1.పిల్లలు
పసిపిల్లల
ఊయ్యాలలో
పాలస్తీనా
నీవొక
ప్రతిఘటనల
రంగుల రాట్నవిని..!
2. ఉదయాలు..!
ప్రపంచమంతా
ఉదయించిన
సూర్యుడు
ఎందుకో
పాలస్తీనాలో
కనబడలేదు..?
3.నెలవంక
నెలవంకను
చూసి
ఒక్కపొద్దులు ఉండే
రంజాన్ మాసం
ఇలా
నెత్తుటితో తడవడం ఏలా..?
4.గర్భం..
ఏ శిశువుకైనా
రక్షణ స్థలం
అమ్మ గర్భం
కానీ
ఇప్పుడు
పాలస్తీనలో
అమ్మ గర్భాన్ని
చీల్చిన
నరమేధపు ఇజ్రాయిల్..!
5.ప్రేమ…!
సుర్మా పెట్టే
నీ కండ్లల్లో
ఈ నల్లటి ధూళి ఏలా
నిన్ను ముద్దాడే
ఆ పెదాల మీద
ఈ వెచ్చటి నెత్తురు ఎలా
ఓ ప్రియా..!!
(పాలస్తీనాకు బాసటగా…)