పల్నాడు జిల్లాలో ఒకవైపు కృష్ణానది పరవళ్ళు  తొక్కుతున్న  దాని అతి సమీపంలో ప్రజలు త్రాగునీరు సాగునీరు లేక  వలసలు పోతున్నరు, పశువులకు నీళ్లు దొరకని ప్రాంతం కూడా ఎగువ పల్నాడు లోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలం, ప్రకాశం జిల్లా పుల్లల  చెరువు, ఎర్రగొండపాలెం  ప్రాంతాలు, 1944 ప్రాంతంలో నందికొండ  ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, 1954లో నందికొండ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ) నిర్మాణం సందర్భంగా  కోస్ల  కమిటీ వెల్దుర్తి, దుర్గి,మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు తదితర మండలాలు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండడంతో దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాలని సూచించారు. 1972లో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఈ ప్రాంత రైతాంగం ఐక్యమై ఆందోళన చేయడంతో, ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నెదర్లాండ్ ఇంజనీర్లతో సర్వే చేయించాడు, అప్పట్లో దీని బడ్జెట్ 30 నుండి 35 లక్షలతో ప్రారంభిస్తే ఎగువ పల్నాడు లోని 1,20,000 ఎకరాలు సాగులోకి వచ్చునని, నాలుగున్నర లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని అత్యంత ఏనుకబడిన  మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు, దీనిపై నాడే  పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు పార్లమెంట్లో చర్చికి పెట్టారు, అయినా పాలకుల నిర్లక్ష్యం వలన దానిని గాలికి వదిలేశారు.

80 ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ప్రవేశించిన విప్లవోద్యమం 90 నాటికి ఈ ప్రాంతం లో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి, త్రాగునీరు సాగునీరు లేక  పస్తులతో ఉన్న ప్రజలను  విప్లవకారులు  అనేక కరువు దాడులు చేయించారు, ఈ క్రమంలో ఈ ప్రాంత ప్రజల కరువు నుండి గట్టెక్కించాలంటే దమ్మర్లగుంది ఎత్తిపోతల  పథకంగా ముందుకు వచ్చింది, 2005 వరకు పలనాడు, వేలనాడు ప్రాంతాల్లో దమ్మర్లగుంది లిఫ్ట్  ఇరిగేషన్ కోసం పెద్ద ఎత్తున ప్రజాపోరాటాలు బద్దలు అయ్యాయి.

దమ్మర్ల గొంది లిఫ్ట్ ఇరిగేషన్ సాధించుకోవాలని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు, ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని,  అధికారం చేపట్టిన ప్రతి పార్టీ హామీ ఇచ్చినటువంటి వాళ్లే, 1996లో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు, 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన  చేశారు, 2022 లో వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి గా శంకుస్థాపన చేశారు, తిరిగి నేడు అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు మరొకసారి శంకుస్థాపన చేశారు, దీనికి రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని, గతంలో అనుకున్న ఎత్తిపోతల పథకం కాకుండా చిన్న ప్రాజెక్టుగా నిర్మాణం చేయాలని పరిశీలకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, దానిని ఆమోదించినటువంటి ప్రభుత్వం పనులు మొదలు పెట్టక, బడ్జెట్ విడుదల చేయక కాలయాపన చేస్తూ ఉన్నారు.

 కృష్ణ డెల్టా కోసం మూడో పంట కోసం ఆగ మేఘాలపై పల్నాడు ప్రజలు వ్యతిరేకిచ్చిన పులి చింతల  రిజర్వాయర్ నిర్మాణం చేశారు, నాగార్జునసాగర్ పై ఎత్తును శ్రీశైలం  దిగువన దమ్మర్ల గొంది ఎత్తిపోతల పథకం సాధన కోసం ఎన్నో మిల్టెంట్ పోరాటాలు పల్నాడు ప్రజలు చేశారు.

 2005 తర్వాత వివిధ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు దీని పేరు మార్చి వరికపూడి సెళ ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది, దీనిలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు యాక్టివ్ గా దీని సాధన కోసం పోరాడారు, అధికారంలో ఉన్న నాటి నేటి పార్టీలు బడ్జెట్ లేదని, పర్మిషన్లు లేవు అని కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎగు పల్నాడు, వెలనాడుగా చెప్పుకునే వినుకొండ బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ఎర్రగొండపాలెం ప్రజల కల కలగానే మిగిలిపోయింది,

ప్రధానంగా వర్షాధారపు పంటలతో బ్రతుకు బండి లాగుతున్నారు, త్రాగునీరు కోసం బోర్లు వేసుకోవాలన్నా 12 వందల అడుగులు వేయక తప్పడం లేదు, భూగర్భ జలాలు కూడా అడుగంటి, ఏసవిలో పెద్ద ఎత్తున తమ ప్రాంతం వదిలి పశుపక్షాదులతో వలస పోవాల్సిన పరిస్థితి ఉన్నది, వలసలు నివారించి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి చెందాలంటే తక్షణమే ఒరికపూడి సెళ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, ఈనెల 24 నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాలలో  ఈ ప్రాజెక్టు కోసం ఖచ్చితమైన బడ్జెట్ కేటాయించి, ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

Leave a Reply