరూ. రవీందర్‌ అడుగుతున్న వాటికి బదులిస్తూపోం­ంది లలిత. ఆమె మాత్రం ఏమి అడుగలేదతన్ని, తనేం అడిగినా అతని గాయాన్ని తడిమినట్లవుతుందేమోనని భయపడిరదామె.

చాలాసేపటి తర్వాత పడుకున్నారిద్దరూ. రవీందర్‌కు నిద్ర రాలేదు. లలిత గురించే ఆలోచించసాగాడు. చెల్లెలితో తనివితీరా మాట్లాడాలని వుందతనికి. అతను భార్యా కొడుకుతో సహా సరెండర్‌ కోసం రెండు నెలల క్రితమే బయటకు వచ్చి హైద్రాబాద్‌లో బంధువుల ఇంట్లో ఉన్నాడు. సరెండర్‌ అయ్యాక కూడా ఓ నెలపాటు హైద్రాబాద్‌లోనే

ఉన్నాడు. తల్లిదండ్రులు, అక్కా బావ, ఇంకా దగ్గరి బంధువులు, స్నేహితులు అందరూ కల్సారతన్ని. కానీ, చెల్లెలు మాత్రం కలువలేదు. పిల్లలకు వర్సగా ఏదో ఒక అనారోగ్యమని అందుకే రాలేదని తల్లి చెప్పిందతనికి. చెల్లెలి మంచీ చెడ్డా తల్లిదండ్రుల దగ్గర తెల్సుకున్నప్పటికీ స్వయంగా చెల్లెలుతో మాట్లాడాలని ఆత్రంగా ఉందతనికి.

లలితకు పదిహేను సంవత్సరాల వయసులో అతను రహస్య జీవితానికి వెళ్లాడు. తర్వాతెప్పుడో ఆమెకు పెళ్లం­ందని తెల్సి సంతోషపడ్డాడు. ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. లలిత భర్త వట్టి అనుమానపు మనిషని ఆమెను వేధిస్తున్నాడని తెల్సి, చాలా బాధపడ్డాడు. చెల్లికి ధైర్యం చెప్తూ ఎన్నో ఉత్తరాలు రాసాడు. చిన్నప్పటినుంచి వాళ్లక్కతో కంటే రవీందర్‌ లలితల మధ్య చాలా సాన్నిహిత్యం వుండేది. వె­దట్నుంచీ కూడా తరచూ ఉత్తరాలు రాసుకునేవారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో పాటు చెల్లెల్ని స్వయంగా కల్సాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దర్నీ తీసుకునే వచ్చిందామె. ఇప్పటికీ ఆనాటి దృశ్యం అతనికి కళ్లకు కట్టినట్టే వుంది.

లి లి లి

‘జీవితం సర్వనాశనం అం­ందన్నయ్యా! చచ్చిపోదామంటే పిల్లలు దిక్కులేని వాళ్లం­తరనిపిస్తుంది’ అంటూ బేలగా ఏడ్చింది అన్నను పట్టుకొని లలిత.

‘ఛ! ఏం మాటలుర లల్లీ, ఇంత అధైర్యపడితే ఎట్ల, బాధలొచ్చినప్పుడే గద ధైైర్యం తెచ్చుకోవాల్సింది’

‘ఏం ధైర్యం తెచ్చుకుంటదిరా! సిన్నప్పట్నుంచి ఏ కష్టం దెల్వకుండా పెరిగింది. ఎట్ల తట్టుకుంటదిరా. మాకే ఏంజెయ్యాల్నో అర్థమం­తలేదు’ అంది సరోజమ్మ దుఃఖాన్ని అదిమిపడుతూ.

‘అన్నయ్యా, నువ్వింట్లనే వుంటే నా బతుకిట్ల అయ్యేది కాదు. నువ్వు దగ్గరుంటే నాకు ధైర్యం గుండేది. వాళ్లగ్గూడ భయవ­ండేది’

‘అదెట్లరా, అన్నలు ఇంటిదగ్గర్నే ఉన్నోళ్ల చెల్లెలందరి బతుకులు బాగున్నయా?’

‘ఎట్లం­న కొంచెం తేడా వుంటది గదన్నయ్యా, ఇప్పుడు నన్ను కొట్టినా సంపినా పట్టిచ్చుకునేదెవరు? అమ్మ బాపున్నరంటే, వీళ్లెన్నడూ గొడవలు పడ్డోళ్లు కాదాయె. ఆ మనుషులతోటి వీళ్లేం గెలుస్తరు? ఒకసారి నేను ‘నాకెవ్వరు లేరని మీరిట్ల జేస్తున్నరా నాకు మా అన్నj­్యన్నడు’ అని అన్న. ‘ఎక్కడున్నడే నీ అన్న ఎన్నడో పోలీసులు సంపుంటరు అని మాట్లాడిరడ్రన్నయ్యా’ దుఃఖం అడ్డుపడి మాటలాపేసింది లలిత.

‘అరె వాళ్లన్న మాటలకే అంత ఫీలం­తే ఎట్లరా’ భుజం తట్టాడు రవీందర్‌.

‘నేనెప్పుడు మన మధ్యుత్తరాలు నడుస్తయని సెప్పలేదు ఆళ్లకు ` ఎందుకులే ఆల్లకు తెల్వనిచ్చేదని. అందుకని అసలు నువ్వున్నవనే వాళ్లు నమ్మరు. అందుకే వాళ్లకంత ధైర్యం’ మళ్లీ ఏడ్చింది లలిత.

‘నేనుంటే కొంచెం తేడా వుంటే వుండొచ్చుగాని భయంతోటో భక్తితోటో ఎన్ని రోజులు కాపురాలు నడుస్తం­రా. లల్లీ, నువ్వట్ల ఆలోచించొద్దు. నిజానికి నువ్వు పడుతున్నటువంటి బాధలు ఈ ప్రపంచంలోంచి తుడిచేయడానికే ఈ రోజు మన పోరాటం నడుస్తున్నది. అం­నా నువ్వు ధైర్యంగుండాలి. ధైర్యంగా కొట్లాడాలె వాళ్లతోటి. అవసరమైతే విడిపోjైునా ధైర్యంగా బత్కాలె.’

‘అయ్యో! ఇంకా సంసారం వొద్దని విడిపోతనని సెప్పిందిరా లల్లమ్మ. మేంగూడ సరేననుకున్నం. బాదలు పడేకంటే మనకండ్ల వ­ందు బిడ్డ వుంటే అదే సాలనుకున్నం. కానీ వాళ్లొప్పుకుంటలేర్ర. ఈ పీడ జీవితాంతం వొదిలేటట్టు లేదు’ అన్నాడు నారాయణరెడ్డి.

‘అవునార లల్లీ! అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నవా? ఇప్పుడు గూడా విడిపోయేటందుకు సిద్దంగున్నవా?’ ఆశ్చర్యంగా అడిగాడు రవీందర్‌.

‘అన్నీ ఆలోచించే నిర్ణం­ంచుకున్ననన్నయ్యా, నాకెంత మాత్రం ఆ సంసారం ఇష్టం లేదు. కానీ ఈ పీడ వొదిలేటట్టులేదే’ క్షణం ఆలస్యం చేయకుండా కచ్చితంగా చెప్పింది లలిత.

ఒక నిమిషం మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోం­ తర్వాత వ­గ్గురినుద్దేశిస్తూ అన్నాడు ` ‘నేను మీకు దగ్గర్ల లేకపోం­నగానీ, అక్కడ మన దగ్గర మన పార్టీ వుంది. అక్కడ పార్టీకి నేనుత్తరం రాస్త. పార్టీ ఈ సమస్యను పరిష్కారం జేస్తది. అతనితో వాళ్ల తల్లిదండ్రులతో గట్టిగ మాట్లాడ్తది. ఇకనుంచి మర్యాదగుండమని బుద్ధి జెప్తది…’ మీ అభిప్రాయమేంటీ? అన్నట్లుగా ఆపాడతను.

‘లేదన్నయ్యా, ఎవరు మాట్లాడిన, ఏం జేసిన విరిగిన మనస్సు అతుక్కోదు. పార్టీ మాట్లాడితే ఇకమీదట మంచిగుంటరేమో. కానీ నువ్వన్నట్టు బయంతోని బక్తితోటి కాపురాలెన్ని రోజులు నడుస్తయ్‌. నాకిష్టం లేదన్నయ్య కల్సుండుడు’ అంది లలిత.

‘బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోరా’ రవీందర్‌.

‘బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్న. ఇప్పటికిప్పుడు తొందరపడి నిర్ణయం తీస్కుంటలేను.’

‘వాళ్ల గురించి నీకు తెల్వదుర వాళ్లసలు మనుషులు కాదు. వాళ్లతోటి పడుడు మావల్ల గాదింక’ సరోజమ్మ కూడా స్థిరంగా చెప్పింది.

‘సరే మీరు బాగా ఆలోచించండ్రి. లల్లీ వ­ఖ్యంగా నువ్వు బాగా ఆలోచించు. నేను అక్కడి పార్టీకి ఉత్తరం రాస్త. పార్టీ మివ­్మల కల్సి మాట్లాడ్తది. అప్పటికి మీ నిర్ణయం ఎట్లుంటే అట్ల సెటిల్‌ జేస్తది. అంటే కల్సుండాలన్నా విడిపోవాలన్నా సెటిల్‌ జేస్తది.’

‘పార్టీ విడాకులియ్యమంటే ం­స్తడా అన్నయ్యా’ అనుమానంగా అడిగింది లలిత.

‘సూద్దం. వినకపోతే ఏం జేద్దమనేది తర్వాత ఆలోచిద్దం. నువ్వు మాత్రం ధైర్యంగుండాలె’ అంటూ చెల్లెలితో వివరంగా మాట్లాడాడు. భర్తతో కల్సుండాలనుకుంటే ఎలా ఉండాలి? విడిపోతే ఎట్లుండాలి? సమాజం ఎట్లుంది? ఆడవాళ్ళ బాధలెట్లున్నయ్‌. పార్టీ ఎందుకు? పోరాటాలెందుకు? అని వివరంగా మాట్లాడాడు. ఆ రోజు అతని మాటలు లలితను బాగా ప్రభావితం చేసాయని ఆ తర్వాత లలిత రాసిన ఉత్తరాల ద్వారా అర్థమం­ంది రవీందర్‌కు.

ఆ తర్వాత లలిత రవీందర్‌కు సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. పార్టీ కలిసి మాట్లాడిరదని తన నిర్ణయం మేరకు విడాకులిప్పించిందని, పిల్లలిద్దర్నీ తన దగ్గరే

ఉంచుకున్నానని, అతని ఆస్తిలో భాగం ఇప్పించారనీ, తల్లిదండ్రులతో కల్సుంటానని తన భాగంకు వచ్చిన ఆస్తులను అమ్మివేసి తమ ఊర్లో భూమి కొన్నారని, తను మిషన్‌ కుట్టడం నేర్చుకుంటున్నాననీ వివరంగా రాసింది. అంతేకాదు ఆ ఉత్తరంలో ఆమెకు పార్టీపట్ల కల్గిన నమ్మకవూ, ఏర్పడ్డ అభిమానవూ కనబడ్డాయతనికి. తర్వాత చెల్లెలికి మరింత వివరంగా లోతుగా ఉత్తరాలు రాసేవాడతను. లలిత కూడా తరుచుగా ఉత్తరాలు రాసేది.

ఆలోచిస్తున్నకొద్దీ చెల్లెలిపట్ల ఆర్తితో నిండిరది మనసు. ‘నిండ వ­ప్పయ్యేళ్లు లేవు. ఎన్ని కష్టాలు పడ్డది’ అనుకున్నాడు. తనొచ్చిండు ఇక చెల్లెలుకేం బాధుండదు. తన కష్టసుఖాలు నాతో పంచుకుంటది. నేనుంటే తనకు ధైర్యంగుంటది. పిల్లల్ని నేను బాగా పట్టించుకోవాలె. అమ్మా బాపు మాత్రం ఇన్నాళ్లు నేను దూరమం­ ఎన్ని కష్టాలు పడ్డరో. నేను లేకపోవడం, పోలీసుల వేధింపులు, చెల్లెలి కష్టాలు వీటన్నింటితో మానసికంగా ఎంత హింసపడ్డరో. ఇక వాళ్లకే కష్టవూ ఉండగూడదు. తను శ్రద్ధగా చూసుకోవాలె. తమ భూమి, చెల్లెలు భూమి అంతా తను కష్టపడి వ్యవసాయం చేయాలె. దృఢంగా అనుకున్నాడతను.

ఆలోచనల నుండి ఎప్పటికో నిద్రలోకి జారాడతను.

లి లి లి

‘మీరేదన్న ఉద్యోగం జూసుకోవచ్చుగ’ భర్త పడుకున్న మంచంలో కూర్చుంటూ అంది పుష్ప.

‘నాకెవరిస్తరు వుద్యోగం.’

‘ఎందుకియ్యరు? మీరు బాగ చదువుకున్నరు గదా.’

‘చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలొస్తున్నయా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెల్సి ఎవరిస్తారు?’

‘వుద్యోగమేదన్న చూసుకోకుండా ఎన్ని రోజులిట్ల వ్యవసాయం జేస్తరు’

‘ఎన్ని రోజులేంది? ఓపికున్నన్ని రోజులు జేస్త. ఉద్యోగం చూసుకుందమంటే ఏదో చిన్నా చితకా ఉద్యోగం వస్తే మన కడుపులు నిండయ్‌ గద’

‘పోనీ సర్కారిచ్చే డబ్బులు తీసుకోవచ్చు గదా.’

‘పుష్పా! ఎన్నిసార్లు జెప్పాలె నీకు. నేను తీస్కోను. నేను సేతగాక, సెయ్యలేక పార్టీనుంచొచ్చిన గాని, ప్రజలకు పార్టీకి వ్యతిరేకమైన పనులు నేను సెయ్యను. ఇంకోసారి నా దగ్గర ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు’ కోపంగా అన్నాడతను.

‘మరెట్ల? ఈ పల్లెటూరులో ఈ వ్యవసాయం జేస్తూ ఎన్ని రోజులుంటం. చైతన్య చదువు గురించం­నా ఆలోచించర. ఇక్కడ వాడికేం సదువొస్తది’

‘పట్నంల సదివినా ఉద్ధరించేదేం లేదులే! వాడు పెద్దగయ్యేటప్పటికి, ఉద్యోగాలిచ్చే అవకాశాలే వుండయ్‌.’

‘ఈ పల్లెటూర్ల ఎన్ని రోజులుంటమేందీ?’

‘సచ్చేదాక వుంటం ఇక్కడ్నే. అమ్మ బాపును ఇడిసిపెట్టి ఎక్కడికి పోతం.’

‘ఇడ్సిపెట్టి పోవుడు ఇష్టం లేకుంటే అందరం కట్టగట్టుకునే పోదం’ నిష్ఠూరంగా అంది.

‘పోయేంజేస్తం అడుక్కొని తింటమా?’

‘మీకంత కాం­సుగుంటే అదే జేద్దం.’

‘లేకపోతే ఏంది పుష్పా నువ్వు మాట్లాడేది? ఈ వూర్ల వుండుడు ఇష్టమైనా కాకున్నా ఇంకెక్కడా మనం బత్కలేం. ఆ విషయం నువ్వర్థం జేస్కోవాలె’ కోపాన్నదుపులో పెట్టుకుంటూ చెప్పాడు.

‘ఎందుకు బత్కలేం? గవర్నమెంటు దగ్గర పైసలు తీస్కునుడు ఇష్టం లేకుంటే ఇక్కడి భూవ­లమ్మి ఏదన్న బిజినెస్‌ చేస్కుందం.’

‘బిజినెస్‌ అంటే మాటలనుకుంటున్నవా? ఉన్న భూమమ్మి బిజినెస్‌ల బెడితే నష్టవె­స్తే ఏమనుకుంటున్నావ్‌.’

‘అన్నింటికి అన్ని అన్కుంటే యెట్ల? దైర్యం జేయాలె గద. లేకుంటే ఈ పల్లెటూళ్లనే మట్టిగొట్టుకోవాలె.’

‘చూడు పుష్పా, నాకనవసరంగ కోపం దెప్పియ్యకు. మనిద్దరం పల్లెటూరు మట్టిల్నే పుట్టి పెరిగినోళ్లం. ఓ పదేళ్లు పట్నం సుఖాలకు అల్వాటు పడి ఇది పల్లెటూరని చీదరించుకోకు. ఇగపోతే నాకు బిజినెస్‌ జేసుడు ఇష్టం లేదు. నాకు రాదు గూడ. నేను రైతు బిడ్డను. వ్యవసాయం జేసుడొస్తది. చేసుకునేటంత భూమ్మనకుంది. నాకు పెద్ద పెద్ద ఆశలు లేవు. ఉన్నంతలో తృప్తి పడుదాం.’

‘అంటే మీ పంతమే గానీ నా మాట ఎడంసెవుల గూడ బెట్టరా.’

‘నీ మాట నేనేం విన్లేదంటవ. ఏడేండ్ల నుంచి పార్టీలనుంచి బయటకు బోదమని పోరు బెట్టినవ్‌. ఇన్న గద. ఇగ జాలదా.’

‘అంటే నేను పోరుబెట్టినందుకే వొచ్చిన్రా. మీకొచ్చుడు ఇష్టం లేకున్న వొచ్చిన్రా.’

‘అన్నీ గల్సినయ్‌. నీ నోరుదిగూడ తక్కువ పాత్రేం కాదులే.’

‘నామాట వినేటోళ్లం­తే ఇప్పుడు గూడ విందురు గదా.’

‘పుష్పా నన్ను నిమ్మలంగుండనియ్యవా’ విసురుగా మంచంలోంచి లేచి వెళ్లిపోయాడతను.

లి లి లి

‘నువ్వెందుకొచ్చినవమ్మా. నేనొచ్చి తిని బాపుకు తెచ్చేటోన్ని గదా’ రవీందర్‌.

‘నాకలవాటం­ందిరా. ఇంట్లుండబుద్ధి కాదు. కూలోళ్లు కడుక్కుంటున్రుగా. మీరు గూడ కడుక్కోండ్రి తిందురు. ఏడీ మీ బాపు’ చుట్టూ చూస్తూ సరోజమ్మ.

‘మర్రి సెట్టుకాడ కూసున్నట్టున్నడు’ అంటూ చల్లటి నీళ్లతో చెమటపట్టిన శరీరాన్ని కడుక్కోసాగాడు.

సరోజమ్మ చేతిలోని వైరుబుట్టను కిందబెట్టి కూలీలవైపు అడుగులేసి వాళ్లను పలకరించసాగింది.

రవీందర్‌ ఊరికొచ్చి రెండు నెలలు దాటుతోంది. వచ్చినప్పటి నుండి తనను తాను వ్యవసాయపు పనిలో నిమగ్నం చేసుకోసాగాడు. ప్రతిదానికి తల్లిదండ్రులతో సంప్రదిస్తూ పనులు నడిపిస్తున్నాడు. అంతకు పూర్వం తల్లికి వ్యవసాయంతో ఏ సంబంధవూ ఉండేదికాదు. గడప దాటడం ఎరుగనట్టుండేది. కానీ ఇప్పుడు వ్యవసాయంలో తల్లిది కూడా ప్రవ­ఖ పాత్ర ఉండడం గమనించాడు రవీందర్‌. సంతోషించాడు గూడ. ప్రతిరోజు ఆమె కూడా ఏదో ఓ సమయంలో పొలానికి వస్తుంది. భర్త, కొడుకులతో వ్యవసాయం గురించి మాట్లాడుతుంది. రెండు వూడు రోజులనుండి ఆమెకు వంట్లో బాగుండడం లేదు. అందుకే రవీందర్‌ పొలానికి రావొద్దని మరీ మరీ చెప్పి వచ్చాడు. అం­నా ఆమె వచ్చింది.

అందరూ భోజనాలు చేసి ఓ అరగంట రెస్ట్‌ తీసుకొని మళ్లీ పనిలోకి దిగారు. ఆడవాళ్లు కోతలు కోస్తుంటే, రవీందర్‌తో కల్సి మరికొందరు మగవాళ్లు మోపులు మోయసాగారు. సరోజమ్మ ఎండదెబ్బకు నెత్తిన కొంగువేసుకొని వొరాలమీద అటూ ఇటూ నడుస్తూ చూడసాగింది. నారాయణరెడ్డి మర్రి చెట్టుకింద మంచంలో నిద్రబోతున్నాడు. కాసేపు చేస్తున్న పని ఆపి తల్లి దగ్గరికి వచ్చి ‘అమ్మా! ఇగింటికి పోరాదు. పోం­ కాసేపు పండుకోరాదూ’ అన్నాడు రవీందర్‌.

‘పోతాన్లేరా. రవీ! యాదమ్మను గుర్తుపట్టినవా?’ కొడుకుతో ఈ మాట చెప్పడానికి చాలాసేపు నుంచి సతమతమం­పోతోందామె.

‘యాదమ్మా! యాదమ్మెవరూ?’

‘అగో గా కడకుంది సూడు. పచ్చసీరె కట్టుకున్నామె’ దూరంగా కోతకోస్తున్న ఒకామెను చూపిస్తూ అంది.

‘నేను సరిగ్గ సూల్లేదమ్మా. ఎవరామె?’ రవీందర్‌ గొంతులో కుతూహలం.

‘మన అం­లయ్య తల్లిరా.’

‘ఏ అం­లయ్య?’ అప్రయత్నంగా అతని నోట్లోంచి ఆ మాట వెలువడిరది. కానీ తల్లి చెప్పిన మరుక్షణమే అం­లయ్యెవరో అర్థమం­ందతనికి. గుండెలయ తప్పింది. ‘అవునా!’ గొంతు పెగలడం కష్టమం­ంది.

‘అవునురా. యాదమ్మను జూస్తే కడుపుల దేవినట్లం­తది. దిక్కులేన్దం­ంది. రెక్కాడితే గానీ డొక్కాడదు’ ఇంకా ఆమె జెప్తుండగా నిద్రలేచిన నారాయణరెడ్డి పిలిచాడామెను. భర్త దగ్గరకు వెళ్ళిపోం­ందామె.

అలాగే నిలబడిపోయాడు రవీందర్‌. అనేక జ్ఞాపకాలు వొక్కసారే చెలరేగాయతనిలో.

నారాయణరెడ్డి కేకేసి ‘రవీ! మీ అమ్మతో బాటు నేను గూడ ఇంటికి పోతున్న. కూలోల్లు పోయే యాల్లకొస్తా’ అని చెప్పాడు. ఆ మాటలు రవి బుర్రకెక్కలేదు.

అలాగే వొరం మీద కూలబడిపోయాడు. గతం కండ్లవ­ందు కదలాడ సాగింది.

అం­లయ్య! ఎప్పటి అం­లయ్య? పదిహేను సంవత్సరాల క్రితం తన చేం­ని దృఢంగా నొక్కి చివరి వీడ్కోలు చెప్పిన అం­లయ్య ఎక్కడున్నాడు? తన చేతిలో ఎదిగిన వె­క్క. ఎక్కడ వృక్షమయ్యాడు? ఎన్ని విత్తనాల్ని వెదజల్లాడు? పదిహేనేళ్ల క్రితం చూసినప్పటికీ అతని రూపం మాసిపోలేదు రవీందర్‌కు. నిన్న వె­న్న చూసినట్లుగనే వుందతనికి. నల్లగా, పొట్టిగా వుండే అం­లయ్య. వె­హంలో ఎప్పుడూ తెల్లటి నవ్వును వెలిగించే అం­లయ్య. కళ్లవ­ందు ప్రత్యక్షమయ్యాడు. జ్ఞాపకవె­కటి పరుచుకుంది రవీందర్‌ వ­ందు.

లి లి లి

‘ఏందం­లయ్యా! అట్లున్నవ్‌’ రవీందర్‌ అరుగుమీద తన పక్కనే కూర్చున్న అం­లయ్య వె­హంలోకి చూస్తూ అడిగాడు.

‘ఏం లేదులేన్నా.’

‘అరె ఏం లేదంటవేందీ, వె­కమంతా సిన్నబోం­ంది. నాకు జెప్పగూడందం­తే చెప్పొద్దులే.’

‘నీకు జెప్పగూడందేవ­ంటదే. మా అవ్వ నన్నిరగ గొట్టింది’ గట్టిగా నవ్వుతూ అన్నాడు.

‘కొట్టిందా! ఎందుకూ?’

‘ఇంకెందుగ్గొడ్తది? పార్టీల తిరుగొద్దట. నిన్ను గూడ తిట్టిందిలే. నువ్వామె కడుపుల సిచ్చుబెడ్తున్నవట.’

‘అవునా? తప్పదులే ఎందరి తల్లుల దీవెనలు పొందాల్నో!’ నవ్వాడు రవీందర్‌.

ఇంతలో యాదమ్మ అక్కడికి రానే వచ్చింది. వస్తూనే

‘ఓరి తలమాసినోడా, మళ్లీడ కూసోని సచ్చినవేందిరా! నిన్ను బాం­కాడికి పొం­్య తల్గబడమని సెప్తిని గదరా. వె­దలారినోడా, మంచి మంచోళ్లకు సావొస్తది నీకు రాదేందిరా’

‘యాదమ్మా! ఏందది గట్ల తిట్టుడు మంచి పద్దతేనా’ ప్రవాహానికి అడ్డుకట్ట వేయబోయాడు రవీందర్‌.

‘అయ్యా! మరేం జెయ్యాలయ్యా. కష్టం జేస్కుంటే తప్ప పూటగడవనోళ్లం. ఏదో వొకరి పొలం తీసుకొని జేస్కుంటున్నం. కష్టం జెయ్యకుంటే ఊకనె అది పండుతదా? వాళ్లjె­్యక్కడే ఎంతకని జేస్తడు.’

‘అరె అం­లయ్య ఏం పని జేస్తలేనట్టు మాట్లాడుతవె.’

‘ఏం జేస్తుండయ్యా, వె­న్నేదో మీటింగన్నడు. నిన్నేదో వూరికి బోవాలన్నడు. అం­నా మీ అసంటి వున్న మారాజులకు నడుస్తయ్‌ గానీ మా అసువంటోళ్లకు ఎందుకయ్యా పాల్టీలు గీల్టీలు’

‘అరె మన పార్టీ, ఉన్న మారాజులకు కాదు యాదమ్మా కూటికి లేనోళ్ల కోసమే’ చెప్తోన్న రవీందర్‌ను మధ్యలోనే ఆపి`

‘వొద్దయ్యా మాకీ పాల్టీలొద్దు నీ కాల్మొక్త. నీ బాంచెనైత. నా కొడుకును నీయెంట తిప్పుకోకయ్యా. నాకు ఆడొక్కడే, అడీడ పోలీసోల్లు పట్టకపోతున్రట. కొడుతుండ్రట సంపుతున్రట. ఆడికేవన్నం­తే నేను బత్క’ ఏడుస్తూ దాదాపు రవీందర్‌ కాల్లు పట్టుకున్నంత పనిచేసింది.

యాదమ్మను వారిస్తూ ‘అరె నీకొడుకొక్కడే జేస్తుండా? మేమందరం లేమా? మా అందర్నిడిసి పెట్టి నీ కొడుకునొక్కడ్నే పట్టుకుంటరా? మవ­్మల్నందర్ని ఏం జేయంది నీ కొడుకునే జేస్తరా? భయపడకు యాదమ్మా. నీ కొడుక్కేంగాదు. నీ కొడుకు పాణానికి నా పాణం అడ్డం’ అంటూ భరోసా ఇచ్చి నచ్చజెప్పి పంపించాడు రవీందర్‌.

లి లి లి

‘నీ కొడుకు పాణానికి నా పాణం అడ్డం’ ఆ రోజు తన మాటల్ని మననం చేసుకున్నాడు రవీందర్‌.

మరి అడ్డం పడ్డడా తను?

తల్లి ఎంత ఏడ్చినా వె­త్తుకున్నా అం­లయ్య ఆమె మాట వినలేదు. రవీందర్‌ చేతిలో పదునుదేరాడు. పార్టీ పిలుపు మేరకు వేరే ప్రాంతానికి వెళ్లాడు. యాదమ్మ కొడుకు ఆచూకీ రవీందర్‌ను అడగాలనుకున్నా అప్పటికే రవీందర్‌ రహస్య జీవితంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రవీందర్‌ కూడా దూర ప్రాంతం తరలివెళ్లాడు. అడపా దడపా ఇద్దరు

ఉత్తరాలు రాసుకునేవారు. అం­లయ్య బాగా ఎదుగుతున్నాడని తెల్సి రవీందర్‌ సంతోషపడేటోడు. ఏడు సంవత్సరాల క్రితం అం­లయ్య ఇక లేడనే వార్త తెలిసి విలవిల్లాడిపోయాడు రవీందర్‌. కంట తడిపెట్టాడు. పోలీసులు చుట్టువ­డితే వీరోచితంగా పోరాడుతూ ఇద్దరు పోలీసులను చంపి సహచరుడ్ని అపాయంనుండి తప్పించి తాను నేలకొరిగాడని తెల్సి గర్వపడ్డాడు.

‘ఏందయ్యా గట్ల గూకున్నవ్‌. కూకున్నోనివి నీడల్నన్న గూకోరాదు’ జీతగాడు ఆశాలు పలకరింపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు.

కానీ అక్కడ్నుంచి కదల్లేదు. తల తిప్పి యాదమ్మవైపు చూసాడు. దూరంగా

ఉండడం వూలాన స్పష్టంగా కన్పించడం లేదు. దగ్గరికి పోం­ చూస్తే… అనుకున్నాడు. గుండె దడ దడలాడిరది. దగ్గరికి వెళ్లగలడా? ఆమెను చూడగలడా? అతని కళ్లకు ఆమె రూపం మసకబారింది. కళ్లు భుజానికి తుడుచుకుంటూ, వెళ్లి పలుకరిస్తే అనుకున్నాడు. పలకరించగలడా? అంత అర్హత తనకుందా?

‘నా కొడుకెక్కడని’ అడుగుతే…

‘నా కొడుకు పాణానికి నీ పాణం అడ్డం అన్నవు గదా’ని నిలేస్తే!

ఎట్లా నిలబడాలే ` ఆమెవ­ందు. ఎట్ల జూడాలే ` ఆమె వె­హంలకు.

పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చాలాసేపు అట్లే కూర్చుండిపోయాడు. నెమ్మదిగా లేచి అన్యమనస్కంగా కాళ్లూ చేతులూ కడుక్కొని ‘ఆశాలూ! పొద్దు దగ్గర బడుతుందిగా, అందర్నీ ఇంటికి పొమ్మని చెప్పు. నేనాడ మర్రిసెట్టు కాడ కూసోనుంట. యాదమ్మను మాత్రం ఆడికి రమ్మని జెప్పు’ అంటూ మర్రిచెట్టు వైపు అడుగులేసాడు.

ఆశాలుకు విషయం కొంచెం అర్థమం­నట్లు ‘సరేనయ్యా’ అన్నాడు.

మర్రిచెట్టు కింద కూలబడ్డ రవీందర్‌ మనసు చిత్తడి చిత్తడిగా వుంది. నిజానికి ఊరి కొచ్చినప్పటి నుండి అం­లయ్య తల్లిదండ్రులెట్లున్నరో తెల్సుకోవాలనుకున్నడు తను. అమ్మనడగాలని చాలాసార్లు అనుకున్న మాట గొంతులోనే కొట్టుకులాడిరది. అం­తే అం­లయ్య తండ్రి సచ్చిపోం­ండన్నమాట. ఒంటరి బతుకైపోం­ందా యాదమ్మది? ఆమెతో ఏం మాట్లాడాలె? ఎట్ల మాట్లాడాలె? అర్థం కావట్లేదు. కానీ మాట్లాడాలె. ఏదో ఒకటి మాట్లాడాలె. ఆమె తిట్టినా కొట్టినా సరే మాట్లాడాలె. మాట్లాడకపోతే, వె­హం చాటేస్తే, తనసలు మనిషే కాదు.

నిజానికి ఆమెను తన దగ్గరికి పిలుపించుకోవడం గాక తనే ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడాలనుకున్నాడు. కానీ అందరి వ­ందు కాక ఆమెతో విడిగా మాట్లాడాలనుందతనికి. అందుకే మనసుకు అం­ష్టంగా ఉన్నా ఆమెనే తన దగ్గరకు పిలుపించుకుంటున్నాడు.

దూరంగా యాదమ్మ వస్తోంది. రవీందర్‌లో ఉద్వేగం పెరగసాగింది. వస్తోందామె! వస్తోంది! తను మాట్లాడాలె. తననుకున్నది మాట్లాడాలె. ఆమెతో మాట్లాడాలి. అం­లయ్య అమ్మతో మాట్లాడాలె. ఒక గొప్ప విప్లవ వీరుడి తల్లితో తను మాట్లాడాలె.

‘అయ్యా పిలిసినవట.’

తలెత్తి చూసాడు రవీందర్‌. కుంచించుకు పోయే గుండెను కూడదీసుకొని ఆమెవైపు చూసాడు.

‘కూసోమ్మ’ గొంతు పెగుల్చుకొని చెప్పాడు.

‘పొద్దు దగ్గర పడుతుందయ్యా’ ఇంటికి తొందరగా వెళ్లాలనే ఆతృతగానీ, అక్కడ కూర్చోవడానికి అం­ష్టత గానీ, ఏదీ వ్యక్తం కాలేదామె మాటలో.

‘జరంత సేపే కూసోమ్మా’ అర్థించాడు.

కూర్చుందామె. తలొంచుకుని నేలమీద రాలిపడ్డ ఓ ఎండుటాకును చూపుడువేలుతో నివ­రుతూ ఉంది.

రవీందర్‌ ఆమెవైపే చూస్తుండిపోయాడు. గొంతు పెగల్లేదతనికి. ఎందుకమ్మా అట్ల తలొంచుకొని కూసున్నవ్‌. తలెత్తమ్మా. నీ కొడుకు త్యాగం నిన్నెల్లప్పుడూ తలెత్తుకునేటట్లు చేసింది. తలొంచుకోవాల్సినోడ్ని నేనే. నీ పాదాలను తాకేటట్లు తలొంచుకోవాల్సింది నేనే ` రవీందర్‌ హృదయం ఘోషిస్తోంది.

‘ఎట్లున్నవమ్మా?’ అతి కష్టంమీద గొంతు సహకరించింది.

‘ఏమం­ందయ్య నాకు, బాగున్న’ నిర్వికారంగా ఉందామె గొంతు. తలెత్తలేదు.

‘ఆ ఇంట్లనే ఉంటున్నవా?’

‘అవునయ్యా.’

‘అమ్మా! నేనోమాట జెప్త ం­ంటవా?’

‘సెప్పయ్యా.’

‘ఏం లేదమ్మా. నువ్వొక్కదానివి ఉండుడెందుకు? నిన్ను నేను జూస్కుంట. మాతోటి కల్సుండు.’

‘ఎందుకయ్య! నాకిప్పుడేమం­ంది? రెక్కలున్నయ్‌. సేస్కుంట. తింట. నాకెవ్వరి సాయం అవసరం లేదయ్యా.’

‘వొక్కదానివుండుడెందుకు?’

‘నాకేమన్న కొత్తా అయ్యా. ఒక్కదాన్నుండమనే రాసిపెట్టుంది నాకు. నా రాతిట్లుంటే ఎవరేం జేస్తరు’ నెమ్మదిగా చెప్పినా స్థిరంగా చెప్పిందామె.

ఆ మాట ‘నా కొడుకు చావుకి నువ్వేం కారణం కాదులే అన్నట్టుంది. నిన్ను క్షమిస్తున్నానులే’ అన్నట్టుంది. మరింత కుంచించుకు పోయాడు రవీందర్‌.

‘నాన్నా ఇక్కడున్నావా?’ అంటూ చైతన్య వచ్చాడు. సాయంత్రాలు నారాయణరెడ్డితో పాటు చైతన్య రావడం మావూలే.

‘కొడుకా అయ్యా’ చైతన్య వైపు చూస్తూ అడిగింది.

‘ఆ’ గొంతు పెగుల్చుకొని చెప్పాడు.

మరింత వ­డుచుకుపోయాడు రవీందర్‌. ఆమె యధాలాపంగా అడిగిన ప్రశ్నలలో అనేక అర్థాలు ధ్వనించాయతనికి.

‘నాకు కొడుకును లేకుండాజేసి నువ్వు మాత్రం కొడుకును కన్నవా?’ అని అడిగినట్లని పించింది.

‘నా కొడుకు బతికుంటే నాగ్గూడ ఇంత మనవడుండెటోడు గదా’ అన్నట్లనిపించింది.

అకస్మాత్తుగా చైతన్య ఉనికి మాయమవుతే బాగుండనుకున్నాడు. నిజానికి పిల్లలు కావాలనే భార్య కోరికకు అం­ష్టంగానే తల వంచాడారోజు. కానీ కన్నందుకు ఈ రోజు మనస్ఫూర్తిగా తలొంచుకున్నాడు.

‘ఇగ పోతనయ్య పొద్దుబోం­ంది’ ఇద్దరి మధ్య పరచుకున్న మౌనాన్ని కొంచెం చెదరగొడుతూ లేచి నిలబడిరదామె.

పొమ్మనీ, ఉండమనీ ఏదీ అనలేకపోయాడు రవీందర్‌. మెల్లగా తల వొంచుకొని నడుచుకుంటూ పోం­ందామె.

ఆమట్లా నెమ్మదిగా తలవొంచుకొని వెళ్లిపోవడం రవీందర్‌కి మరింత గుండె పిండినట్టం­ంది.

‘నాకొడుకునేం జేసినవని’ ఆమె తనను నిలదీస్తే బాగుండనుకున్నడు. ‘ఎందరి తల్లుల కడుపులో గాల్చి నువ్వు మాత్రం సల్లగ ఇంటికొస్తవా’ అని తన వె­హంమీద

ఉమ్మేస్తే బాగుండుననిపించింది రవీందర్‌కి.

‘చైతన్య ఇంటికి పోదమంటున్నడు పోదం రారాదు రవీ’ అని తండ్రి పిలుపుకి మెల్లగా లేచాడు రవీందర్‌. వాతావరణం మసక బారుతుందప్పటికే.

ఇంటికెళ్లి స్నానం చేసి, తలనొప్పిగా ఉందని తినబుద్ధి కావడంలేదని కొద్దిగా అన్నం తిని తొందరగా మంచెమెక్కాడా రోజు. కళ్లు వూసుకొని పడుకుంటే అం­లయ్యా, యాదమ్మే కళ్లల్లో మెదలసాగారు. యాదమ్మ దైన్యస్థితికి తనే కారణం కదా అనిపించసాగిందతనికి. కాలం ఓ పదిహేనేళ్లు వెనక్కి పోతే అం­లయ్య యాదమ్మ దగ్గరే వుంటాడు గదా. పదిహేనేళ్లు కాకున్నా ఓ సంవత్సరం వెనక్కి తిరిగినా చాలు అం­లయ్య నెత్తుటి జెండాను సగర్వంగా ఎత్తి పడుతూ తనుండేవాడు ఉద్యమంలో.

భార్య స్పర్శకు టకీమని కళ్లు తెరిచాడతను.

‘అరె నిద్రపోలేదా ఇంకా’ భర్తమీద చేం­వేస్తూ అడిగిందామె. మాట్లాడలేదతను. ఆమె స్పర్శ చిరాకనిపించసాగిందతనికి. ఆమె సన్నని చేం­ ఉక్కిరిబిక్కిరయ్యేంత బరువుగా అన్పించసాగింది.

ఆమె చెం­ని తీసివేస్తూ లేచి కూర్చున్నాడతను.

‘ఏమం­ంది?’ ఆశ్చర్యంగా అడిగింది పుష్ప.

‘మరిచిపోం­న. ఆశాలు రాత్రికి బాం­కాడ పండుకోనన్నడు. నేను పోవాలె’ భార్యకు మరోమాట మాట్లాడే అవకాశం లేకుండా గదిలోంచీ, అంతే వేగంగా ఇంట్లోనుంచీ బయటపడ్డాడు.

బాం­గడ్డ మీద పడుకున్న ఆశాలు నిద్ర లేవకుండా జాగ్రత్త పడుతూ మర్రిచెట్టు కిందికి చేరి మోకాళ్లమీద తలబెట్టుకొని కూర్చొని వెక్కి వెక్కి ఏడ్వసాగాడు రవీందర్‌.

లి లి లి

వంటింట్లోంచి వస్తున్న శబ్దాలకు మెలకువొచ్చింది రవీందర్‌కు. చేతి గడియారంలో టైం చూసుకుంటే పన్నెండు కావొస్తుంది. ‘ఈ టైంల వంటింట్ల ఏం పని చేస్తున్నరు?’ అనుకున్నాడు. పక్కన నిద్రపోతున్న భార్య నిద్ర లేవకుండా మెల్లగా మంచంలోంచి లేచి గదిలోంచి బయటకొచ్చి వంటింట్లోకి వెళ్లాడు.

తల్లి పొం­్యమీద దేన్నో కలబెడుతూ ఉండడం చెల్లెలు పీటమీద కూర్చొని ఏదో కుడుతూ ఉండడం కండ్ల బడిరదతనికి.

‘ఇంత రాత్రిల ఏం జేస్తున్నవమ్మా? ఏం కుడుతున్నవుర లల్లీ’ ఆశ్చర్యపోతూ చెల్లెలువైపు అడుగేసి ఆమె కుడుతున్న దానివైపు యధాలాపంగా చూసాడు.

లలిత చేతిలో ఎర్రనిజెండాపై తుది మెరుగులు దిద్దుతున్న సుత్తీకొడవలి!

రవీందర్‌కు నిద్రమత్తు వదిలింది. తాను ఎన్నోసార్లు తలెత్తి గర్వంగా చూసిన, చేతిలో పట్టుకొని వీధి వీధి తిరిగిన, స్వయంగా ఎగరేసిన జెండా తన చెల్లెలి చేతిలో

ఉంటే అయోమయంగా తోచింది.

లలిత కుట్టడం ఆపి ఇబ్బందిగా పీటమీద కదలసాగింది దిక్కులు చూస్తూ.

‘ఎల్లుండి మేడే కద రవీ! మీటింగ్‌ పెడుతురట. పొద్దుగాల రమేషొచ్చి లల్లమ్మకు కుట్టొస్తది గదాని ఆ జెండ కుట్టియ్యమన్నరు. అట్లనే పోస్టర్లెవ్వొ ఏస్తరట. కొద్దిగ లయ్‌ జేసియ్యమని అడుగుతే ఇది ఉడుకబెడుతున్న’ పొం­్యమీద గిన్నె దించుతూ నెమ్మదిగా చెప్పింది సరోజమ్మ.

ఇంతలో దగ్గరికి చేరవేసిన తలుపులను చప్పుడు కాకుండా తీసుకొని ఇద్దరు j­వకులు లోపలికొచ్చి చనువుగా వంటింటిలోకి వచ్చారు. వంటింట్లో రవీందర్‌ను చూసి కొంచెం తడబడ్డారు. ఇబ్బందిగా గుమ్మంలోనే ఆగిపోయారు. ఆ ఇద్దరిలో పొద్దున చూసిన రమేషును గుర్తుపట్టాడు రవీందర్‌.

‘లయ్‌ దించేసిన. కాలుతాంది ఎట్ల పట్కపోతరు’ సరోజమ్మ మాటలతో వాళ్లు కొంచెం తేరుకున్నారు.

‘ఆఁ అట్లనే గుడ్డతోటి పట్కపోతం అదే సల్లార్తది’ అంటూ రమేషు పొం­్య దగ్గరికి వచ్చేసాడు.

ఇంకోతను లలిత దగ్గరికి వస్తూ ‘అం­ందాక్క జెండాపని’ అన్నాడు నవ్వుతూ.

‘ఇగో అం­పోం­ంది’ అంటూ మడిచి అతని చేతికిచ్చింది.

అతను దాన్ని విప్పి చూసి ‘అక్క బ్రహ్మాండంగా కుట్టింది’ అంటూ రమేషుకు చూపించాడు.

‘మరేమనుకున్నవ్‌ అక్క’ చూసి తృప్తిగా నవ్వుతూ అన్నాడు రమేషు.

నలుగురి వె­హాల్లోనూ చిరునవ్వు విరిసింది. రవీందర్‌ అయోమయం నుండి తేరుకోకుండానే ఆ ం­ద్దరు వెళ్లిపోయారు. రవీందర్‌కేసి ఆసక్తిగా చూస్తూ వెళ్లిపోయారు.

‘మంచినీళ్లు తాగుతవా రవీ’ అంటూ చెంబుతో నీళ్లిచ్చింది సరోజమ్మ. అతను నీళ్లకోసమే వంటింట్లోకి వచ్చాడనుకుందామె.

రవీందర్‌ నీళ్లు తాగి వెనుతిరిగి గదిలోకి వెళ్లాడు. అతని వెనుక లలిత, సరోజమ్మ వంటింట్లోంచి వచ్చి మంచాలమీద వాలిపోయారు.

రవీందర్‌ మంచంలో పడుకున్నాడు. బుర్ర గజిబిజిగా తయారం­ంది. తల్లి రమేష్‌ అని చెప్పిన అబ్బాం­ ఉదయం ఇంటికి రావడం గుర్తొచ్చిందతనికి.

ఇంట్లోకి వచ్చిన అతడ్ని ‘ఎవరు బాబూ’ అని రవీందర్‌ అడిగితే `

‘అమ్మలేదా’ అని నసిగాడతను. ఇంతలో అమ్మ వంటింట్లోంచే తొంగిచూసి ‘ఇంటెనక పనుంది. రమేషు ఈడికే రా’ అని పిలిచింది. అతను ఇందాక చూసినట్టే రవీందర్‌వైపు ఆసక్తిగా చూస్తూ ఇంటివెనుక భాగానికి వెళ్లాడు.

బహుశా అప్పుడు చెప్పుంటాడు అమ్మకి ఈ పనులు చేసిపెట్టమని. అంటే తన కుంటుంబం చేసిపెడుతదా ఇటువంటి పనులు? అం­నా తనింత ఆశ్చర్యపోయే విషయమేవ­ందిండ్ల? పార్టీకి అనేకమంది అనేక పనులు చేసి పెడుతరు. అం­నా తను పార్టీల ఉన్న అనే అభిమానంతో ఇన్నాళ్లు చిన్నా చితకా పనులు చేసుంటారు. మరి ఇయ్యాల తను బయట కొచ్చేసిండు. అం­నా తన కుటుంబం ఇట్లాంటి పనులు చేసేది కొనసాగిస్తదా? వీళ్లకి పార్టీమీద అభిమానం ఏర్పడి వుండొచ్చు. ఏది ఏమైనా పదిహేనేళ్ల క్రితం తన ఇంట్లో ఏం పనులు జరిగినయో ఇప్పుడూ అదే జరిగింది. అం­తే అప్పుడు తన ప్రమేయంతో, ఇప్పుడు తనకు తెలియకుండా. ఎందుకు తెలియకుండా దాచినట్టు? తను వొద్దంటడనా? బాధ పడతాడనా? బాధ పడుతననే అj­్యంటది! అమ్మ మనసు తనకు తెలుసు. ఎందుకు గతాన్ని గుర్తు చేయడం అనుకొనుంటది. అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న రవీందర్‌కు ఆ రాత్రి ఇక నిద్రపోకుండానే తెల్లారింది.

లి లి లి

‘ఏంది బాపూ, చీకటి పడుతుంటే వొచ్చినవ్‌, నేనే ఇంటికొద్దమను కుంటుంటే’ ఆశ్చర్యంగా అన్నాడు రవీందర్‌.

‘ఆఁ వొచ్చిన. ఇంటికాడుండి ఏం జెయ్యాల్నో తెల్వక’ కోపంగా వుందతని గొంతు.

‘ఏమం­ంది బాపూ! అట్లున్నవ్‌’

నారాయణరెడ్డి ఏం మాట్లాడకుండా బాం­ దగ్గరికి పోం­ కాళ్లు చేతులు వె­హం కడుక్కోని వచ్చి మంచంలో కూర్చొని భుజం మీది తువ్వాలుతో తుడుచుకోసాగాడు. రవీందర్‌ తండ్రి పక్కనే కూర్చున్నాడు. రెండు వూడు నిమిషాల తర్వాత నారాయణరెడ్డి వె­దలు పెట్టాడు.

‘ఊళ్లె ఏదో మీటింగట ఇయ్యాల, నేను వొద్దంటుంటే సెవులేసుకోకుంట మీయమ్మ, లల్లమ్మ పోం­న్రు’ కోపంగా అన్నాడు నారాయణరెడ్డి.

‘అహ’ అంతకు మించి ఏం అన్లేక పోయాడు రవీందర్‌.

‘లల్లమ్మ పిల్లల్ని గూడ ఎంట బెట్టుకపోం­న్రు. ఆళ్లను చూసి చైతన్య గూడ బోతనని ఏడుపు. వొద్దని పుష్ప వాన్ని గొట్టింది. వాడిక వొకటే ఏడుపు’ కొద్దిసేపు ఆపాడు నారాయణరెడ్డి.

‘నువ్వం­న జెప్పు రవీ! ఈళ్లకియ్యన్నీ ఎందుకిప్పుడు. ఇన్ని రోజులంటే ఏరే. ఏదో దేవుని దయవల్ల నువ్వొచ్చినవ్‌. ఇగియ్యన్నీ బందు వెట్టుకోవచ్చుగా. యాడ మీటింగుబెట్టినా మీయమ్మ తయారం­తది. లల్లమ్మను, పిల్లగాల్లను గూడ తీస్కపోతది. ఇప్పట్నుంచి మీటింగులకు వోతే ఆ పిల్లగాల్లు ఏమం­పోవాలె’

‘ఈ రెండు వూడేళ్లనుంచి ఏడ మీటింగు వెట్టినా పోతాంది. ఈ రెండు వూడేండ్ల నుంచెల్లే అంతకువ­ందు ఏ సప్పుడు లేదు ఊళ్లె. నువ్వూ, అం­లయ్యా, ఆ సురేషూ ఎల్లిపోం­న తర్వాత పోలీసులొచ్చి జనాల్ని గొట్టి, పట్కపోం­న్రా.. ఇగా తర్వాత ఊరు సప్పుడు లేకుంటం­ంది. లల్లమ్మ పంచాం­తప్పుడు కలిసిండ్రు, మాట్లాడిరడ్రు పార్టీ వోళ్లు. పంచాం­జ్జేసిండ్రు. తర్వాత కూడ రెండు వూడేండ్లు సప్పుడు లేదు. రెండు వూడేండ్ల నుంచి దళం ఊళ్లెకి రావట్టింది. లల్లమ్మ పంచాం­తి జేసినాయన ఇప్పుడీడ నాయకుడట. ఇగ కల్సుడు వె­దలుబెట్టిన్రు. మీయమ్మ అన్నం వొండి పంపుడు, మీటింగులకు పోవుడు వె­దలుపెట్టింది. నేనెప్పుడు ఏమన్లే, ఏదో ఆళ్లల్ల నిన్ను జూస్కుంటుందనుకున్న. కాని గిప్పుడియ్యన్ని ఎందుకు?’ నారాయణరెడ్డి వెళ్లబోసుకుంటున్నాడు.

ఏం మాట్లాడుతాడు రవీందర్‌? ఏం మాట్లాడగలడు?

‘ఊఁ కొడుతూ ఉండిపోయాడు. అమ్మా, చెల్లి పార్టీకి దగ్గరం­న క్రమం అర్థమం­ందతనికి.

తన మాటల్ని ఆపి కాసేపు మౌనంగా ఉండి ‘పోదం రారా రవీ, పొద్దుపోం­ంది’ అన్నాడు.

‘ఇంకా ఆశాలు రానట్టుండు గద’ అన్నాడు మళ్లీ.

‘రాలే. రోజీపాటికి వొచ్చెటోడే’

ఇంతలో ఆశాలు రానే వచ్చాడు. ‘ఏందయ్యా ఈయాల్ల దాంక రూడ్నె ఉండ్రు’ ఆశ్చర్యంగా అడిగాడు.

‘నువ్వేందిరా గింత పొద్దువొం­ంది’ నారాయణరెడ్డి.

‘ఊళ్లె మీటింగద పోం­న్నయ్యా’

నారాయణరెడ్డి ఏం మాట్లాడలేదు. ఓ నిమిషం తర్వాత ‘రా రవీ పోదం’ అన్నాడు. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. దారంతా నిశ్శబ్దంగా సాగింది.

ఇల్లు నాలుగంగల్లో ఉందనగానే ఇంట్లో పిల్లల సందడి వినబడసాగింది.

‘ఆయారే మేడే…’ చిన్నపిల్లాడి పాట వినబడిరది. లలిత నవ్వూ వినబడిరది. ‘అమ్మా! వీడు బాగ పాడ్తడే పాటలు’ కొడుకువైపు మెరిసే కళ్లతో చూస్తూ అంటోంది లలిత.

అప్పటికి సరిగ్గా గుమ్మంలో ఉన్నాడు రవీందర్‌. లలిత మాటలూ విన్నాడు. ఆమె కండ్లల్లో మెరుపూ చూసాడు.

గుమ్మంలో అన్ననీ, తండ్రినీ చూడగానే లలిత గంభీరంగా మారిపోం­ ‘అరేయ్‌ ఏం లొల్లిర, పోం­ కడుక్కొని రాపోండ్రి అన్నం బెడుత’ అంటూ హడావుడిగా వంటింట్లోకి వెళ్లిపోం­ంది.

అంతవరకూ తమ లొల్లికి వంత కలిపిన అమ్మలోని మార్పుకి బిక్కవె­హం వేసిన పిల్లలకి రవీందర్‌, నారాయణరెడ్డి కన్పించగానే ‘మావయ్యా, మేం మీటింగుకు బోం­నం’ అంటూ చుట్టేసారతన్ని. తమ సంతోషాన్ని ఇంకాసేపు పంచుకోవాలనుంది వాళ్లకి.

ఇంతలో వంటింట్లోంచి సరోజమ్మ వచ్చి ‘అరేయ్‌ రాత్రి పొద్దుబోం­ంది. అన్నాలు తింటరా తినరా’ పిల్లలిద్దర్నీ లాక్కుపోం­ంది. ఆమె కొడుకు వె­హంగానీ, భర్తవె­హం గానీ చూడలేదు. గంభీరంగా ఉందామె వె­హం.

కాసేపటికి వంటింట్లోంచి ‘రవీ! నువ్వూ, మీ బాపు రాండ్రి అన్నం తిందురు’ అని కేకేసింది. నారాయణరెడ్డి కదల్లేదు. ‘లే బాపూ, తిందం’ అన్న కొడుకు మాటను కాదన్లేక లేచాడు.

ఇద్దరూ కడుక్కొని వంటింట్లోకి వెళ్లేప్పటికి వంటిల్లు ఖాళీగా వుంది. సరోజమ్మ ఇద్దరికీ భోజనాలు వడ్డిస్తోంది. పిల్లల ‘గోల’ని ఆపలేక ఆపడం ఇష్టవూ లేక పిల్లలిద్దరికీ పెరట్లో అన్నాలు తినిపిస్తోంది లలిత. అప్పటికే చైతన్యకు అన్నం తినిపించి పెరట్లోని మంచంలో నిద్రబుచ్చి తనూ కాస్త తిని కొడుకు పక్కనే పడుకుంది పుష్ప. నిద్రరావడం లేదామెకు.

తింటోన్న రవీందర్‌కు పెరట్లోంచి పిల్లల ప్రశ్నలూ, లలిత జవాబులూ వొకటీ అరా విబడుతున్నయ్‌.

‘మట్టి దోల్డు అం­ందా రవీ’

‘ఆఁ అం­నట్టేనమ్మా’

‘వారుకు మడి దున్నిన్రా’

‘దున్నినమమ్మా’

సరోజమ్మ అదీ ఇదీ మాట్లాడసాగింది. ఆమె మాటల్లో లలిత, పిల్లల మాటలు రవీందర్‌ చెవిల బడలేదు.

వాళ్లు తిని వెళ్లేప్పటికి లలిత పిల్లల్ని నిద్రబుచ్చి వంటింట్లోకి వచ్చింది. తల్లీ కూతుళ్లు అన్నాలు తిని పెరట్లోకి వచ్చేప్పటికి అందరూ మంచాల్లో పడుకొని వున్నారు. లలిత పెద్ద కొడుకు రోజులాగే తాత పక్కలో పడుకున్నాడు. చిన్న కొడుక్కి అమ్మమ్మ దగ్గర పడుకునే అలవాటు. చైతన్య వచ్చినప్పటి నుంచీ ఒకవైపు చైతన్యను, మరోవైపు లలిత చిన్న కొడుకును వేసుకొని పడుకుంటుందామె. ఒక్కోసారి తన పనులు వ­గించి వచ్చేప్పటికి పిల్లలు ఆడా ఈడా పడుకున్నా నిద్రలోనే వాళ్లనెత్తుకొని తన పక్కలో వేసుకుంటుంది. ఆ అలవాటు ప్రకారమే చైతన్య దగ్గరికి వెళ్లి వాడ్ని ఎత్తుకోబోం­ంది.

‘నిద్రబోతున్నడు గదా ఈడ్నే పండుకోనీయండ్రి’ అంటూ కొడుకుని తన చేతులతో చుట్టేసింది పుష్ప.

మారు మాట్లాడకుండా తన మంచం దగ్గరకు వెళ్లి చిన్న మనవడ్ని గుండెలకు హత్తుకొని పడుకుందామె.

క్రమంగా అందరూ నిద్రబోయారు. పుష్ప రవీందర్‌లకి ఆ రాత్రి చాలాసేపు నిద్ర రాలేదు. పుష్పకు అశాంతిగా వుంది. ‘మేమే వదిలిపెట్టి వచ్చినంక. ఈళ్ల కెందుకు ఇవన్నీ, తానెన్ని చూసిందిట్లాంటి మీటింగులని, తానెంత అద్భుతంగా పాడేది ఇట్లాంటి మీటింగుల్లో. అన్నీ చూసీ, తిరిగి తెలుసుకునే ఇప్పుడొద్దనుకున్నం గద. మళ్లీ వీళ్లు మీటింగులకు పోయేదెందుకో’ అనుకోసాగిందామె.

పుష్ప పదిహేనేళ్ల వయసులోనే ఉద్యమంలోకి వచ్చింది. చాలా ఉత్సాహంగా

ఉండేది. అద్భుతంగా పాడేది. ఎదగని వయసు, అంతకంటే ఎదగని చైతన్యం… రవీందర్‌తో పెళ్ళం­ంది. రెండు వూడేళ్లు ఇద్దరూ డెన్‌లో ఉన్నారు. తర్వాత రవీందర్‌ అటవీ జీవితానికి వెళ్ళాడు. దుర్భరమైన ఒంటరితనానికి గురైంది పుష్ప. అప్పుడప్పుడు నాయకులెవరైనా వచ్చి వెళ్లేవారు. ఎవరైనా వచ్చినప్పుడు పండగలా ఉండేదామెకు. తర్వాత మళ్లీ వంటరితనమే. వంటరితనం తప్పించుకోవడానికి పిల్లలు కావాలని పోరుపెట్టింది. చైతన్య పుట్టాక సహజంగా వాడిమీద విపరీతమైన మమకారం పెంచుకుంది. ఏ క్షణంలో ఏ ప్రమాదమైనా వ­ంచుకొచ్చే అవకాశవ­న్న ఆ జీవితంలో పిల్లవాడి భద్రత గురించి ఆందోళన చెందేది. క్రమంగా ఆ జీవితంలోంచి ‘భద్ర’ జీవితంలోకి వెళ్లాలని భర్తతో పోరుపెట్టేది. వె­దట్లో భర్త చెవిన పెట్టలేదు. చివరికి ఆమె పోరువల్ల కాకపోం­నా ఆమె కోరిక నెరవేరింది. ఇప్పుడు మళ్లీ అత్త ఆడబిడ్డల వూలంగా ఏ ప్రమాదం వ­ంచుకొస్తుందోనని ఆందోళన పెరగసాగింది.

రవీందర్‌కి బుర్రంతా గజిబిజిగా వుంది. పదిహేనేళ్ల క్రితం ఎన్నో మీటింగులకి తను వ­ందుండేవాడు. ఆ తర్వాత ఎన్నో మీటింగులకి వెనకున్నడు. కానీ ఈ రోజు జరిగిన మీటింగుకి తను వ­ందూ లేడు వెనుకా లేడు.

ఆ రోజు మీటింగ్‌ జరుగుతుందని తనకు తెల్సు. రెండు రోజులుగా పొలానికి వెళ్తూ గోడలమీద పోస్టర్లు కూడా చూస్తున్నాడు. ఆ పోస్టర్లను ఎట్లా చూసాడు తను. వ­ందు చుట్టూ చూసి ఎవరూ తనను చూడ్డంలేదని నిర్ధారించుకొని ఆ తర్వాత తల ఎత్తీ ఎత్తకుండా కళ్లు తిప్పీ తిప్పకుండా గబ గబా చదివాడు. సాధారణ జనం నిలబడి నింపాదిగా చదివిన పోస్టర్‌ను తనెందుకలా దొంగచాటుగా చదివాడు? పార్టీ వ్యతిరేకులు కూడా దర్జాగా కూర్చొని మీటింగ్‌ చూస్తారు. కానీ తనకు మాత్రం మీటింగు కెళ్లడానికి వె­హం చెల్లలేదు. పదిహేనేళ్ల క్రితం కుటుంబ సభ్యులందర్ని ఏ మీటింగ్‌ జరిగినా రమ్మని పోరుపెట్టేవాడు. ఎవరూ వచ్చేవాళ్లు కాదు. పైగా తననే తిట్టేవాళ్లు. చిల్లర మనుషులతో కల్సి తిరగొద్దనేవారు, కానీ ఈనాడు తనతోటి చెప్పకుంటనే, బాపు అభ్యంతరాన్ని లెక్క చెయ్యకుండనే అమ్మా, చెల్లెలు మీటింగుకు పోం­న్రు. వాళ్లనభినందించాల్నా? తను విడిచిపెట్టిన దారిని వాళ్లభిమానిస్తున్నందుకు బాధపడాల్నా? ఎందుకు బాధపడాలె? మరి సంతోషపడాల్నా? బాధపడకుంట సంతోషపడకుంట మావూలుగా ఉండొచ్చుగదా. సాధ్యమేనా అట్లుండుడు? సాధ్యమయ్యేటట్లం­తే అమ్మతో, లల్లీతో మావూలుగనే ‘ఎట్ల జరిగింది మీటింగ’ని అడిగుండేటోడు. ఎందుకు అడగలేకపోయాడు? ఇకవ­ందు అడుగగలడా? ఉహు అడుగలేడు. తనిక మావూలుగా ఉండలేడా?

ఆలోచనలతో సతమతమవుతున్న రవీందర్‌కు నిద్ర దరిదాపుల్లోకి కూడా రాలేదు.

లి లి లి

‘అసలు నా మాటంటే నీకేమన్నా లెక్కుందా? అసలేమనుకుంటున్నవ్‌ నువ్వు’ నారాయణరెడ్డి అరుస్తున్నాడు.

‘అరె! నీ మాటంటే లెక్కలేక ఏంజేసిన నేను’ సరోజమ్మ కూడా గట్టిగానే మాట్లాడుతోంది.

‘ఏమం­ంది బాపూ?’ వ­ందుగా ఎదురుపడ్డ తండ్రినడిగాడు రవీందర్‌.

కోపంగా ఉన్న నారాయణరెడ్డి ఏం మాట్లాడలేదు. సరోజమ్మే వ­ందుకు నాలుగడుగులు వేస్తూ అంది.

‘నేను జెప్త రవీ, మీ బాపు కోడ్ని కోసిండు. వండినం. వూళ్లెకు దళవె­చ్చిందని తెల్సింది. కూరపంపిచ్చిన. అదీ నేను జేసిన నేరం గోరం. ఇగ ఏమేమో మాట్లాడుతుండు జూడు’

‘నువ్వు జేసిందాంట్ల తప్పేం లేదు గని.. నేను ఏమేమో మాట్లాడుతున్న.’

‘తప్పేవ­ందండ్ల? తిండి బెట్టుడు గూడ తప్పా? పదిహేనేండ్లు నాకొడుక్కు నా అసువంటి తల్లులే గదా అన్నం బెట్టింది. అన్నం బెట్టుడు తప్పనుకుంటే వాడేమయ్యేటోడో ఆలోచించు’

‘వాని గురించే నేను గూడ ఆలోచించమంటున్నది. ఏదో బయటకొచ్చి వాని బత్కు వాడు బత్కుతుండు. నువ్విట్ల వాళ్ల మీటింగులకు పోవుడు, తిండి బెట్టుడు పోలీసులకి తెలుస్తే మళ్లీ వాళ్లూకుంటరా? వాన్ని ఇబ్బందులు బెట్టరా?’

‘ఎట్ల తెలుస్తది నువ్విట్ల లొల్లి చేస్తనే తెలుస్తది’

‘ఆఁ లేకుంటే తెల్వనే తెల్వదు. ఇయ్యాల నీ దగ్గర సాటుంగ అన్నం కొంచబోం­ నోడు రేపు లొంగిపోతడు.’ నారాయణరెడ్డి వ్యంగ్యం కొడుక్కు తాకుతుందనుకోలేదు.

‘సరే రవికిబ్బందం­తదేమో అనేదే గదా నువ్వనేది ఆ మాట రవే జెప్తే నేనింట’ ఇక రవే నిర్ణం­ంచాలన్నట్టు మాట్లాడిరది.

‘అరె! నామీద బెట్టిందే. నేనేం మాట్లాడాలిప్పుడు? ఒకప్పుడు ప్రజలకోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడానికి సిద్ధపడిన నేను, ఇప్పుడు నాకిబ్బందనో నా ప్రాణాలకు వ­ప్పనో ప్రజలకు త్యాగం జేjె­ద్దని చెప్పాల్నా? ఏ పార్టీ రాజకీయాలకు కట్టుబడి పదిహేనేండ్లకు పైగా పనిజెసిండో ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి ఏ పార్టీ అభివృద్ధిలో తనూ ఓ కీలకమైన పాత్ర అం­ండో… ఆ పార్టీకి అన్నం పెట్టొద్దని, పదిహేనేళ్లకు పైగా ఏ ప్రజల సంసిద్ధత పెంచడానికి కృషి చేసిండో ఆ ప్రజలకే ఎట్ల చెప్పగలడు?’

‘బాపూ, వూకో. అమ్మ జేసిందాంట్ల తప్పేంవుంది?’ అంటూ కాళ్లూ చేతులూ కడుక్కునే నెపంతో ఇంటి వెనక్కు గబగబా వెళ్లాడు.

ఇంక నారాయణరెడ్డి ఒక్కమాట గూడ మాట్లాడలేదు. ఇల్లంతా నిశ్శబ్దమం­ంది.

లలిత వంటింట్లో పనిలో వుంది. పుష్ప ఇంటి వెనకాల మంచంలో కూర్చొని కొడుక్కి అన్నం తినిపిస్తోంది.

రవీందర్‌ బావిలో నీళ్లు చేదుకొని కాళ్లూ చేతూలూ కడుక్కుని అక్కడే దండెంమీద ఆరేసి ఉన్న తువ్వాలుతో తుడుచుకుంటూ నిలబడిపోయాడు. ఇంట్లోకి పోబుద్ది కాలేదతనికి.

‘నాన్నా’ అంటూ చుట్టేసాడు చైతన్య.

‘అరేయ్‌ రా’ నన్ను సతాం­ంచకుంట తిను’ కసిరింది పుష్ప.

కొడుకుని రెక్కపట్టుకొని భార్య దగ్గరికి తీసికెళ్లి వాడ్ని అట్టే పట్టుకొని తనూ మంచంలో కూర్చున్నాడు. పుష్ప మౌనంగా కొడుక్కి అన్నం తినిపించ సాగింది. అన్నం తింటున్న చైతన్యను చూస్తూ కూర్చుండిపోయాడు రవీందర్‌. చైతన్య ఏదో అడుగుతుంటే అన్యమనస్కంగా సమాధానం చెప్పసాగాడు.

‘మనమే ఎళ్లొచ్చినంక వీళ్లకివ్వన్ని ఎందుకు? మీరన్న చెప్పొచ్చుగద. లేకుంటే మన మానాన మనవ­ందమంటే మీకు నా మాట సెవిన బారదు.’

‘వూకో పుష్పా’ మంచంలోనుండి విసురుగా లేచాడు రవీందర్‌.

లి లి లి

‘బాగున్నవా రవీందర్‌?’ ఎదురుపడిన తనను చూసి ఆశ్చర్యంగా ఆగిపోం­న రవీందర్‌ని గుర్తుపట్టి అడిగాడు శంకరయ్య.

‘మీరెట్లున్నరు సార్‌?’

‘నాకేమయ్యా బాగున్నా’ నవ్వుతూ అన్నాడు శంకరయ్య.

‘ఎక్కడ్నుంచీ, పొలం కాన్నుంచా’ మళ్లీ ఆయనే అడిగాడు.

‘అవున్సార్‌’

‘రా! మా ం­ంటికి పోదం’

సందిగ్ధంగా ఆగిపోయాడు రవీందర్‌. ‘రా రవీందర్‌ పోదం’ అనునయంగా అన్నాడు శంకరయ్య. అప్రయత్నంగానే శంకరయ్య వెంట అడుగులేసాడు రవీందర్‌. ఐదు నిమిషాల్లో ఇల్లు చేరారు.

‘గుర్తు పట్టినవా? రవీందర్‌!’ చెప్పాడు శంకరయ్య. చదువుతున్న పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, పడుకున్న మంచంలోంచి లేచి నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న భార్యతో.

‘రవీందరా! బాగున్రా కూసోండ్రి’ అంది మంచం పక్కనే ఉన్న కుర్చీ చూపిస్తూ.

శంకరయ్య మరో కుర్చీలో కూర్చుంటూ ‘నువ్వు గూడ కూసో’ అన్నాడు భార్యతో.

‘చాయ్‌ జేస్త’ అంది పుస్తకాన్ని మంచంలో పడేస్తూ.

‘నేంజేస్త చాయ్‌, నువ్వు కూసో’ అంటూ లేచి వంటింట్లోకి నడిచాడు శంకరయ్య.

ఇబ్బంది పడుతూ కూర్చుంది సుశీల. రవీందర్‌తో ఏం మాట్లాడాల్నో తోచలేదామెకు.

‘బాబట గద. బాగున్నడా’ మెల్లగా అడిగింది.

‘బాగున్నడమ్మా’ గొంతు పెగుల్చుకొని చెప్పాడు.

‘అమ్మెట్లుంది? ఈ నడుమ అమ్మను జూడక సాన రోజులం­ంది’ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదామెకు.

రవీందర్‌కి ఊపిరాడన్నట్లుగా ఉంది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె వైపు చూడలేక నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. సుశీలతో అతనికి గతంలో పెద్దగా పరిచయం లేదు. ఓ నాలుగైదుసార్లు చూసుంటాడు. ఒకే ఒకసారి మాత్రం ఆమెతో మాట్లాడాడు. ఆనాటి సంఘటన గుర్తొచ్చిందతనికి.

లి లి లి

కడపమీద కూర్చొని పేపర్‌ చదువుతున్న రవీందర్‌ ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తాడు. కింద మెట్టుమీద నిలబడ్డ స్త్రీని సురేష్‌ వాళ్లమ్మ సుశీలగా గుర్తించాడు.

పలకరింపుగా నవ్వి ‘రామ్మా’ అన్నాడు. ఆమెకు దారిస్తూ ఒక పక్కకు జరిగాడు.

సుశీల కదల్లేదు. మాట్లాడ్డానికి తటపటాం­స్తూ నిలబడిరదక్కడే.

‘సురేష్‌ గురించి మాట్లాడుదమనొచ్చిన’ బెరుకు బెరుగ్గా నిలబడిరదక్కడ.

‘ఏం మాట్లాడుతారు సురేష్‌ గురించి?’ ఆమె మాట్లాడదలుచుకుంది అర్థమైనప్పటికీ నవ్వుతూనే అడిగాడు రవీందర్‌.

‘సురేష్‌ చదువుమీద అస్సలు శ్రద్ధ బెడ్తలేడు. సార్లందరు గూడ అంటుండ్రు. ఇప్పుడు పదో తరగతాయే. సద్వకపోతే ఎట్ల?’

‘సురేషెందుకు సద్వడమ్మా? బాగ తెలివం­నోడు. బాగ సదువుతడు’

‘ఏం సద్వుతుండయ్య. ఎప్పుడు మీటింగులు పాటలని తిరుగుతున్నడు. వానిది చిన్న వయసాయె. ఇప్పట్నుంచి అయ్యన్ని ఎందుకు జెప్పుండ్రి.’

‘చిన్న వయసులోనే మంచి పనులు జేస్తే మంచిదే గద. గొంతు మంచిగున్నది. పాటలు పాడుతుండు తప్పేవ­ంది?’

‘కానీ సద్వుకోకుంటె ఎట్ల? మాకేమన్న బూవ­లు గీవ­లున్నయా? ఏదో సదువుకుంటే ఏదో ఉద్యోగం వొస్తనే గదా బతికేది’

‘ఆరె! మేమేమన్న సదువుకోవద్దని సెప్తమామ్మ. నేను గూడ సదువుకుంటనే ఉన్న గద’ రవీందర్‌ గొంతులోని అసహనం సుశీలకు అర్థమం­ంది. ఇంకేం మాట్లాడక వెనుదిరిగిపోం­ందామె

లి లి లి

ఆలోచనల నుంచి బయటపడుతూ సుశీల చదువుతూ మంచంలో పడేసిన పుస్తకాన్ని అప్రయత్నంగా చేతిలోకి తీసుకున్నడు.

‘వె­న్న మార్చిల హైద్రాబాద్‌ల మీటింగ్‌ జరుగుతే మా అమ్మాం­ ఉత్తరం రాసింది రమ్మని. అక్కడ్నే సదువుతుంది గద. ఇద్దరం పోం­నం ` అమ్మాయే కొనిచ్చిందీ పుస్తకాన్ని. ఆరోగ్యం బాగలేక సదువుడు వీలుపల్లే. ఇప్పుడు సదువుతున్న’ చెప్పింది సుశీల.

‘అంటే సురేష్‌ చెల్లెలు కూడా…’ రవీందర్‌ ఆలోచనల కడ్డుపడుతూ ‘చాయ్‌ తీసుకో రవీందర్‌’ అంటూ చాయ్‌ గ్లాసులతో వ­ందు నిలబడ్డాడు శంకరయ్య.

‘ఇగో నీకు పాలు’

‘నేను తర్వాత తాగుదును గదా’ ఇబ్బందిగా నవ్వుతూ అందామె.

‘తాగుతవ, ఇంకెప్పుడు తాగుతవ్‌? మళ్లన్నం టం­మం­ందంటవ్‌’

తనూ టీ తాగుతూ కుర్చీలో కూర్చున్నాడు శంకరయ్య.

‘నువ్వొచ్చినట్టు తెల్సిందిగానీ సరీగ ఊళ్లెలేం. ఆ మధ్య విద్యా మహాసభలు జరిగినయ్‌ గదా. కొంచెం బిజీగున్న. ఆ తర్వాత ఈమెకు బాగాలేదు. హైద్రాబాద్‌ తీస్కపోం­న. అందుకే నిన్ను ఇన్ని రోజులు చూసుడు కుదర్లేదు’ శంకరయ్య ఆప్యాయంగా మాట్లాడసాగాడు. రవీందర్‌కి ఉక్కిరిబిక్కిరిగా అన్పించసాగింది. సురేష్‌ గుర్తొచ్చాడు, తనకంటే పదేళ్లు చిన్నవాడైన సురేష్‌. తన అడుగుజాడల్లో నడక వె­దలెట్టిన సురేష్‌ తాను ఆగిపోం­నా దృఢంగా వ­ందుకు సాగుతున్న సురేష్‌ గుర్తొచ్చాడు. ‘సురేష్‌ తన కుటుంబాన్ని ఎంత ప్రభావితం చేసిండు. ఒకప్పుడు సురేష్‌తో ‘నీ తల్లిదండ్రులు చాలా స్వార్థపరులు సురేష్‌, మీ నాన్నొక టీచర్‌గని, అతను సమాజం గురించి కొంచెంగూడ ఆలోచిస్తలేడు’ అని మాట్లాడాడు.

నిజానికి ఈ ం­ంట్లో అడుగు పెట్టేంతవరకూ తన అంచనా అదే. కానీ తన అంచనాలు తలకిందులం­నయ్‌. ఎవర్నం­తే స్వార్థపరులని కొట్టి పడేసాడో వాళ్లీనాడు చైతన్యవూర్తులుగా ఎదిగిండ్రు. ఎవర్నం­తే రాజకీయాలంటే భయం వీళ్లకు అని తాను ఎగతాళి చేసిండో వాళ్లీరోజు ఆ రాజకీయాలను గుండెలకు హత్తుకున్నరు. కొడుకు రాజకీయాలను చూసి ఆందోళన పడినవారు, కూతురు రాజకీయాలను కూడా ఆమోదిస్తున్నారు. అంతేకాదు రాజకీయాలను జీవితాలకు అన్వం­ంచుకుని ఎంతో వ­ందున్నరు. నిజంగానే ఎంతో వ­ందున్నరు. డెన్‌లో ఉన్నప్పుడు తాను వంటపని ఎప్పుడూ చేసేవాడుకాదు. వె­దట్లో భార్య చేయనిచ్చేది కాదు. క్రమంగా తనూ ప్రయత్నించడం గూడ మానేసిండు. భార్యను ఎదిగించే ప్రయత్నాలు తనేం చేసిండు పెద్దగా? కానీ శంకరయ్య సార్‌ వంటింటి హద్దులను చెరిపేస్తున్నడు. అవును వీళ్లు చాలా మారిండ్రు… సురేష్‌ మార్చిండు… ఎందరో సురేష్‌లు చేస్తున్న త్యాగాలు మార్చినయ్‌. ఆ త్యాగపూరిత రాజకీయాలు మార్చినయ్‌.

‘వ్యవసాయం జెయ్యాలనే నిర్ణం­ంచుకున్నావా రవీందర్‌’ శంకరయ్య ప్రశ్నతో ఆలోచనల నుండి బయటపడ్డాడు రవీందర్‌.

‘అవున్సార్‌’

‘అదే మంచిది’

రవీందర్‌కు ఏం మాట్లాడాలో తోచట్లేదు. వీళ్లు సురేష్‌ని చూసి ఎన్ని రోజులం­ందో, సురేష్‌ క్షేమసమాచారాలు వీళ్లకి తెల్సో తెల్వదో. అడుగుతే… ఉహు అడుగలేకపోయాడు. సురేష్‌ని వచ్చేవ­ందు కూడా తను కల్సాడు. ‘సురేష్‌ కల్సిండు బాగున్నడు’ అని చెప్తే… ‘సురేష్‌ పెళ్లి చేస్కున్నడు’ అని చెప్తే, ఉహు చెప్పలేకపోయాడు.

ఒకప్పుడు బెరుకు బెరుగ్గా వీళ్లు మాట్లాడుతుంటే తను ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు వీళ్లవ­ందు గొంతు పెగలటంలేదు అనుకున్నాడు.

లి లి లి

‘అక్క, సౌజమ్మ వచ్చిండ్రురా’ పొలం నుంచి ఇంటికొస్తున్న రవికి తండ్రి ఎదురుపడి చెప్పాడు.

‘అహ వొచ్చిన్రా ఎంతసేపం­ంది వచ్చి’ ఆరోజు వాళ్లొస్తరని వ­ందే తెల్సు.

‘ఓ గంటం­ంది. అక్కతోని మాట్లాడుకుంట ఇంట్లనే ఉండరాదూ? బాం­కాడేం పనుందిగని’ అంటూ పొలంవైపు నడక సాగించాడు నారాయణ.

‘బాగున్నవా అక్కా’ అంటూ ఇంట్లోకి అడుగుబెట్టాడు రవీందర్‌. చెప్పులు విడిచి బల్లపీటమీద అక్క పక్కన కూర్చున్నాడు. మరోపక్కన సరోజమ్మ కూర్చుని వుంది.

‘బాగనే వున్నరా, నువ్వేందిరా ఇట్లం­పోం­నవ్‌. నల్లగ, బక్కగ’ తవ­్మడి వీపును తడువ­తూ అంది రత్నమాల.

‘ఏం లేదులేక్కా’ నవ్వాడు రవీందర్‌.

‘ఏం లేదంటవేందిరా. అం­నా నువ్వా వ్యవసాయం ఏం జేస్తవురా. వరంగల్‌కు రారాదూ. మీ బావేదన్న ఉద్యోగం జూస్తడు’

‘నాకేవ­ద్యోగవె­స్తది గనీ. బావెట్లున్నడు, బాబెట్లున్నడు? అవునూ సౌజీ ఏది’ అన్నాడు.

‘అదింటెన్క పిల్లలతో ఆడుతున్నట్టుంది. దానికి పిల్లలంటే చాలా ం­ష్టంరా’ అంటూ నాలుగడుగులు ఇంటెనుకవైపు వేసి ‘సౌజి’ అంటూ పిల్చింది.

‘ఆ వొస్తున్న’ అంటూ పరుగుతో వచ్చింది సౌజన్య. పెరట్లో గోలగోలగా అల్లరిచేస్తూ నవ్వుకుంటున్నట్టున్నారు. ఆమె వె­హంలో ఇంకా ఆ నవ్వు అట్లే వుంది.

కూతురు భుజాల చుట్టూ చేం­వేస్తూ ‘ఇదుగోరా నీ కోడలు’ అంది. సౌజన్య వె­హంలో నవ్వు స్థానంలో కొత్తవాళ్లను చూసినప్పటి ఇబ్బంది తాలూకు ఛాయలు చోటుచేసుకున్నాం­.

‘మావయ్య సౌజీ, ఎప్పుడడుగుతుంటవ్‌ గదా. చూడాలనుందనేదానివి గద’

సౌజన్య వె­హం అప్రసన్నంగా ‘నేనేం అన్లేదులే’ అంది.

సౌజన్య వె­హంలో అప్రసన్నత ఎందుకో అర్థం కాలేదు. ‘ఊరికే చిరాకుపడే స్వభావం లాగుందే’ అనుకున్నాడు.

రవీందర్‌ పదిహేనేండ్ల తర్వాత ఆ అమ్మాం­ని చూస్తున్నాడు. అతను చివరిసారి చూసినపుడు అం­దేళ్ల పాప.

మంచంలోంచి వచ్చి సౌజన్య తలమీద చేం­వేసి ‘ఏం చదువుతున్నవ్‌రా’ అడిగాడు.

‘డిగ్రీ ఫైనలియర్‌ రాసిన’ నేలచూపులు చూస్తూ వ­క్తసరిగా చెప్పింది సౌజన్య.

ఇంకేం మాట్లాడలేదు రవీందర్‌. ‘అమ్మో! సీరియస్‌ టైప్‌లా ఉంది’ అనుకున్నాడు మనసులో.

కానీ అదే రోజు రవీందర్‌ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చాలాసేపు అక్కతో మాట్లాడుతూ ఉండిపోం­ సాయంత్రం పెరటివైపు వెళ్లాడు. పిల్లలతో ఆడుతూ లలితతో ఏదో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతోంది సౌజన్య. దూరం నుండి కాసేపు చూసి దగ్గరగా వెళ్తూ ‘ఏం సౌజీ, బాగల్లరి జేస్తున్నవ’ అన్నాడు నవ్వుతూ.

లలితతో మాటలాపి ఇబ్బందిగా వె­హం పెట్టి నేలచూపులు చూస్తూ నిల్చుండిపోం­ందామ్మాం­.

ఈ అమ్మాం­కి కొత్తవాళ్ల వ­ందు ఇబ్బందేమో అనుకుంటూ అక్కడినుండి కదిలాడు రవీందర్‌.

ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక పెరట్లో చేరినారు. రవీందర్‌, రత్నమాల మాత్రం ఇంటి వ­ందు అరుగులమీద కూర్చొని మాట్లాడుకోసాగారు.

‘నా మాటిని వరంగల్‌కు రా రవీ, అక్కడేదన్న చూస్కుందువు గని’

‘లేదక్కా, నాకేంజేసే ఓపిక లేదు. ఏదో ఇట్ల నడ్వనీ’ నవ్వాడు.

‘పుష్పక్కూడా ఇక్కడుండడం ఇష్టం లేనట్టుందిరా. నువ్వన్న జెప్పు మీ తవ­్మడికి అని మాట్లాడిరది’

‘అక్కా! అందరికీ ఇష్టవ­న్నట్టే జరుగుతయా? సర్దుకోవాలె గదా. ఆ సంగతి ఒదిలెయ్‌ ఇంక… నీ గురించి జెప్పు బాబెట్లున్నడు? వాన్ని జూన్నే లేదు. తీస్కరాక పోం­నవా?’

‘వానికెంసెట్‌ ఎంట్రన్సుంది కద రవీ, వాన్ని రమ్మన్నా రాడు. సదువుమీద బాగానే శ్రద్ధుందిరా వానికి. సౌజీ గురించే నాకు రంధి పట్టుకుందిరా. నీతో జెప్పాలనే వచ్చిన నేను వ­ఖ్యంగా. సౌజీ సంగాలు గింగాలు అని తిర్గుతుందిరా. పార్టీతోని దానికి సంబంధాలున్నాయట. ఎంత జెప్పిన ఇంటలేదు. మీ బావ సంగతి తెలుసుగా. ఆయనకివన్నీ పట్టవుగద. తండ్రీ బిడ్డలకు క్షణం బడ్తలేదింట్ల’ చిన్నగా గొంతు తగ్గించి చెప్పసాగింది రత్నమాల.

సౌజన్య వె­హంలోని అప్రసన్నత ఎందుకో అర్థమం­ంది రవీందర్‌కు. నోటమాట రానట్టు ఉండిపోయాడతను. ‘నువ్వే దానికి నచ్చజెప్పాలె రవీ, నువ్వం­తే బాగ అర్థమయ్యేట్టు విడమర్చి జెప్పుతవ్‌. అందులోనూ నువ్వండ్ల పంజేసి వొచ్చినవ్‌ కాబట్టి కష్టసుఖాలు బాగా తెలుస్తయ్‌. మీ బావ గూడ ‘రవి చాల తెలివం­నోడు, సౌజీని ఒప్పించగల్గుతడు’ అన్నడు. నేనెల్లుండి పోత. అది నాలుగైదు రోజులుంటనన్నది మాట్లాడు రవి’

రవీందర్‌ ఏం మాట్లాడలేదు.

‘వె­న్న మీ బావవాళ్ల మామను, అదే ఆ ఎమ్మెల్యేను కల్సినంరా! మనకింత సాయంజేసిన మనిషిని పలుకరిస్తే మర్యాదగుంటదని నేనూ మీ బావ పోం­నం. ఆయన ‘మీ తవ­్మడ్ని పైసలు తీసుకోమని జెప్పమ్మా’ అన్నడ్రా, నీకిష్టం లేదని జెప్పిన. పైసలు తీసుకోని వాళ్లని పోలీసులు అనుమానిస్తున్రట. నీ విషయం అనుమాన పడొద్దనీ, పోలీసులకు నచ్చజెప్పమని నేను, మీ బావ ఒక్కతీర్గ జెప్పినం’

‘నేను జెప్పుడు కాదు. మినిష్టర్‌తోని జెప్పిచ్చిన. అంద్కనే మీ తవ­్మన్ని ఇడిసిపెట్టిన్రు. లేకుంటే ‘పైసలు తీసుకోం’ అన్నోళ్లను చాలా ఇబ్బందులు పెడుతున్రు’ అన్నడు. ఎట్లనన్న జేసి నీమీద పోలీసుల కన్నుబడకుంట జేయమని మరీ మరీ జెప్పినం.

‘తర్వాత మీ బావగూడ ‘రవి డబ్బులు తీస్కోవచ్చుగా’ అన్నడు. నేను మాత్రం ‘ఎందుకొచ్చిన తిప్పలు పైసలు తీస్కుంటే పార్టోళ్లకు కోపవె­స్తదేమో. అం­నా మా తవ­్మడు నిమ్మళంగ మా దగ్గరుంటే మాకదే పదివేలు. ఏ పైసలు మాకొద్దు’ అన్నరా.’

‘అక్కా తవ­్మళ్లకు వ­చ్చటొడుస్తలేదా? పండుకోరా ఏంది?’ అంటూ వచ్చింది పుష్ప.

‘ఆ వస్తున్నం పుష్పా, లేరా రవీ పోదం’ అంటూ లేచింది రత్నమాల.

రత్నమాల, పుష్ప ఇద్దరూ మాట్లాడుకుంటూ పెరటివైపు దారి తీసారు. పుష్ప ఎవ్వరితోనూ పెద్దగ కల్వలేకపోం­ంది గానీ రత్నమాలతో మాత్రం కొంచెం చనువుగా

ఉండసాగింది. భర్తను ఎంతో కొంత దారికి తేగలిగింది రత్నమాల మాత్రమేనని ఆమె నమ్మకం.

రవీందర్‌ ఒంటరిగా చీకట్లో అరుగుమీద కూర్చుండిపోయాడు.

ఏమన్నది అక్క… తను బాగా మాట్లాడగలడు అని కదూ, తనకు బాగా మాట్లాడగలననే పేరుంది. తన మాటలద్వారా పార్టీలకు ఆకర్షించగలననే పేరుండేది. మరిప్పుడు తన మాటల ద్వారా సౌజీని పార్టీకి దూరం జేయాల్నా? తనలా చేయగలడా? రవీందర్‌ ఆలోచనలు అంతం లేకుండా సాగుతున్నయ్‌.

లి లి లి

‘ఏం సౌజీ, పుల్లతో పండ్లు తోవ­తున్నవ్‌’

‘నాకిష్టం దీనితో తోవ­కొనుడు.’

రవీందర్‌ వె­హం కడుక్కోవడానికి బావి మీద కొచ్చేప్పటికి సౌజీ ఒక్కతే పళ్లు తోవ­కుంటూ కనబడిరది. తప్పనిసరై పలకరించాడు రవీందర్‌.

‘ఏది నీ సైన్యం’ నవ్వుతూ అడిగాడు.

‘ఇంకా లేవలేదు’ ఆ అమ్మాం­ వె­హంలో అదే అప్రసన్నత. అం­నా కొనసాగించదలుచుకున్నాడు రవీందర్‌.

‘డిగ్రీ అం­పోం­ందిగా తర్వాతేం జెయ్యదల్సుకున్నవ్‌రా’

‘పి.జి. జేస్త’

‘ఏ సబ్జెక్ట్‌’

‘తెలుగు లిటరేచర్‌’

‘ఇంట్రస్టా?’

అవునని కాదనీ చెప్పలేదు సౌజన్య. ఓ ఇబ్బందికరమైన నవ్వు నవ్వి వె­హం కడుక్కోవడానికి నీళ్లు చేదుకోసాగింది. రవీందర్‌ పళ్లు తోవ­కుంటూ ఆ అమ్మాం­ వైపే చూడసాగాడు. చూస్తున్న కొద్దీ వ­చ్చటగా అన్పించ సాగిందామ్మాం­.

వరంగల్‌లో తనకు బాగా తెల్సిన కామ్రేడున్నాడు. బహుశా ఈ అమ్మాం­కి తెల్సుండొచ్చు. ఎలా ఉన్నడో ఒక్కసారి అడిగితే… అడిగితే జెప్తదా? నాకు దెల్వదంటే? ఎట్లుంటే నీకెందుకంటే… అసలు నన్ను నవ­్మతదా ఈ అమ్మాం­? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్న రవీందర్‌ వె­హంలో దిగులు ఆవరించసాగింది.

లి లి లి

‘వచ్చినప్పటినుండి జూస్తున్న, మావయ్యతో అస్సలు మాట్లాడ్తలేవేంది సౌజీ?’ లలిత మాటలు రవీందర్‌ను కిటికీ దగ్గర నిలబెట్టినయ్‌. పొలం దగ్గరకు వెళ్లడానికి బట్టలు మార్చుకుందామని గదిలోకి వెళ్లాడు రవీందర్‌. పెరట్లో వేపచెట్టు కింద మంచంలో కూర్చొని లలిత, సౌజన్య తన గురించే మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతుంటే కిటికీ దగ్గర ఆగిపోయాడు.

‘ఏమో లల్లక్కా, నాకస్సలు మాట్లాడ బుద్ధం­తలేదు. నాకు పార్టీ పరిచయవ­న్నప్పటి నుంచి మావయ్యను ఎంతో గొప్పగ ఊహించుకున్న, మనవాళ్లంతా మావయ్య గురించి గొప్పగ చెబుతుంటే వ­రిసిపోం­న. ఎంత లేదనుకున్న అంత పెద్ద నాయకుడికి అక్క కూతురునైనందుకు గర్వంగా వుండేది. ఒక్కసారైనా అతన్ని చూడాలని ఎన్నెన్నో మాట్లాడాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. కానీ ఇప్పుడిట్ల… మావయ్యను నేనిట్ల చూడాలనుకోలేదు లల్లక్కా.’

‘నువ్వు కోరుకోలేదు సౌజీ. నేను గూడ కోరుకోలేదు. కోరుకోనిదే జరిగింది. కానీ నువ్వొక్క మాటం­నా మాట్లాడకపోతే… చూసట్లా వె­హం మాడ్చుకుంటే మావయ్యెంత బాధపడ్తడు. నువ్వు చిన్న పిల్లవం­తే ‘పోనీలే తెల్వదు’ అనుకుంటడు. కానీ నువ్వన్నీ తెల్సిన దానివం­తివి.’

‘ఆయన బాధపడ్తడనే ఆలోచిస్తున్నవ్‌ గనీ, నేనెంత బాధ పడ్తున్నానో ఆలోచించవెందుకు? నాలెక్క ఇంకెంతమంది బాధ పడుతుండ్రో ఆం­నట్లం­నందుకు? అంతెందుకు నీకు బాధలేదా? నువ్వాయన్ని వ­నుపటిలెక్కన ప్రేమిస్తున్నవా?’

‘నేను వ­నుపటి లెక్కనే ప్రేమిస్తున్న సౌజీ. తను నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మంచి అన్నయ్యే. అందులో మార్పులేదు. అందుకే నా ప్రేమ కూడా మారలేదు సౌజీ. నిజానికి తన మీద నా ప్రేమ పెరిగింది. ఎందుకంటే నాకు లోకజ్ఞానం వచ్చిన తర్వాత అన్నయ్యను ఇప్పుడే దగ్గర్నుంచి జూస్తున్న. తనీ నిర్ణయం ఎందుకు తీస్కున్నడో తెల్వదు. నేనడ్గలేదు. గాయాన్ని కెల్కదల్చుకోలే. తనకు పార్టీ మీదం­తే వ్యతిరేకత లేదు. ఆ విషయం తేటతెల్లం. ఆయన నిర్ణయం తప్పొప్పులు ఎంచే శక్తి నాకు లేదు. ఏదం­నా కాలమే నిర్ణం­స్తుంది. చెప్పలేం అన్నయ్య తన నిర్ణయం మార్చుకుని మళ్లా పార్టీలకు పోతడేమో ఎవరికెరుక.’

‘పార్టీలకు పోతాడో, ద్రోహుల్ల కలుస్తడో ఎవరికెరుక?’

‘నీకేమన్న పిచ్చిపట్టిందా? ఏమిటే నువ్వు మాట్లాడేది?’

‘ఇప్పుడు జరుగుతున్నదే మాట్లాడ్తున్న. చూస్తున్నంగా లొంగిపోం­నవాళ్లు ఎంత ద్రోహానికి దిగజారుతున్నరో. జారుడు మెట్లమీద అడుగు బెట్టినతర్వాత ఇక దిగజారుడుకు హద్దేం ఉంటది లల్లక్కా.’

‘నువ్వన్నది నిజమే సౌజీ. ద్రోహాల్ని అనుభవిస్తున్నాం. నిజమేగని లొంగిపోం­ నోళ్లందర్ని ఒక్కగాటన కట్టుడు మంచిదికాదు. వ­ఖ్యంగ మావయ్య గురించి ఏం తెల్సుకోకుండ మాట్లాడుతున్నవు నువ్వు. అమ్మమ్మ జెప్పింది. మీ నాన్న, మీ చుట్టపాయన, ఆ ఎమ్మెల్యే ద్వారా పోలీసులు మావయ్యను ద్రోహిగ మార్చేటందుకు చాలా ప్రయత్నాలు జేసిండ్రట. మావయ్య చాల వె­ండిగున్నడట. ‘నేనిగ ఏం జెయ్యలేక బయట కొచ్చిన అంతేగని ద్రోహం జేసెందుకు గాదు, నన్ను మావూలుగా బత్కనియ్య దల్చుకుంటే బత్కనియండ్రి లేకుంటే సంపుండ్రి అన్నడట తెల్సా? ఇవ్వన్నీ తెల్సుకోకుంట నువ్వు మాట్లాడితే ఎట్ల.’

పిల్లలు అల్లరిచేస్తూ వాళ్ల దగ్గరికి రావడంతో మాటలాపేసారు.

కళ్లు తుడుచుకొని గదిలోంచి బయటపడి పొలందారి పట్టాడు రవీందర్‌.

‘ద్రోహుల్ల కలుస్తడో ఎవరికెరుక’ అనే సౌజన్య మాటలు పదే పదే గుర్తొస్తూ గుండెను కోస్తున్నయ్‌. నిజమే పాపం తన భయాలు తనకుంటయ్‌. జరుగుతున్న ద్రోహాలు తెల్సినవే. పోలీసులు చాలానే ప్రయత్నించిండ్రు ద్రోహిగ మారుస్తందుకు. ఇవన్నీ వ­ందుగ ఊహించినవే. బయటకొచ్చేవ­ందు పార్టీ గూడ ఇవన్నీ చర్చించింది. అందుకనే వె­ండిగున్నడు. అం­తే పోలీసులు ఇగ ఒదిలేసిండ్రనుకోనక్కర్లేదు. మళ్లా మళ్లా గూడ ప్రయత్నాలు జేjె­చ్చు. తమకు సాయంజేయక తప్పదని నిర్బంధిస్తే…? తాను సావనైనా సస్తాడు గానీ ద్రోహం మాత్రం జేయడు. ఇప్పటికే ప్రజలు తన మీద బెట్టుకున్న ఆశలను వవ­్మజేసి ద్రోహం జేసిండు. ఇంతకంటే ద్రోహం తను చేయడు.

లి లి లి

నారుమడి చుట్టూ తిరిగి నారును పరీక్షగా చూసి దానికి ఎప్పుడు ఎరువు వేయాల్నో ఆశాలుతో మాట్లాడసాగాడు రవీందర్‌. రోజుకంటే ఎక్కువగా మాట్లాడసాగాడు. మధ్యాహ్నం విన్న లలిత సౌజన్యల మాటలు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోకుండా ఉండడం కోసం ఆశాలుతో పిచ్చాపాటీ మాట్లాడసాగాడు.

‘ఏం ఆశాలూ, నీ కొడుకు పదోది పాసం­ండన్నవ్‌, మరి సద్విస్తవా?’

‘సద్విద్దమనుకుంటున్నయ్యా’ అని కొద్దిగా సంశం­ంచి ‘మనోళ్లు సద్వించ మంటుండ్రయ్యా’ అన్నాడు.

ఆ ‘మనోళ్లెవరో’ అర్థమం­ ఆశ్చర్యపోయాడు రవీందర్‌. గతంలో ఓసారి ఆశాలుతో తనకు జరిగిన సంభాషణ గుర్తొచ్చిందతనికి

లి లి లి

రవీందర్‌, ఆశాలు దాదాపు ఒకే వయస్సు వాళ్లు. ఆశాలు పది పన్నెండేళ్ల వయసులోనే నారాయణరెడ్డి ఇంట్లో పశువుల్ని కాసే జీతగాడుగా కుదిరిండు. తర్వాత అతని తండ్రిస్థానంలో పెద్ద జీతగాడైండు. చిన్నప్పట్నుంచి ఉన్న అనుబంధమేమో ఆ కుటుంబంలో అందరితో చనువుగా మాట్లాడేవాడు.

ఓ రోజు పొలందగ్గర మర్రిచెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుతున్న రవీందర్‌ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఆశాలు. రవీందర్‌ అప్పుడప్పుడే పార్టీ పనిలో సీరియస్‌గా ఇన్వాల్వ్‌ అవుతున్నాడు.

‘దొరా’ పిలిచాడు ఆశాలు.

‘ఇగో ఆశాలు నీకెన్నిసార్లు జెప్పాలె. నన్ను ‘దొరా, గిరా’ అని పిలవొద్దని’ విసుక్కున్నాడు రవీందర్‌.

‘ఏంది దొరా నువ్విచ్చిత్రంగా మాట్లాడ్తవ్‌ గని. దొరవ్‌ దొరవ్‌ గాకుండెట్లం­తవ్‌’

‘దొరలకు, దొరతనానికి వ్యతిరేకం మేం. మరి మేమే దొరా అని పిలుపిచ్చుకుంటమా?’

‘నేను గదే జెప్తున్ననయ్యా, నీ గురించి బాపెంత బాధపడుతుండో నీకెర్కనా? నువ్వొక్కనివే కొడుకువైతివి, నీగ్గయన్ని ఎందుకయ్యా. నీకేం తక్వ. తాతలు సంపాం­ంచిన బూవ­లున్నయ్‌. బాపు జూడు ఇగురంగ జేస్తుండు. అక్క పెండ్లి సుత ఎంత గొప్పగ జేసిండు. మా అసంటోళ్లకు కూడు బెడ్తుండు.’

‘బాపు మీకు బెడ్తుండా కూడు? మీ అసంటోళ్లు కష్టం జేసి మాకు బెడుతుండ్రా?’

‘నువ్వు గట్ల మాట్లాడకయ్యా, బాపేమన్న కూకోని తింటుండా? మాతో సమానంగా కట్టం జేస్తడు! గంతెందుకు. తల్సుకుంటే నువ్వు కూడా మాతోటి సమానంగ జేస్తవ్‌ గద. నువ్వు గూడ బాపులెక్క ఇగురంగ జేస్కోవాలె. ఇంతకు రెండిరతలు బూవి సంపాం­ంచాలె. నా అసంటోళ్లను ఇంక నల్గురిని బెట్టుకొని ఆళ్లకు తొవ్వ సూం­ంచాలె. అంతేగని గా పనులు నీకెందుకయ్యా, కూడు బెట్టని పన్లు’

‘అరె నువ్వేంది ఆశాలు అసలెవరికైనా వాళ్లకు దున్నుకోసాతనం­నంత బూమే ఉండాలని మేమంటుంటే ఇంతకు రెండిరతలుండాలంటవ్‌. మాకు రెండిరతలు కావాలని కోరుకుంటున్నవ్‌గానీ నీగ్గూడ బూవ­ండాలని ఎందుగ్గోరుకోవు?’ విసుక్కున్నాడు రవీందర్‌.

‘నాకు బూవ­ండాలనుకోంగనే వస్తదా ఏంది?’

‘అక్కడక్కడ ఊళ్లల్ల దొరల భూవ­లు నీ అసంటోళ్లు గుంజుకుంటుండ్రు ఆశాలు’

‘గట్ల గుంజుకునుడు ఏం నాయమయ్యా? ఆళ్ల తాతల తాతల నుండి ఒస్తున్న బూవిని గుంజుకొనుడు ఏం నాయం? గుంజుకుంటే మటుకు ఆళ్లకుంటదా ఏంది? నాకెందుకయ్యా బూవి. మీరు సల్లగుంటె నేను బత్కనా?’

‘ఎందుకాశాలు ఎన్ని రోజులిట్ల బాంచెన్‌ బత్కు బత్కుతవ్‌. నేనుజేస్తుంది కూడుబెట్టని పన్లన్నవ్‌ జూడు. కానీ నేనుజేస్తుంది కూడుబెట్టే పన్లే ఆశాలు. నీ అసంటోళ్లకు దక్కాల్సిన కూడు న్యాయంగా దక్కేటట్లు జేసేవే మా పన్లు. నీ అసంటోళ్లకు తొవ్వ జూం­ంచాలన్నవ్‌ జూడు. తొవ్వ జూం­ంచాలంటే మరి నేను గీ పనే జెయ్యాలె. నేనే గాదు మనందరం కల్సే జెయ్యాలె. గప్పుడే నీ అసంటోళ్ల బత్కులు మారుతయ్‌. గట్ల జేస్తనే నేను తొవ్వ జూం­ంచినట్లు గనీ నేను రెండిరతలు వూడిరతలు బూవి సంపాం­స్తే మీకు తొవ్వ జూం­ంచినట్లుగాదు. మీ తొవ్వ బంజేసినట్టు.’

‘ఏందోనయ్యా నువ్వు జెప్పేది బాగనే ఉంటది గని. మారె యాడం­తది గని, అమ్మ, బాపు దేవునసంటోళ్లు నువ్వు గిట్ల తిరిగి ఆళ్లను బాదపెట్టకయ్యా’

లి లి లి

‘ఏందయ్యా ఆలోసన్ల బడ్డవ్‌’

‘ఏం లేదాశాలూ అప్పట్ల మనిద్దరం వాదిచ్చుకుంటోళ్లం గదా. నన్ను పార్టీల ఏంజెjె­్యద్దనేటోనివి. ఇప్పుడు మారినట్టున్నవ్‌ గదా’ ఏం మాట్లాడకూడదనుకుంటూనే ఉండబట్టలేక అనేశాడు రవీందర్‌.

‘మారకుంటెట్లుంటనయ్య, సూస్తున్న గద నువ్వప్పుడు జెప్పినట్టే కూడు సంపాం­ంచే పనేజేత్తాంది పార్టీ. జీతాలు పెరిగినయ్‌, కూల్లు పెరిగినయ్‌, బూవులు గూడ వొస్తయంటున్నరు. అన్నింటికంటే మాసంటి మాదిగోళ్లను గూడ మనుషుల లెక్క జూసుడు వె­దలైంది.’

నారుమడి నిండడంతో మోటార్‌ ఆపేయడానికి బావివైపు వడివడిగా కదిలాడు ఆశాలు. రవీందర్‌ ఆలోచనల్లో పడ్డాడు. ఏ ఆలోచనని దారి మళ్లించడానికి ఆశాలుతో కబుర్లలో పడ్డాడో ఆ ఆలోచనలు విజృంభించినయ్‌.

అప్పట్ల తనను పార్టీలకు పోవద్దని చెప్పిన ఆశాలు ఇయ్యాల పార్టీని సొంతం జేస్కున్నడు. మరి తను బయటకొస్తే తను ఏమనుకుంటుండో, కచ్చితంగా బాధ పడుతుంటడు. సౌజీ బాధపడుతా వుంది, ఆశాలూ బాధపడతా వున్నడు.

సౌజీకి తను బయటకొచ్చేసుడంటే ఇన్నాళ్లు గొప్పగా ఊహించుకున్న మావయ్య, ఇన్ని రోజులు తనకాదర్శంగా నిల్చిన మావయ్య దిగజారడం, ఉద్యమానికి తాత్కాలిక నష్టం.

కానీ ఆశాలుకు తను బయటకొచ్చేసుడంటే… ఇప్పుడిప్పుడే మనుషులుగా తమకొచ్చిన గుర్తింపు ఏమం­పోతదోనన్న బాధ, నోటికాడికొచ్చిన కూడు మట్టిలో కలుస్తదేమోనన్న వేదన.

‘అవె­్మస్తాందయ్యా’ అనే ఆశాలు కేకతో రవీందర్‌ ఆలోచనలకు అంతరాయం ఏర్పడిరది.

రవీందర్‌ వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. ‘అమ్మెందు కొస్తుందిప్పుడు’ అంటూ వడివడిగా ఎదురెళ్లసాగాడామెకు. కోతలు పూర్తం­నప్పటి నుండి సరోజమ్మ పొలం దగ్గరకు రాలేదు.

‘ఏందమ్మా ఇట్లొచ్చినవ్‌. చీకటయ్యే టైంకు’ ఎదురుగ నిలబడి అడిగాడు రవీందర్‌.

‘ఇంట్లుండ బుద్ధికాలేదు రవీ. రావాలన్పిచ్చింది వొచ్చిన’ అంటూ వొరం దిగి ఇంకా దున్నని మడిలో అడ్డం పడి నడువసాగింది. రవీందర్‌ అనుసరించాడామెను. ఇద్దరూ మర్రి చెట్టు కిందకు పోం­ కూర్చున్నారు.

కాసేపు ఇద్దరూ అదీ ఇదీ మాట్లాడుకున్నారు.

సందె చీకట్లు వ­సురుకుంటుండగా ‘నీకో విషయం సెప్పాలె రవీ’ అంటూ వె­దలు పెట్టబోం­ంది సరోజమ్మ.

‘ఏం విషయమమ్మా’ ఏదో విశేషవ­ందని అర్థమం­ందతనికి. తల్లి వె­హంలో దిగులు కన్పించిందతనికి.

‘నీకు శంకర్‌ తెల్సా రవీ’

‘శంకరా’

‘అదే లల్లమ్మ పంచాయతప్పుడు దళ కమాండరుగున్నడు. ఇప్పుడు ఇక్కడ జిల్లా కమిటీలున్నడు.’

‘పరిచయం లేదమ్మా. విన్న తన గురించి’ ఆశ్చర్యంగా అన్నాడు రవి. శంకర్‌ ప్రస్తావన ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదతనికి.

‘మాకు అప్పుడే పరిచయం రవీ అతను. తర్వాత ఇక్కడికే కమాండరు గొచ్చిండు. అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. బాగ పరిచయమం­ండు. లల్లమ్మ అతన్ని పెళ్లి జేస్కోవాలనుకుంటుంది రవీ’ సరోజమ్మ ఆగింది.

అయోమయంలో పడ్డాడు రవీందర్‌. విన్న మాటలు అర్థం కావడానికి కొంచెం టైం పట్టిందతనికి.

‘నిజమామ్మ’ అనే మాట అతని గొంతులోనే ఆగిపోం­ంది.

కొన్ని నిమిషాల మౌనం తర్వాత ‘లల్లీ బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకుందామ్మా’ అని మాత్రం అనగలిగాడు.

‘ఆలోచించకుంట ఎట్ల నిర్ణం­ంచుకుంటది రవీ’

‘అతను లోపల, లల్లీ బయట…’

‘లల్లమ్మ కూడా దళంలకు పోవాలని నిర్ణం­ంచుకుంది రవీ’

రవీందర్‌ నుంచి నిశ్శబ్ద ప్రతిస్పందన.

‘మరి పిల్లలు..’

‘నేంజూస్కుంటనని జెప్పిన’ నోట మాట రానట్టు తల్లివైపు చూస్తూ ఉండి పోయాడతను.

‘నాలుగైదు రోజుల్లో లల్లమ్మ ఎల్లిపోవాల్సి వస్తదేమో, మీ బాపుకింక జెప్పలే. ఇయ్యాల జెప్తనన్నది.’

తలొంచుకొని కూర్చున్న రవీందర్‌ కదల్లేదు. మెదల్లేదు.

‘ఏమో రవీ మేం జేసిన పెళ్లి అట్ల పెటాకులం­ంది. ఈ వయసుకి దాని బత్కు మోడు బారిందనుకుంటె గుండె తరుక్కుపోయేది. మళ్ల పెళ్లి జేద్దమంటే మాటలా! ఇద్దరు పిల్లల తల్లాయె. చేసినా మళ్లెసువంటోడు దొర్కుతడో అన్న భయమేనాయె. దానిగ్గూడ మనసు విరిగింది. ఏ ప్రయత్నం చేjె­ద్దంది. విరాగిని లెక్క తయారం­ంది. దళం పరిచయం లల్లమ్మలో చాల మార్పు తీసుకొచ్చింది. వైరాగ్యం మాయమం­్యంది. చిన్న చిన్న పార్టీ పనులు జేసుకుంట తృప్తిపడేది. శంకర్‌ పరిచయంతో దాని వె­ఖంల వెలుగొచ్చింది. శంకర్‌ పెళ్లి చేస్కుందామంటే చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది.

‘శంకర్‌ ప్రమాదకరమైన పనిలున్నడు ఎప్పుడేమం­తడో తెల్వదు గదరా’ అని నేనంటే ‘మనసుకు నచ్చిన మనిషితో ఒక్కరోజు కల్సిబత్కినా సాలు’ అన్నది రవి. ఇంక నేనేం అడ్డం జెప్పలేదురా. మోడులెక్క మా కళ్లవ­ందు తిర్గేకంటే దానికి నచ్చిన జీవితాన్ని అదెన్నుకోనీ అనుకున్నరా’

రవీందర్‌ ఆలోచించుతునే వున్నాడు. తలొంచుకున్న కొడుకును చూస్తే తల్లి మనసు ఆర్థ్రమం­ంది. కొడుకు వీపులో చేం­వేసి మెల్లగా నివ­రుతూ మాట్లాడసాగింది.

‘రవీ, ఏం ఆలోచన చేస్తున్నవయ్యా, నేను బయటకొస్తే నా చెల్లెలు పోతుంది అనుకుంటున్నవా? నువ్వట్ల ఆలోచించొద్దురా. పదిహేనేండ్లు నువ్‌ కష్టపడి పంజేసినవ్‌. నిజాం­తీగా చేసినవ్‌, నిప్పులెక్క జేసినవ్‌, నీ మనసే విరిగిందో, నువ్వలసిపోం­నవో వొచ్చినవ్‌. నువ్వెవ్వరికీ ద్రోహం జేసి రాలె. పైసలెత్తుకొని రాలే. పార్టీతో చెప్పే వొచ్చినవ్‌. వొచ్చిగూడ కష్టపడి బత్కుతున్నవ్‌. నిజాం­తిగ బత్కుతున్నవ్‌. నువ్వొదిలి వచ్చిన బాటను నీ చెల్లెంచుకుందని నువ్వు బాధ పడొద్దు. అది నిన్నవమానిస్తున్నట్టుగా గూడ నువ్వాలోచించొద్దు. దానిష్టం దానిది. దానిష్టవె­చ్చిన దానిని దాన్నెంచుకోనిద్దం రవీ’ సరోజమ్మ గొంతుకు దుఃఖం అడ్డుపడి మాటలాపి భోరుమంది.

రవీందర్‌ తమాం­ంచుకోలేకపోయాడు. తల్లి భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.

కాస్సేపటికి ఇద్దరూ ఒకర్నొకరు ఓదార్చుకున్నారు.

‘అమ్మా, బాగ సీకటైంది. లేమ్మా ఇంటికి పా. నేను జర కాసేపాగి వొస్త’ అన్నాడు.

కొడుకు నొదిలిపెట్టి పోవాలనిపించలేదామెకు. అతన్ని భుజాల చుట్టూ చేతులేసి నడిపించుకుపోవాలనుంది. తన భుజాల మీద కొడుకు చేం­వేసి తనను నడిపించుకుపోతే బావుండుననుకుంది.

‘కల్సిపోదం రారాదయ్యా.’

‘నువ్వు పోమ్మా నాక్కొంచెం పనుంది, ఆశాలుతో మాట్లాడాలె’ ఆమె భుజం తడుతూ చెప్పాడతను.

కాదన్లేక కదిలిందామె. గుండె బరువెక్కినట్లుగా ఉందామెకు. ఆమె జీవితంలో ఎదురు పడుతున్న ఇటువంటి సంఘటనలు ఆమె ఊహకందనివే. నారాయణరెడ్డి భార్యగా ఇల్లు, పిల్లలే ప్రపంచంగా బ్రతికిందామె. ఇద్దరాడపిల్లల్ని ఏ పదో తరగతో చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయడం, కొడుకును మాత్రం బాగా చదివించి పెద్ద

ఉద్యోగస్తుడ్ని చేయడం ` ఇవే అప్పట్లో ఆమె కన్న కలలు. దాదాపు ఆమె భర్త ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. అందుకనుగుణంగానే కూతురుకు ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. కొడుకును పై చదవుల కోసం పట్నానికి పంపించారు. అప్పుడే ఆమె జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడం వె­దలైంది. తన కొడుకు కంటే వ­ందు, తమ కొడుకుతో పాటు పై చదువులకు వెళ్లిన తమ కులపోళ్ల, పాలోళ్ల పిల్లల పోకడే మారిపోయేది. పట్నంలో పుట్టి పెరిగినట్టు ప్రవర్తించేవాళ్లు. వాళ్ల పోకడ చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా వ­రిసిపోయేవాళ్లు. సరోజమ్మకు కొడుకు అంతుపట్టేవాడు కాదు. ఓ కాలు వూరిలో ఓ కాలు పట్నంలో వున్నట్టుండేవాడు. వ­నుపటికంటే శ్రద్ధగా వ్యవసాయపు పనిలో తండ్రికి సాయం చేసేవాడు. కూలోళ్లతో పాటు పనిచేస్తూ వాళ్లతో స్నేహం చేసేవాడు. వాళ్ల ఇండ్లకు పోం­ కూర్చొని వ­చ్చట పెట్టేవాడు. ఊళ్లోకొచ్చే కొడుకు తమ కోసం కాక ఎవరికోసమో, దేనికోసమో ఊళ్లోకొస్తున్నట్టు అన్పించేది. ఊళ్లో చాపకింద నీరులా ఏదో సాగిపోతున్నట్టనిపించేది. మరి పట్నంలో ఏం చేసేవాడో తెలియదు కానీ ఫస్టుక్లాసులో పాసవుతూ ఇంకా పై చదువులకు పోయేవాడు. ఉన్నట్టుండి చదువు బందుపెట్టి ఊళ్లొకొచ్చేశాడు. చాపకింది నీరు ఉప్పెనం­ంది. తమకు పంచ ప్రాణాలైన కొడుకు మరెందరికో పంచప్రాణాలుగా మారడం, మరికొందరికి కంట్లో నలుసై పోవడం కొంత కొంత అర్థమవుతూనే వుంది. తమ భద్ర జీవితానికి ఏదో వ­ప్పు వాటిల్లుతుందని అర్థమవసాగింది. ప్రవాహానికి అడ్డుకట్టవేయాలని చూసింది. అశక్తురాలై పోం­ంది. రహస్య జీవితానికి వెళ్లిన కొడుకును తలచుకొని ఏడ్చేది. ఎన్ని కష్టాలు పడుతున్నడో… ఎక్కడ తింటున్నడో… ఎక్కడ ఉంటున్నడోనని బాధపడేది. చుట్టాలు పక్కాలు కొడుకు గురించి ఏమనుకుంటున్నరో అని బాధపడేది. వ­సలితనంలో తమకు తోడెవరని బాధపడేది. చిన్న కూతురు పెళ్లం­న తర్వాత కొడుకు గురించి బాధపడ్డం తగ్గిపోం­ంది. కూతురు గురించిన బాధ వ­ందు అన్ని బాధలు చిన్నవై పోయాం­. అప్పుడు గూడా కొడుకుంటే కూతురు జీవితం ఇలా అయ్యేది కాదని బాధపడిరది. కూతురు జీవితం ఓ సమస్యగా తయారం­నపుడు, కూతురు సమస్యకూ, కొడుకు పోరాటానికి మధ్య ఏదో సంబంధమున్నట్లు అస్పష్టంగా అన్పించిందామెకు. కూతురు భర్త నుండి విడిపోయి ఇంటికొస్తే నరకం తప్పిందని సంతోషపడిరది. మళ్లీ కూతురు జీవితం ఇలా అయినందుకు కృంగిపోయేది. ఇంతలో చప్పున చల్లారిందనుకున్న ఊరు నిప్పయి రాజుకోవడం మొదలెట్టింది. తప్పిపోయిన కన్నబిడ్డ తిరిగొచ్చి నట్టనిపించిందామెకు. తన కొడుకే ఊళ్లోకొచ్చి నట్టనిపించిందామెకు. ఊళ్లో జరుగుతున్న మార్పులు ఆమెకు సత్తువనిచ్చాయి. ఇన్నాళ్లు కొడుకు ప్రస్తావన ఎవరన్నా తెస్తే మౌనంగా ఉండేది. కానీ ఇప్పుడు కొడుకు గురించి గర్వంగా గొప్పగా చెప్పసాగింది. కూతురు పార్టీ పట్ల ఆకర్షితురాలవడం గమనించినా భయపడలేదామె. కూతురు తీసుకున్న నిర్ణయానికి ముందు బాధపడిరది. ‘మగపిల్లవాడయితే ఫర్వాలేదుగానీ ఆడపిల్ల, పైగా ఇద్దరు పిల్లల తల్లి, పార్టీలో చేరితే నల్గురూ ఏమనుకుంటారూ’ అని సతమతమయింది. కానీ ‘మోడు’లా కళ్లముందు ఉండటం కంటే సంతోషంగా ఎక్కడైనా ఉండనీ అనుకుంది. గుండె నిబ్బరం చేసుకుంది. ఇంతలో కొడుకు నుంచి కబురు లొంగిపోతానంటూ. ఊళ్లో ఈ మార్పుకు ముందు కొడుకు లొంగిపోతానంటే చాలా సంతోషించి ఉండేది. కానీ ఇప్పుడామె ఊహించనిది, ఆశించనిదీ. అయినా కొడుకు మీదున్న ప్రేమవల్ల కొడుకును తప్పు పట్టలేక పోయింది. తప్పటడుగుల చిన్నారికి చేయందించినట్టే కొడుక్కి అందించింది.

వెళ్తున్న తల్లిని చూస్తుంటే హృదయం ద్రవించింది రవీందర్కి. అమ్మ ఎంత నలిగిపోతుందో అనుకున్నాడు.

‘లల్లీ కష్టాల బాటను ఎంచుకుందని ఒకవైపు బాధ, లల్లీ నిర్ణయాన్ని చూసి నేను అవమానంగా తీసుకొని ఎక్కడ కుమిలిపోతనోనని మరోవైపు బాధ, ఎంత నలిగి పోతున్నవమ్మా. లల్లీ పోతనంటే ఒద్దన్లేదు. నేను వస్తనంటే ఒద్దన్లేదు. ఎట్లమ్మా నీ మనసును అర్థం జేసుకునేది…..’ మరోసారి కళ్లు తుడుచుకున్నాడు.

రవీందర్‌ ఆలోచనలో పడ్డాడు. అమ్మా, లల్లీ, సౌజీ, సురేష్‌ వాళ్ళమ్మ, నాన్న, చెల్లి, ఎవరు వీళ్ళంతా? రేపుని కాపాడ్డానికి పాకులాడుతున్నవాళ్లు? మరి తను… తనెవరూ?

పదిహేనేళ్లకు పూర్వం ఈ ఊళ్ల మొట్టమొదట పోరుమొలకయినవాడు. జిల్లా మొత్తం పోరు విత్తనాలు జల్లినవాడు… రాష్ట్ర ఉద్యమంలో మూల స్తంభమయినవాడు… రాష్ట్ర సరిహద్దులనూ చెరిపేసినవాడు… అయిలయ్యలనూ, సురేష్లనూ తీర్చిదిద్దినవాడు… అమ్మలను, లల్లీలను, సౌజీలను, శంకరయ్య సార్లనూ, సుశీలమ్మలనూ మరెందరినో తయారు జెయ్యాలని కలలు కన్నవాడు….. ఒంటరిగా తిరిగిన రోజుల్లో పదిమంది మెప్పుడయితమా… అని తపించిపోయినోడు. కలలు ఫలించినయ్‌, తపన నెరవేరింది. కానీ తనేమయ్యిండు? కలలు కనుడు మరిచిపోయిండు! తపించుడు మానుకున్నడు!

కలలు కనడం మర్చిపోయినంక కలలు ఫలిస్తేనేం? ఫలించకపోతేనేం?

ఏమాలోచించిండు తను? పదిహేనేళ్ల గత జీవితాన్ని తుడిచేసుకుని, పదిహేనేండ్లు వెనుకకుపోయి అక్కడి నుండి మళ్లా తన జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నడు. తను వదిలేసిన ఈ వూర్లెకు, తను వదులుకున్న తనింట్లకు అమ్మ, బాపు, అక్క సౌజీల మధ్యకు మళ్లా తన పూర్వ స్థానంలకు వొచ్చెయ్యాలనుకున్నడు. అవును తన పూర్వ స్థానంలకు వచ్చేయాలనుకున్నడు తను. ఎన్నేండ్లు, ఎక్కడ దిరిగి ఎప్పుడు వచ్చినా తన స్థానం తనకుందనే ధీమా. తన కుటుంబానికున్న పలుకుబడితో తను బాగనే బతగ్గలననే ధీమా. ఆ ధీమా లేకుంటే? తనక్కడ్నే చావో రేవో తేల్చుకునేటోడా? లల్లీ ఉద్యమంలకు పోయి కొన్నేళ్ల తర్వాత తనుగూడ తిరిగొస్తదా? రాదు! తను చాలా గట్టిగ నిలబడుతది. ఎందుకంటే తను ఉద్యమావసరాన్ని తన జీవితసారంలోంచి గుర్తించింది. అంతేకాదు ఒక స్త్రీగా, తిరిగొచ్చినా తనకిక్కడ ఏ స్థానమూ ఉండదు. ఏ ‘భద్ర’ జీవితం ఆమెను ఆహ్వానించదు. అయిలయ్యా అంతే… ఉద్యమం, జీవితం ఒక్కటే అయిన అయిలయ్య… ఉద్యమాన్ని విడదీస్తే విడిగా బతుకంటూ లేని అయిలయ్య… ఉద్యమాన్ని విడిచిపెడితే ఇక శతృవు చెప్పుకిందనే బతకాలని తెల్సిన అయిలయ్య… అందుకే శతృవు ఎదురుపడితే గుండె చూపిండేగానీ, వెన్ను జూపలేదు. శత్రుపంచన గాకుండా తన పూర్వ స్థానంలో తనుండగలననే ధీమాతో తనొచ్చిండు. శత్రుపంచన తను లేడు. సరే! తన పూర్వ స్థానం తనకుందా? లేదు! తన స్థానం గల్లంతయింది! అందరి స్థానాలు ముందుకు పోయినయ్‌. ఊరు ఊరే ముందుకు పోయింది. ఒకప్పుడు తన పాఠాలు నేర్చుకున్న వూరు, ఇప్పుడు సగర్వంగా తనకు పాఠాలు నేర్పడానికి సిద్ధమయింది!

బయటకొచ్చే ముందట తనేం ఆలోచించిండు. ఇన్నేళ్ల ఉద్యమ జీవితం తర్వాత మామూలు జీవితం గడపాలంటే చాలా ఘర్షణే ఉంటదనుకున్నాడు. ఒక చైతన్యపూరిత వాతావరణంల మసులుకునుడు అలవాటయి వెనుకబడిన భావజాలమున్న వాతావరణం లకు వెళ్లి బత్కాలంటే కష్టమే అనుకున్నడు. కానీ తను తలకిందులుగా ఆలోచించిండు. వీళ్లంతా మారిండ్రు. ఎదిగిండ్రు. తనే వీళ్లకంటే చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ రకంగా ఘర్షణ తప్పుతలేదు. ఈ మార్పును తనెందుకు ఊహించలేదు? ఇన్నాళ్లు తను చెయ్యలేకనే, చేతగాకనే బయటగొచ్చినగని, రాజకీయాల పట్ల విశ్వాసం తగ్గలేదనుకుంటున్నడు. కానీ తనకు రాజకీయాల పట్లనే విశ్వాసం తగ్గిందా? లేకుంటే ఆ రాజకీయాలను, ఆ రాజకీయాలు వేసే ప్రభావాన్ని ఎందుకు ఊహించలేకపోయిండు?

‘ఏందయ్యా పొద్దుపోయింది ఇంకా ఈడ కూసున్నవ్‌’ ఆశాలు మాటలతో స్పృహలోకి వచ్చాడు రవీందర్‌. నెమ్మదిగా లేచి ఇంటి బాట పట్టాడు.

 ఇల్లు దగ్గర పడిరది. తలుపులు దగ్గరగా వేసున్నయ్‌. ఇంట్లోకి వెళ్లడానికి మెట్లెక్కసాగాడు. లోపల నుండి తండ్రి గొంతు గట్టిగా వినబడ్డంతో రెండు మెట్లకిందే ఆగిపోయాడు.

‘పార్టీ మంచిదే అయితే, నిజంగనే ఈ రాజ్యం మార్తదనే నమ్మకముంటే అన్నయ్య బయట కెందుకొస్తాడు?’ ఆవేశంగా అడుగుతున్నాడు నారాయణరెడ్డి.

‘అన్నయ్యనే చెప్పమను బాపూ! పార్టీ మంచిది కాదనీ, ఈ రాజ్యం మారదనీ. అన్నయ్యనే చెప్పమను’ నెమ్మదిగా చెప్తోంది లలిత.

రెండు మెట్లెక్కి తలుపుతోసి ‘పార్టీ మంచిదే. ఈ రాజ్యం కచ్చితంగ మార్తది’ అని ఇప్పటికీ చెక్కు చెదరని తన విశ్వాసాన్ని ప్రకటించాల్నా?

‘పార్టీ మంచిదైతే, రాజ్యం మార్తదని నమ్మకముంటే, మరి పార్టీనిడ్చిపెట్టి నువ్వెందుకొచ్చినవ్‌’ అని తండ్రడిగితే ఏమని చెప్పాలి?

రవీందర్‌ ఎక్కాల్సిన మెట్లు ఎక్కనులేక, ఎక్కిన మెట్లు దిగనూ లేక సందిగ్ధంలో నిలబడిపోయాడు.

అరుణతార, సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2001

 ‘కదిలే కథ’ సంకలనం

Leave a Reply