య్యస్ ... మీరు నన్ను

నక్సలైటు కొడుకని

అన్నప్పుడల్లా ....

నా కాలర్ ఎర్రజండాలా ఎగురుతుంది.!

***

అర్బన్ నక్సలైటు అని

వేలెత్తి చూపినప్పుడల్లా

ఆత్మవిశ్వాసంతో

తిరగబడుతున్న దండకారణ్య

పిడికిళ్ల రూపమవుతా !

***

నన్ను నాస్తికుడని

మీరు నవ్వినప్పుడు

మీ నవ్వే చెప్పింది ...

నాస్తికత్వం మనిషికి

నవ్యానంద జీవన మార్గమని !

Leave a Reply